(1 / 6)
బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులు తొలి జాబితాను విడుదల చేసింది. కరీంనగర్ నుంచి బి. వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్ రావు మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత పోటీ చేయనున్నారు. గత రెండు రోజులుగా ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం నలుగురు అభ్యర్థులను అధినేత కేసీఆర్ ప్రకటించారు.
(2 / 6)
ఖమ్మం, మహబూబాబాద్ స్థానాలకు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత పేర్లను బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులుగా ప్రకటించింది.
(3 / 6)
తెలంగాణ భవన్ లో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్యనేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR )సోమవారం సమావేశం నిర్వహించారు.
(4 / 6)
లోక్ సభ ఎన్నికలపై (Lok Sabha Elections)దృష్టి పెట్టిన కేసీఆర్... పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో సమావేశం నిర్వహించారు.
(5 / 6)
ఇవాళ ఖమ్మం, మహబూబాబాద్ నేతలతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు.
ఇతర గ్యాలరీలు