IMD Monsoon prediction: నైరుతి రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన; ఈ ఏడు సాధారణ వర్షపాతమే
IMD Monsoon prediction: రుతు పవనాల రాకపై భారత వాతావరణ విభాగం కీలక ప్రకటన చేసింది. కేరళకు నైరుతి రుతుపవనాలు జూన్ 4 వ తేదీ వరకు చేరుతాయని వెల్లడించింది.
IMD Monsoon prediction: రుతు పవనాల (Monsoon) రాకపై భారత వాతావరణ విభాగం (India Meteorological Department IMD) కీలక ప్రకటన చేసింది. కేరళకు నైరుతి రుతుపవనాలు జూన్ 4 వ తేదీ వరకు చేరుతాయని వెల్లడించింది. సాధారణంగా నైరుతి రుతు పవనాలు (southwest monsoon) కేరళకు జూన్ 1వ తేదీ వరకు చేరుతాయి. ఈ సంవత్సరం అవి జూన్ 4 (model error of +/-4 days)వరకు కేరళకు వస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) ప్రకటించింది.
IMD Monsoon prediction: అంచనా మిస్ అవలేదు..
2015లో మినహాయిస్తే, రుతు పవనాల రాకపై ఐఎండీ (IMD) అంచనా గత 18 ఏళ్లలో ఇంతవరకు తప్పలేదు. గత సంవత్సరం నైరుతి రుతుపవనాలు (southwest monsoon) రెండు రోజులు అటుఇటుగా మే 27న కేరళకు చేరుతాయని ఐఎండీ (IMD) అంచనా వేసింది. అవి మే 29న కేరళకు చేరాయి. అలాగే 2021లో మే 31న భారత్ కు చేరుతాయని ఐఎండీ అంచనా వేయగా, అవి జూన్ 3వ తేదీన చేరాయి. నైరుతి రుతుపవనాల రాకతో భారత్ లో వర్షకాలం ప్రారంభమవుతుంది. రుతుపవనాల ఆగమనం ఆధారంగా రైతులు తమ వ్యవసాయ కార్యక్రమాలకు సిద్ధమవుతారు.
IMD Monsoon prediction: 96% వర్షపాతం
ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ (IMD) వెల్లడించింది. దీర్ఘకాలిక సగటు (long period average LPA) ప్రకారం ఈ సంవత్సరం 96% (+/-5%) వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. సాధారణ వర్షపాతం నమోదు కావడానికి 35% అవకాశం ఉండగా, సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు కావడానికి 29% అవకాశం, అతి తక్కువ వర్షపాతం నమోదు కావడానికి 22% అవకాశం, సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదు కావడానికి 11% అవకాశం, అత్యధిక వర్షపాతం నమోదు కావడానికి 03% అవకాశం ఉందని ఐఎండీ (IMD) వివరించింది. మరోవైపు, ప్రైవేట్ వాతావరణ అధ్యయన సంస్థ స్కై మెట్ (skymet) ఈ సంవత్సరం సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదువుతుందని ప్రకటించింది.
టాపిక్