TS Govt Praja Palana Applications : 'ప్రజా పాలన' దరఖాస్తులో వివరాలను తప్పుగా ఇచ్చారా..? మీ కోసమే ఈ అప్డేట్
- Telangana Govt Praja Palana Applications Updates : ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి మరో కీలక అప్డేట్ అందింది. ఇటీవలే స్వీకరించిన దరఖాస్తుల్లో రెండు లక్షలకు పైగా డూప్లికేట్ అప్లికేషన్స్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అయితే వీటి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు.

(1 / 5)
రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఐదు గ్యారెంటీల కోసం ప్రజల నుంచి అప్లికేషన్స్ ను స్వీకరించింది.(TS CMO Twitter)
(2 / 5)
ఈ గ్యారంటీ స్కీమ్ లకు సంబంధించి మొత్తం 1,09,01,255 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జనవరి 12వ తేదీ నాటికే వీటికి సంబంధించిన డేటా ఎంట్రీ రికార్డును కూడా పూర్తి చేశారు. అయితే ఇందులో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.(https://prajapalana.telangana.gov.in/)
(3 / 5)
మొత్తం దరఖాస్తుల్లో 2.82 లక్షల డూప్లికేట్ దరఖాస్తులు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డుల నెంబర్లు లేకుండా ఉండటంతో పాటు, నెంబర్లు తప్పుగా ఉన్న దరఖాస్తులు కూడా ఇందులో ఉన్నాయని అధికారులు తెలిపారు. (https://prajapalana.telangana.gov.in/)
(4 / 5)
ప్రజాపాలన దరఖాస్తులపై తాజాగా సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి… డూప్లికేట్ అప్లికేషన్ల విషయంపై కూడా స్పందించారు. వీటిని మరోసారి పరిశీలించాలని… దరఖాస్తుదారులను సంప్రదించాలని సూచించారు. అర్హులైన వారిని మిస్ కాకుండా చూడాలని స్పష్టం చేశారు.(https://prajapalana.telangana.gov.in/)
ఇతర గ్యాలరీలు