AP Inter Hall Tickets Download : ఏపీ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!
AP Inter Hall Tickets Download : ఏపీ ఇంటర్ మొదటి, రెండో సంవత్సర హాల్ టికెట్లను బోర్డు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
AP Inter Hall Tickets Download : ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల హాల్ టికెట్లను(AP Inte Hall Tickets) శుక్రవారం ఆన్ లైన్ లో అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు bieap.apcfss.in అధికారిక వెబ్ సైట్ లో హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1న ప్రారంభమై మార్చి 19, 2024 వరకు కొనసాగుతాయి. ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షలు మార్చి 2న ప్రారంభమై మార్చి 20న ముగుస్తాయి.
ఇంటర్ హాల్ టికెట్లు డౌన్ లోడ్ ఎలా?
Step 1 : https://bieap.apcfss.in/ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Step 2 : హోమ్‌పేజీలో "మార్చి 2024 థియరీ హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్"ని క్లిక్ చేయండి.
Step 3 : లాగిన్ లో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చి 2024 రోల్ నెం./ మొదటి సంవత్సరం హాల్-టికెట్ నెం./ SSC హాల్‌టికెట్ నం.(మొదటి సంవత్సరం విద్యార్థులకు)
వివరాలను నమోదు చేయండి. పుట్టిన తేదీ, పేరు ఎంటర్ చేయాలి.
Step 4 : అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్తు అవసరం కోసం కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.
రాష్ట్ర వ్యాప్తంగా 1559 పరీక్షా కేంద్రాలు
ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియేట్ పరీక్షలకు 1559 పరీక్షా కేంద్రాల్లో 10,52,221మంది విద్యార్థులు హాజరవుతారని, గత ఏడాదితో పోలిస్తే 47,921 మంది అధికంగా పరీక్షలకు హాజరవుతున్నారన్నారని చెప్పారు. పరీక్షా కేంద్రానికి 100 మీటర్ల సమీపంలో 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ షాపులు తెరవకూడదన్నారు. పరీక్షా కేంద్రంలోకి ఫోన్లు అనుమతి లేదని, సిబ్బంది ఎవరి వద్ద ఫోన్లు ఉండకూడదని ఆదేశించారు. ఈ ఏడాది మార్చి1న జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు 10,52,221 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్షలకు హాజరవుతున్న 10,52,221 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులలో గతేడాది పరీక్షలలో ఉత్తీర్ణులు కానీ 93,875 మంది విద్యార్థులు హాజరవుతారు.
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల తేదీలు
- మార్చి 1 - PART-II సెకండ్ లాంగ్వేజ్ పేపర్-I
- మార్చి 4- PART-I ఇంగ్లీష్ పేపర్ -I
- మార్చి 6 -మ్యాథమెటిక్స్ పేపర్-1A, బోటనీ పేపర్ - 1 , సివిక్స్ పేపర్ - 1
- మార్చి 9 - మ్యాథమెటిక్స్ పేపర్-1B, జువాలజీ పేపర్ - 1, హిస్టరీ పేపర్ - 1
- మార్చి 12- ఫిజిక్స్ పేపర్ - 1, ఎకనామిక్స్ - 1
- మార్చి 14 - కెమిస్ట్రీ పేపర్ - I, కామర్స్ పేపర్ - 1, సోషియాలజీ పేపర్ - 1, ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ పేపర్ -1
- మార్చి 16 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ - I, లాజిక్ పేపర్ -1 , బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్ - 1
- మార్చి 19- మెడ్రన్ లాంగ్వేజ్ పేపర్- I, జాగ్రఫీ పేపర్- 1
ఇంటర్ సెకండియర్ పరీక్షల తేదీలు
- మార్చి 2- PART-II సెకండ్ లాంగ్వేజ్ పేపర్-II
- మార్చి 5 -PART-I ఇంగ్లీష్ పేపర్-II
- మార్చి 7- మ్యాథమెటిక్స్ పేపర్ పేపర్ - IIA, బోటనీ పేపర్ -II, సివిక్స్ పేపర్- II
- మార్చి 11 - మ్యాథమెటిక్స్ పేపర్ - IIB, జువాలజీ పేపర్ పేపర్ -II, హిస్టరీ - II
- మార్చి 13 - ఫిజిక్స్ పేపర్- II, ఎకనామిక్స్ - II
- మార్చి 15 - కెమిస్ట్రీ పేపర్ - II, కామర్స్ పేపర్ - II, సోషియాలజీ పేపర్- II, ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ పేపర్ -II
- మార్చి 18 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ - II, లాజిక్ పేపర్ -II , బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్ - II
- మార్చి 20 - మెడ్రన్ లాంగ్వేజ్ పేపర్- II, జాగ్రఫీ పేపర్-II
సంబంధిత కథనం