Telangana Floods : 'రూ.5,438 కోట్ల నష్టం వాటిల్లింది, తక్షణ సాయం అందిచండి' - కేంద్రమంత్రిని కోరిన సీఎం రేవంత్-cm revanth reddy requested the center to provide immediate assistance to the flood victims ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Floods : 'రూ.5,438 కోట్ల నష్టం వాటిల్లింది, తక్షణ సాయం అందిచండి' - కేంద్రమంత్రిని కోరిన సీఎం రేవంత్

Telangana Floods : 'రూ.5,438 కోట్ల నష్టం వాటిల్లింది, తక్షణ సాయం అందిచండి' - కేంద్రమంత్రిని కోరిన సీఎం రేవంత్

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 06, 2024 09:52 PM IST

వరద బాధితులకు కేంద్రం తక్షణ సాయం అందించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఏపీతో సమానంగా తెలంగాణకు నిధులివ్వాలని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.5438 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. విపత్తు నిధుల వినియోగం నిబంధనలు సడలించాలన్నారు.

కేంద్ర మంత్రులు శివరాజ్​ సింగ్​ చౌహన్‌, బండి సంజయ్ తో  సీఎం రేవంత్​ రెడ్డి
కేంద్ర మంత్రులు శివరాజ్​ సింగ్​ చౌహన్‌, బండి సంజయ్ తో సీఎం రేవంత్​ రెడ్డి

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరద బీభత్సంతో అపార నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని వరద పరిస్థితులను కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, బండి సంజయ్ తో ముఖ్యమంత్రి సచివాలయంలో సమావేశమయ్యారు.

రాష్ట్రంలో వరద నష్టం దాదాపు రూ. 5,438 కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా వివరాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి అంచనాల తర్వాత ఈ నష్టం మరింత పెరిగే అవకాశముందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రాణ నష్టం తప్పిందన్నారు.

వరద నష్టం భారీగా జరిగిందని పవర్ పాయింట్ ద్వారా వాటి వివరాలను తెలియజేశారు. వరద ప్రభావిత జిల్లాల్లోని గ్రామాల్లో బాధిత కుటుంబాలు కోలుకోలేని విధంగా నష్టపోయాయని పేర్కొన్నారు. ఇప్పటికీ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని సీఎం చెప్పారు. తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేలు పంపిణీ చేస్తున్నామని వివరించారు.

విపత్తు నిధులను రాష్ట్రాలకు విడుదల చేసే విషయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించాలని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వంద శాతం ఎస్డీఆర్ఎఫ్ నిధులు రాష్ట్రాలు వినియోగిస్తేనే… శాశ్వత మరమ్మతు పనులకు ఎన్డీఆర్ఎఫ్ నిధులు వాడుకోవాలనే నిబంధన విధించారని గుర్తు చేశారు. గతంలో ఉన్నట్లుగా ఈ నిబంధనను సడలించాలని ప్రత్యేకంగా కోరారు.

ఏపీలోనూ పర్యటన:

ఇక కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్ గురువారం ఏపీలో పర్యటించారు. బుడమేరు ముంపుతో తీవ్రంగా నష్టపోయిన విజయవాడ నగరాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రకటించారు. విజ‌య‌వాడ న‌గ‌రంలో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా కురిసిన 400 మిమీ వ‌ర్ష‌పాతంతో కూడిన వ‌ల్ల వ‌ర‌ద విప్త‌తు సంభ‌వించింద‌ని.. బుడ‌మేరుకు ప‌డిన గండ్లువ‌ల్ల విజ‌య‌వాడ‌కు ఇలాంటి క్లిష్ట‌మైన వ‌ర‌ద ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటున్న సంక‌ట ప‌రిస్థితిని కేంద్ర ప్ర‌భుత్వం గుర్తించింద‌ని.. ఈ రాష్ట్రానికి పూర్తి మ‌ద్ద‌తును, స‌హాయ‌స‌హ‌కారాల‌ను కేంద్రం అందిస్తుంద‌ని అన్నారు. ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థ‌న మేర‌కు వారు కోరిన విధంగా ఎన్‌డీఆర్ఎఫ్ బృందాల‌ను, వైమానిక హెలికాప్ట‌ర్ల‌ను ప్ర‌ధాన‌మంత్రి వెంట‌నే పంపించారని, రాష్ట్ర ప్ర‌భుత్వ, కేంద్ర ప్ర‌భుత్వ విప‌త్తు స్పంద‌న బ‌ల‌గాలు క‌లిసిక‌ట్టుగా ప‌నిచేసి వ‌ర‌ద‌ బారిన‌ ప‌డిన ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డం, వారికి దైనందిక అవ‌స‌రాల‌ను తీర్చ‌డంలో కృషి చేశాయ‌ని పేర్కొన్నారు.