Telugu News  /  Andhra Pradesh  /  Retired Govt Officer Held On Charges Of Having Unnatural Sex With Cow In Vizianagaram
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unplash)

Crime News : ఆవుతో రిటైర్డ్ అధికారి అస‌హ‌జ లైంగిక చ‌ర్య.. చివరికి ఏమయ్యాడంటే?

24 August 2022, 15:16 ISTHT Telugu Desk
24 August 2022, 15:16 IST

కొంతమంది ఆలోచన విధానం ఎలా ఉంటుందో అర్థం కాదు. ఎలాంటి పనులు చేస్తారో తెలిస్తే అందరూ షాక్ అవుతారు. ఛీ.. ఇన్ని రోజులు మంచివాడిలా నటించాడా అనుకుంటారు. ఓ రిటైర్డ్ అధికారి కూడా అలాంటి పనే చేశాడు. ఆవుతో అసహజ లైంగిక చర్యలో పాల్గొన్నాడు.

విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఎవరూ ఊహించని పని చేశాడు. అంతేకాదు.. అతడో రిటైర్డ్ అధికారి కూడా. నలుగురికి మంచి మాటలు చెప్పాల్సిన అతడు.. దారుణం చేశాడు. 62 ఏళ్ల ఆ వ్యక్తి ఆవుతో అసహజ లైంగిక చర్యలో పాల్గొన్నాడు. ఈ విషయం తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. రాజాం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

ట్రెండింగ్ వార్తలు

ఇంత దారుణం చేసిన వ్యక్తి.. ఏపీ ల్యాండ్స్ అండ్ సర్వే డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రామకృష్ణగా గుర్తించారు. అయితే ఆయన కొన్నేళ్లుగా ఆవులు,పెంపుడు కుక్కలతో అసహజ శృంగారానికి పాల్పడుతున్నట్లు తెలిసింది. ఈ విషయం గురించి నిందితుడి బంధువులు, గ్రామస్తులకు ముందే తెలుసు. వారంతా మౌనంగా ఉండిపోయినట్టుగా తెలుస్తోంది. పోలీసులకు చెప్పడం, చేసే పని తప్పు అని వ్యతిరేకించడం చేయలేదు.

తాజాగా రామకృష్ణకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ విషయం పోలీసుల వరకు చేరింది. అతడిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. రిటైర్డ్ అధికారికి మానసిక సమస్యలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేశారు. శారీరకంగా, మానసికంగా బాగానే ఉన్నాడని తెలిసింది. కానీ ఇలా ఎందుకు చేశాడనేది మాత్రం తెలియలేదు. అతడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు పోలీసులు.

IPC సెక్షన్ 377 (మానవుడు లేదా జంతువుతో అసహజ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటే శిక్షించబడతారు) మరియు జంతువుపై క్రూరత్వంతో వ్యవహరించే సంబంధిత సెక్షన్ల కింద రామకృష్ణపై కేసు నమోదు చేశారు.