CM Revanth Reddy Tour : రేపు యాదాద్రి, భద్రాద్రి పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి-ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రారంభం
CM Revanth Reddy Tour : సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి, భద్రాద్రి పర్యటన ఖరారైంది. సోమవారం ఉదయం యాద్రాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, మధ్యాహ్నాం భద్రాచలం వెళ్లనున్నారు.
CM Revanth Reddy Tour : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) యాద్రాద్రి, భద్రాద్రి పర్యటన ఖరారైంది. రేపు(మార్చి 11) సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి(Yadadri Temple) లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. సీఎంతో పాటు ఆరుగురు సహచర మంత్రులు కూడా యాద్రాద్రికి వెళ్లనున్నారు. రేపటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు(Yadadri Brahmotsavam) ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల మొదటి రోజు పూజలలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గోనున్నారు. యాదాద్రి దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నేరుగా భద్రాచలం వెళ్లనున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి యాదాద్రి ఆలయాన్ని దర్శించుకోనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం పర్యటన
సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం(Bhadrachalam) పర్యటన ఖరారైంది. మార్చి 11న సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి చేరుకోనున్నారు. రేపు మధ్యాహ్నం సీఎం భద్రాచలం సీతారాములను దర్శించుకోనున్నారు. అనంతరం భద్రాచలం మార్కెట్ యార్డ్ గ్రౌండ్‌లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని(Indiramma Housing Scheme) ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం భద్రాచలం ఆలయ అభివృద్ధిపై అధికారులతో కలిసి చర్చించనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు మణుగూరు ప్రజాదీవెన సభలో రేవంత్ పాల్గొంటారు. ఈ సభలో ప్రసగించిన అనంతరం సాయంత్రం 5 గంటలకు హెలికాఫ్టర్ లో బేగంపేటకు చేరుకుంటారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం
ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Housing Scheme) పథకాన్ని ఈ నెల 11న భద్రాచలంలో ప్రారంభనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. ఈ పథకం విధివిధానాలు, నిబంధనలను తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఇప్పటికే ఆదేశించారు. స్థలం ఉన్న వారి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, ఇల్లు లేని పేదలకు స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేయాలని సూచన ప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. దశల వారీగా గూడు లేని నిరుపేదల సొంత ఇంటి కల నెరవేర్చడం తమ ప్రభుత్వ సంకల్పమని సీఎం తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందిస్తారు. ఏయే దశల్లో ఈ నిధులను విడుదల చేయాలనే నిబంధనలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. లబ్ధిదారులకు అందాల్సిన నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని చెప్పారు.
సంబంధిత కథనం