POCSO Cases : చిన్నారులపై లైంగిక వేధింపుల్లో అగ్రస్థానంలో హైదరాబాద్
POCSO Cases In Hyderabad : పిల్లలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం (పోక్సో), సైబర్ నేరాల కింద నమోదైన కేసుల సంఖ్య తెలంగాణలో గణనీయంగా పెరిగినట్లు పోలీసు గణాంకాలు చెబుతున్నాయి. నేరారోపణల సంఖ్య కూడా పెరిగింది. ఓవరాల్ గా హైదరాబాద్ లో ఇంకా ఎక్కువగా ఉంది.
తెలంగాణలో పిల్లలపై లైంగిక వేధింపుల కేసులు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ లో చూసుకుంటే మరీ ఎక్కువగా ఉన్నాయి. 2016లో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత పోక్సో చట్టం కింద అత్యధిక కేసులు నమోదవుతున్న ప్రాంతంగా హైదరాబాద్ ఉంది. 2016 నుంచి 1,879 కేసులతో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండగా 2018 నుంచి 327 పోక్సో చట్టం కేసులతో వికారాబాద్ రెండో స్థానంలో ఉంది. లైంగిక వేధింపులతో ముడిపడి ఉన్న కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
పిల్లలు లైంగిక, శారీరక వేధింపులు, సైబర్ నేరాలు, బెదిరింపులు, వెంటపడటం గురించి.. మాట్లాడటానికి భయపడతారని ఓ పోలీసు అధికారి చెప్పారు. శారీరక లేదా లైంగిక వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్పడం సరికాదని, వారు కలవరపడుతారని పిల్లలు అనుకుంటారు. తల్లిదండ్రులు తమను ప్రశ్నించడం, నిందించడం మొదలుపెడతారేమోనని పిల్లలు భయపడతాని పోలీసు అధికారి వెల్లడించారు. అయితే మహిళలు, పిల్లల కోసం సమగ్ర సహాయ కేంద్రమైన భరోసా కేంద్రాలను స్థాపించినప్పటి నుండి పిల్లలపై అత్యాచారం కేసులపై ఫిర్యాదులు చేయడానికి వచ్చే తల్లిదండ్రుల సంఖ్య పెరిగినట్టుగా తెలుస్తోంది.
'తల్లిదండ్రులు, పిల్లలకు అనవసరంగా తాకడం గురించి అవగాహన కల్పించడానికి రాష్ట్రవ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలు జరిగాయి. సమాజం, సామాజిక ప్రవర్తన గురించి నేర్చుకుంటూనే ఉంటారు. వారికి ఏ ప్రవర్తన సరియైనది, ఏది కాదో తెలియకపోవచ్చు. సేఫ్ టచ్, అన్ సేఫ్ టచ్ గురించి పిల్లలకు నేర్పించడం మంచిది.' అని పోలీసు అధికారి చెప్పారు.
భరోసా కేంద్రం 2016లో 10 శాతం ఉండగా, 2022 నాటికి 35 శాతానికి పెరిగింది. అంటే ప్రతి సంవత్సరం ఎక్కువ మంది తల్లిదండ్రులు, వారి పిల్లలు ఫిర్యాదులను నమోదు చేయడానికి ముందుకు వస్తున్నారు. NGOలు, యునిసెఫ్ ఉద్యోగులు, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖతో సహా భద్రత, న్యాయ సలహా, వైద్య చికిత్స, ఇతర సేవల గురించి చెబుతున్నాయి.
మరోవైపు పిల్లలకు ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండాలంటే.. ఎలా ఉండాలనే అవసరమైన జ్ఞానం లేదు. ఇది ఆర్థిక దోపిడీ, లైంగిక వేధింపుల వైపు వెళ్తోంది. చాలా సమస్యలకు దారి తీస్తుంది. 2020లో పోలీస్ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన సర్వేలో సైబర్ సెక్యూరిటీపై పిల్లలకు పలు ప్రశ్నలు అడిగారు. సైబర్ భద్రతపై పిల్లల అవగాహన చాలా తక్కువగా ఉంది.