Threat Calls To Rajasingh : శోభయాత్ర చేస్తే చంపేస్తాం, రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్
Threat Calls To Rajasingh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. తనను చంపేస్తానని బెదిరింపు కాల్ వచ్చిందని రాజాసింగ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
Threat Calls To Rajasingh : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ రావడం కలకాలం రేపుతుంది. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు గతంలో కూడా ఇలాగే పలుమార్లు బెదిరింపు కాల్స్ రాగా....ఇప్పుడు మరోసారి కూడా అదే తరహాలో బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆయనే స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. శ్రీరామనవమి రోజున శోభయాత్ర తీస్తే చంపేస్తామని కొందరు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ.... రాజా సింగ్ ట్విట్టర్ లో ఒక వీడియో విడుదల చేశారు. అయితే తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ పై ఆయన స్పందిస్తూ.....తనను ఏమైనా చేయాలి అనుకుంటే ఫోన్లు చేసి బెదిరించడం కాదని, దమ్ముంటే నేరుగా తన వద్దకు రావాలని రాజాసింగ్ వారికి ఛాలెంజ్ విసిరారు. గతంలోనూ ఇలాంటి బెదిరింపు కాల్స్ చాలానే వచ్చాయని రాజాసింగ్ చెప్పుకొచ్చారు.
దమ్ముంటే నా ముందుకు రండి
నమ్మిన సిద్ధాంతం కోసం తాను ఎంత దూరమైనా వెళతానని రాజాసింగ్ అన్నారు. ఇలాంటి బెదిరింపులు తననేమీ చేయలేవని స్పష్టం చేశారు. బెదిరింపులకు పాల్పడేవారు ఎంతటి స్థాయి వ్యక్తులు అయిన తనకు అవసరం లేదని వారికి నిజంగా దమ్ముంటే తన ముందుకు వచ్చి వార్నింగ్ ఇవ్వాలన్నారు. అయితే తనకి ఏ ఏ నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అనేది కూడా తెలిపారు. 7199428274, 9223532270 నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ఆయన వివరించారు. కాగా జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరుగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
పాకిస్తాన్ నుంచి కాల్స్
రాజా సింగ్ కు బెదిరింపు కాల్స్ రావడం ఇదేమి మొదటి సారి కాదు గతంలో కూడా ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. కొంతకాలం కిందట ఎమ్మెల్యే రాజాసింగ్ ను చంపేస్తామంటూ దుండగులు బెదిరింపు కాల్స్ చేయగా......ఆ కాల్స్ పాకిస్తాన్ నుంచి వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో రాజాసింగ్ వీడియోలు కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. తనకు వచ్చిన కాల్స్ పై అప్పట్లో డీజీపీగా ఉన్న అంజన్ కుమార్ యాదవ్ కు ఎమ్మెల్యే రాజా సింగ్ ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు తనకు వచ్చిన ఫోన్ నంబర్స్ అన్నింటినీ పేపర్ పై రాసుకున్నానని రాజా సింగ్ వెల్లడించారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా