BJP Telangana : ఫ్లోర్ లీడర్ గా మహేశ్వర్ రెడ్డి, ఈ ఎమ్మెల్యేలకు కొత్త బాధ్యతలు - రాజాసింగ్ కు నో ఛాన్స్..!-nirmal mla aleti maheshwar reddy is bjp floor leader in telangana assembly ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bjp Telangana : ఫ్లోర్ లీడర్ గా మహేశ్వర్ రెడ్డి, ఈ ఎమ్మెల్యేలకు కొత్త బాధ్యతలు - రాజాసింగ్ కు నో ఛాన్స్..!

BJP Telangana : ఫ్లోర్ లీడర్ గా మహేశ్వర్ రెడ్డి, ఈ ఎమ్మెల్యేలకు కొత్త బాధ్యతలు - రాజాసింగ్ కు నో ఛాన్స్..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 14, 2024 05:03 PM IST

BJP Telangana Floor Leader in Assembly : తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నియమించింది బీజేపీ తెలంగాణ. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వం ప్రకటన విడుదల చేసింది.

బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రె్డ్డి
బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రె్డ్డి (facebook)

Nirmal MLA Aleti Maheshwar Reddy : తెలంగాణ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఎవరనే దానిపై నిర్ణయం తీసుకుంది బీజేపీ తెలంగాణ నాయకత్వం. నిర్మల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. గోషామహల్ నుంచి గెలిచిన రాజాసింగ్ కు అవకాశం దక్కుతుందని అంతా భావించారు. కానీ చివరగా మహేశ్వర్ రెడ్డి పేరు ఖరారైంది. పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నియమించింది. శాసనమండలిలో బీజేపీ తరపున ఎవీఎన్ రెడ్డి ఫ్లోర్ లీడర్ గా ఉండనున్నారు.

  1. బీజేపీ ఫ్లోర్ లీడర్ - ఏలేటి మహేశ్వర్ రెడ్డి
  2. డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు - పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి.
  3. రామారావు పటేల్ - బీజేపీఎల్పీ కార్యదర్శి.
  4. పాల్వాయి హరీశ్ బాబు - చీఫ్ విప్, బీజేపీఎల్పీ.
  5. ధన్ పాల్ సత్యనారాయణ - బీజేపీఎల్పీ విప్.
  6. రాకేశ్ రెడ్డి - కార్యదర్శి.

ఎన్నికలు పూర్తై రెండు నెలలు కావొస్తున్నప్పటికీ బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరనే దానిపై స్పష్టత ఇవ్వకపోవటంతో అనేక విమర్శలు వినిపించాయి. సొంత పార్టీ నేతలు కూడా కొంత అసహనానికి గురయ్యారు. ఇటీవలే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఫ్లోర్ లీడర్ ప్రకటన ఆలస్యం పార్టీకి ఏమాత్రం మంచిది కాదన్నారు. ఎవరో ఒకరని ఫ్లోర్ లీడర్‌గా త్వరగా ఎంపిక చేస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. తనకు శాసనసభాపక్షనేత పదవిపై ఆసక్తి లేదని చెప్పుకొచ్చారు. జహీరాబాద్ ఎంపీగా పోటీ చేయమని పార్టీ కోరుతోందని.. కానీ తనకు ఎంపీగా పోటీ చేసే ఆసక్తి లేదని చెప్పుకొచ్చారు రాజాసింగ్.

మరోవైపు లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది బీజేపీ తెలంగాణ. 17 స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు సిద్ధమైంది. సిట్టింగ్ ఎంపీలకు మరోసారి అవకాశం ఇవ్వటం ఖాయమని తెలుస్తుండగా… ఐదు నుంచి ఆరు స్థానాల్లో వలస నేతలకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో…. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురిని తమవైపునకు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ చేరికలు ఉండే అవకాశం ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇక హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి సీటు కోసం పార్టీలోని చాలా మంది కీలక నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ సీటు ఎవరికి దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

Whats_app_banner