TS Indiramma Illu: నేడు ఖమ్మం జిల్లాకు సిఎం రేవంత్ రెడ్డి…ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించనున్న సిఎం-cm revanth reddy visit to khammam district and starts the indiramma house scheme ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Indiramma Illu: నేడు ఖమ్మం జిల్లాకు సిఎం రేవంత్ రెడ్డి…ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించనున్న సిఎం

TS Indiramma Illu: నేడు ఖమ్మం జిల్లాకు సిఎం రేవంత్ రెడ్డి…ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించనున్న సిఎం

Sarath chandra.B HT Telugu
Mar 11, 2024 08:03 AM IST

TS Indiramma Illu: తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఖమ్మంలో ప్రారంభించనున్నారు.

 నేడు ఖమ్మం జి్లాకు సీఎం రేవంత్ రెడ్డి
నేడు ఖమ్మం జి్లాకు సీఎం రేవంత్ రెడ్డి

TS Indiramma Illu: తెలంగాణలో మరో ప్రతిష్టాత్మక పథకాన్ని నేడు సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రేవంత్ రెడ్డి Revanth reddy ప్రారంభిస్తారు.

Telanganaలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలును సోమవారం Khammam ఖమ్మం జిల్లాలో ప్రారంభించనున్నారు. భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మైదానంలో సోమవారం జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత స్థలం ఉన్న వారికి ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.5లక్షల ఆర్థిక సాయం, ఇళ్లు లేని నిరుపేదలకు స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభు త్వం అందించనుంది.

ప్రజా పాలనలో దరఖాస్తులు నమోదు చేసుకున్న అర్హులందరికీ ఈ పథకాన్ని వర్తింప చేయనున్నారు. దశలవారీగా రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

సొంత ఇంటి స్థలంలో  Indiramma ఇళ్లు కట్టుకునే వారి కోసం పలు రకాల డిజైన్లను ప్రభుత్వమే తయారు చేయించింది. ఈ నమూనాలో ఒక వంట గది, టాయిలెట్‌ తప్పనిసరిగా ఉంటాయి. ఇంటి డిజైన్లను సీఎం రేవంత్‌ సోమవారం జరిగే కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు.

ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 3,500 ఇళ్లను నిర్మించేందుకు 2024-25 మధ్యంతర బడ్జెట్‌లో రూ.7740 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్‌లో బయలుదేరి తొలుత యాదగిరి గుట్టకు చేరుకుంటారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను లాంఛనంగా ప్రారంభించిన తర్వాత భద్రాచలం బయల్దేరుతారు.

భద్రాచలంలో కొలువైన శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుంటారు. సాయంత్రం నాలుగింటికి భద్రాచలం వ్యవసాయ మార్కెట్‌ ప్రాంగణంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవం ముగిసిన తర్వాత సీతారామా ప్రాజెక్టుతో పాటు సాగునీటి రంగానికి సంబంధించిన ఇతర అంశాలు, భద్రాచలం ఆలయ అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.ఆ తర్వాత మణుగూరు Manuguru చేరుకుని అక్కడ సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు.

సిఎం హోదాలో తొలిసారి జిల్లాకు…

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి రామయ్య సన్నిధిలో అడుగు పెట్టబోతున్నారు. సోమవారం భద్రాచలానికి వస్తున్న ముఖ్యమంత్రి తొలుత శ్రీ రాముని దర్శనాన్ని పూర్తి చేసుకుని అనంతరం ఆరు గ్యారెంటీ ల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించ నున్నారు. సాయంత్రం మణుగూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

భక్తులు దక్షిణ అయోధ్యగా పిలుచుకునే భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానం అనాదిగా నిర్లక్ష్యానికి గురవుతోంది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు మొన్నటి వరకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రామయ్య గుడి అభివృద్ధి పట్టించు కోలేదనే విమర్శలు ఉన్నాయి.

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు వస్తున్న రేవంత్ రెడ్డి భద్రాచలం ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. భద్రాచలం ఆలయ అభివృద్దికి ప్రత్యేక ప్రణాళిక కోసం ఎదురు చూస్తున్నారు.