BJP Telangana : టికెట్ తనదేనంటున్న యువనేత..! రాజాసింగ్ అడ్డాలో సరికొత్త రాజకీయం-bjp leader vikram goud focused on goshamahal assembly seat ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bjp Telangana : టికెట్ తనదేనంటున్న యువనేత..! రాజాసింగ్ అడ్డాలో సరికొత్త రాజకీయం

BJP Telangana : టికెట్ తనదేనంటున్న యువనేత..! రాజాసింగ్ అడ్డాలో సరికొత్త రాజకీయం

Mahendra Maheshwaram HT Telugu
Jul 23, 2023 11:34 AM IST

Telangana Assembly Elections 2023: బీజేపీ నుంచి రాజాసింగ్ ను సస్పెండ్ చేసింది ఆ పార్టీ అధిష్టానం. ప్రస్తుతం సొంతంగానే ముందుకెళ్తున్నారు రాజాసింగ్. సస్పెన్షన్ ఇష్యూ అలాగే ఉంది. అయితే అదే పార్టీకి చెందిన ఓ యువనేత తెగ తిరిగేస్తున్నారు! ఈసారి టికెట్ తనదేనన్న ధీమా వ్యక్తం చేస్తుండటం ఆసక్తిని రేపుతోంది.

గోషామహల్ బీజేపీలో సరికొత్త రాజకీయం
గోషామహల్ బీజేపీలో సరికొత్త రాజకీయం

Goshamlahal Politics: గోషామహల్... నాడు కాంగ్రెస్... నేడు బీజేపీ..! సింపుల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే రాజాసింగ్ అంటే గోషామహల్..! గోషామహల్ అంటే రాజాసింగ్ అన్నట్టు ఉంటుంది కథ..! కానీ సీన్ మారుతోంది. బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెండ్ అయ్యాక.... తెరపైకి కొత్త రాజకీయ సమీకరణాలు వచ్చేస్తున్నాయి. అదే పార్టీకి చెందిన మరో యువ నేత... వేగంగా పావులు కదిపే పనిలో పడ్డారు. తాజాగా ఓ సీనియర్ నేతతో చర్చలు జరపటం, ఆ తర్వాత కొన్ని కీలక వ్యాఖ్యలు చేయటం హాట్ టాపిక్ గా మారింది. ఫలితంగా అసలు గోషామహల్ లో ఏం జరుగుతోంది...? జరగబోతుందనేది..? రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
గతేడాది ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ అధినాయకత్వం. ఈ వ్యవహరంలో జైలుకి వెళ్లి వచ్చిన ఆయన.. బయటికి వచ్చారు. అయితే ఆయనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తారని అందరూ భావించారు. ఇదే విషయాన్ని ఆయన పార్టీ నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. పలుమార్లు బహిరంగంగానే ఎత్తివేయాలని కోరారు. రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలు కూడా… త్వరలోనే ఎత్తివేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. కట్ చేస్తే… రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ అలాగే ఉంది. పార్టీకి సంబంధం లేకుండానే ఆయన…. నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కొద్దిరోజుల పార్టీ మారుతున్నారనే చర్చ జరగా… అలాంటిందేమి లేదంటూ కొట్టిపారేశారు.

ఈసారి టికెట్ నాదే…

ఇదే సీటుపై బీజేపీ యువ నేత విక్రమ్ గౌడ్ కన్నేశారు. ఇతను గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా పని చేసిన మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు. తండ్రి చనిపోయిన తర్వాత కూడా విక్రమ్ గౌడ్ కూడా చాలా రోజుల పాటు కాంగ్రెస్ లో ఉన్నారు. కానీ అనంతరం బీజేపీలో చేరారు. ఆయనకంటూ ఓ వర్గం ఉంది. ఈ సీటుపై ఆశగా ఉన్నప్పటికీ... రాజాసింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ సీటు నుంచి రెండుసార్లు రాజాసింగే గెలిచారు. మరోసారి కూడా ఆయనే బరిలో ఉంటారని అంతా భావించారు. కట్ చేస్తే ఆయన సస్పెండ్ కావటం, ఇప్పటి వరకు ఎత్తివేయకపోవటం వంటి పరిణామాల నేపథ్యంలో… విక్రమ్ గౌడ్ నియోజకవర్గాన్ని చుట్టుముట్టేస్తున్నారు. ఇటీవలే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తో భేటీ కావటం, ఆ తర్వాత విక్రమ్ గౌడ్ ను కలిశారు. తాజా పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈటల మీడియాతో మాట్లాడకపోయినప్పటికీ… ఆ తర్వాత విక్రమ్ గౌడ్ మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ టికెట్ తనకే వస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. రాజాసింగ్ మద్దతును కూడా కోరాతనని… ఆయనపై విధించిన సస్పెన్షన్ రాష్ట్ర పార్టీ పరిధిలో లేదంటూ చెప్పుకొచ్చారు. జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కామెంట్స్ చేశారు.

గోషామహల్ లోని తాజా రాజకీయ పరిణామాలపై రాజాసింగ్ ఓపెన్ కావటం లేదు. టికెట్ విషయంపై విక్రమ్ గౌడ్ నుంచి రియాక్షన్ రాగా… రాజాసింగ్ నుంచి ఎలాంటి రిప్లే వస్తుందనే చర్చ నడుస్తోంది. ఎన్నికలకు మరికొద్దిరోజులు మాత్రమే మిగిలి ఉండటంతో… బీజేపీ హైకమాండ్ ఎలా ముందుకెళ్లబోతుందనేది టాక్ ఆఫ్ ది గోషామహల్ గా మారింది. నిజంగానే విక్రమ్ గౌడ్ కే ఛాన్స్ ఇస్తుందా..? రాజాసింగ్ విషయంలో మరోలా ఆలోచిస్తున్నారా .? అనేది తేలాల్సి ఉంది…!

Whats_app_banner

సంబంధిత కథనం