Weather: 'నైరుతి రుతుపవనాలపై కీలక అప్డేట్! తెలంగాణలో వర్షాలు, ఏపీకి హీట్ వేవ్ అలర్ట్-southwest monsoon likely to reach andaman in two days ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Southwest Monsoon Likely To Reach Andaman In Two Days

Weather: 'నైరుతి రుతుపవనాలపై కీలక అప్డేట్! తెలంగాణలో వర్షాలు, ఏపీకి హీట్ వేవ్ అలర్ట్

HT Telugu Desk HT Telugu
May 20, 2023 06:23 AM IST

Weather Updates of Telugu States: తెలంగాణకు వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాళ్టి నుంచి మూడు నాలుగు రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఏపీలోని 23 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిచింది.

నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు

Telangana and AP Weather Updates: గత కొద్దిరోజులుగా భానుడి దాటికి ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు ఉక్కపోతతో వేడితో జనం అల్లాడుతున్నారు. పలు జిల్లాల్లో ఏకంగా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే మండే ఎండల్లో తెలంగాణకు వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాళ్టి నుంచి తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో 4 రోజులపాటూ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. ఈ ప్రభావంతోనే పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని… ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఎండ‌లు దంచికొట్టాయి. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌రుస‌గా ఎనిమిదో రోజు 45 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. క‌రీంన‌గ‌ర్, న‌ల్ల‌గొండ జిల్లాల్లో అత్య‌ధికంగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని వీణ‌వంక‌, న‌ల్ల‌గొండ జిల్లాలోని దామ‌ర‌చ‌ర్ల‌లో 45.4 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదైన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. నిర్మ‌ల్ జిల్లా క‌డెం పెద్దూరులో 45.1 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా జ‌న్నారంలో 44.9, సూర్యాపేట జిల్లా మోతెలో 44.8, గ‌రిడేప‌ల్లిలో 44.8, మంచిర్యాల జిల్లా దండేప‌ల్లిలో 44.5, రాజ‌న్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగిలో 44.5, క‌రీంన‌గ‌ర్ జిల్లా జ‌మ్మికుంట‌లో 44.5, పెద్ద‌ప‌ల్లి జిల్లా ముత్తారంలో 44.5, పెద్ద‌ప‌ల్లి జిల్లా రామ‌గుండంలో 44.5, కొమరంభీం జిల్లా కెరిమెరిలో 44.4, నిజామాబాద్ జిల్లా భోధ‌న్‌లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు రికార్డు అయినట్లు వెల్లడించింది. ఇక హైద‌రాబాద్ లోని ఖైర‌తాబాద్‌లో అత్య‌ధికంగా 42.5 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదైంది.

ఏపీకి హీట్ వేవ్ అలర్ట్…

మరోవైపు ఏపీలో ఎండలు మండుతున్నాయి. ఇవాళ 23 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తుల శాఖ పేర్కొంది. శుక్రవారం చాగలమర్రిలో 46.2°C, సిద్ధవటంలో 45.2°C, రొంపిచర్లలో 44.9°Cల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనవి.రానున్న 2 రోజులు కొన్నిచోట్ల అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెట్ల కింద నిలబడరాదని హెచ్చరిచింది.

బయల్దేరిన నైరుతి…

నైరుతి రుతు పవనాలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది వాతావరణశాఖ. శుక్రవారం ఇవి ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్‌ దీవులు, దక్షిణ అండమాన్‌ సముద్రంలోని కొన్ని భాగాల వరకు ప్రవేశించినట్లు బులెటిన్ విడుదల చేసింది. జూన్‌ నాలుగో తేదీ నాటికి కేరళను తాకవొచ్చని అంచనా వేసింది.

WhatsApp channel