TS Inter Hall Tickets Download : టీఎస్ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!-hyderabad news in telugu ts intermediate hall tickets 2024 released download steps ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Inter Hall Tickets Download : టీఎస్ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

TS Inter Hall Tickets Download : టీఎస్ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

Bandaru Satyaprasad HT Telugu
Feb 25, 2024 04:48 PM IST

TS Inter Hall Tickets Download : తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు ఆన్ లైన్ లో విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

టీఎస్ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల
టీఎస్ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల

TS Inter Hall Tickets Download : తెలంగాణ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు(TS Inter Hall Tickets) ఆన్ లైన్ లో విడుదల చేసింది ఇంటర్మీడియట్ బోర్డు. ఇప్పటి వరకు కళాశాలల ప్రిన్సిపాళ్ల లాగిన్ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ కు అవకాశం ఇచ్చింది. తాజాగా విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అధికారిక వెబ్ సైట్ tsbie.cgg.gov.in నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సవర పరీక్షలు జరుగనున్నాయి. ఈ ఏడాది 9.8 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు.

TS ఇంటర్ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేయడం ఎలా?

  • Step 1 : TSBIE అధికారిక వెబ్‌సైట్‌ tsbie.cgg.gov.in ను సందర్శించండి.
  • Step 2 : హోమ్‌పేజీలో TS ఇంటర్ 1వ సంవత్సరం లేదా 2వ సంవత్సరం హాల్ టికెట్ కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
  • Step 3 : లాగిన్ పేజీలో టీఎస్ ఇంటర్ ప్రథమ లేదా ద్వితీయ సంవత్సరం హాల్ టికెట్ కోసం రోల్ నంబర్ లేదా మునుపటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి.
  • Step 4 : హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది. డౌన్‌లోడ్ చేసుకోండి.

తెలంగాణ ఇంటర్ పరీక్ష తేదీలు

తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు జరుగుతాయి. 2వ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకు జరుగుతాయి. ఫస్టియర్, సెకండియర్ పరీక్షలను ఒకే షిఫ్ట్‌లో నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.

ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్(Inter Exams)

  • 28-02-2024 - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-I
  • 01-03-2024 - ఇంగ్లీష్ పేపర్-I
  • 04-03-2024 - మ్యాథమెటిక్స్ పేపర్-IA / బోటనీ పేపర్-I / పొలిటికల్ సైన్స్ పేపర్-I
  • 06-03-2024 - మ్యాథమెటిక్స్ పేపర్-IB / జువాలజీ పేపర్-I / హిస్టరీ పేపర్-I
  • 11-03-2024 - ఫిజిక్స్ పేపర్-I / ఎకనామిక్స్ పేపర్-I
  • 13-03-2024 - కెమిస్ట్రీ పేపర్-I / కామర్స్ పేపర్-I
  • 15-03-2024 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I / బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-I
  • 18-03-2024 - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-I / జియోగ్రఫీ పేపర్-I

ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూల్

  • 29-02-2024 - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-II
  • 02-03-2024 - ఇంగ్లీష్ పేపర్-II
  • 05-03-2024 - గణితం పేపర్-IIA / బోటనీ పేపర్-II / పొలిటికల్ సైన్స్ పేపర్-II
  • 07-03-2024 - మ్యాథమెటిక్స్ పేపర్-IIB / జువాలజీ పేపర్-II / హిస్టరీ పేపర్-II
  • 12-03-2024 - ఫిజిక్స్ పేపర్-II / ఎకనామిక్స్ పేపర్-II
  • 14-03-2024 - కెమిస్ట్రీ పేపర్-II / కామర్స్ పేపర్-II
  • 16-03-2024 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II / బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-II
  • 19-03-2024 - మోడరన్ లాంగ్వేజ్ పేపర్-II / జియోగ్రఫీ పేపర్-II

సంబంధిత కథనం