Bandi Sanjay On KCR : ఆ పని చేస్తే పాదయాత్ర ఆపేస్తా.. కేసీఆర్‌కు బండి ఆఫర్
Bandi Sanjay Comments On CM KCR : ప్రజాసంగ్రామ యాత్రను అణచివేసే చర్యలను కొనసాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సెప్టెంబర్ 12 నుంచి నాలుగో విడత పాదయాత్ర చేపడతామని చెప్పారు. అయితే పాదయాత్ర ఆపేయాలంటే.. ఓ కండీషన్ పెట్టారు.
BJP Praja Sangrama Yatra : తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్(TRS) నడుమ రాజకీయం యుద్ధం రోజురోజుకు పెరుగుతోంది. బీజేపీ-టీఆర్ఎస్ నడుమ మాటల యుద్ధం పెరుగుతోంది. తాజాగా పెద్దపల్లి సభలో కేసీఆర్ బీజేపీ, మోదీపై విమర్శలు గుప్పించారు. వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టారు. కేసీఆర్ పై కామెంట్స్ చేశారు. అయితే తమ ప్రజాసంగ్రామ యాత్రపై కేసీఆర్ కు ఓ ఆఫర్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు సంజయ్.
'సీఎం కేసీఆర్ కు దమ్ముంటే పోలీసు రక్షణ లేకుండా పాదయాత్ర చేస్తే మా యాత్రను ఆపేస్తాం. కేసీఆర్ ఎప్పుడు యాత్ర ప్రారంభిస్తారో చెప్పాలి. రాష్ట్రాభివృద్ధికి కేసీఆర్ ఏం చేస్తారో చెప్పట్లేదు. ఏమైనా అంటే మతం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. లిక్కర్ స్కామ్‌పై ఎందుకు మౌనంగా ఉన్నారు. మద్యం కుంభకోణంలో ఎవరు ఉన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్‌లో ఎవరి పాత్ర ఉంది.' అని బండి సంజయ్ ప్రశ్నించారు.
Bandi Sanjay Comments On CM KCR : రైతు సంఘాల నేతలను సమావేశాలకు పిలిపించి తెలంగాణ రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. వ్యవసాయ బోర్‌వెల్‌లకు మీటర్లు బిగించే ప్రయత్నం చేస్తే బీజేపీ(BJP) ఆపేస్తుందని అన్నారని, రాష్ట్ర రైతులకు కేసీఆర్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీని విమర్శించడానికే కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని హామీలు నెరవేర్చారో కేసీఆర్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
లిక్కర్ స్కామ్‌తో తన కుటుంబానికి సంబంధంలేదని కేసీఆర్ ఎందుకు చెప్పడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. సీఎం ఫ్యామిలీ స్వయంగా వారి పరువు వారే తీసుకుంటున్నారని విమర్శించారు. సోషల్ మీడియాతో కేసీఆర్ కుటుంబంపై తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లాలో సభ పెట్టారని, జిల్లాకు ఏం చేశారో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. ఎనిమిదేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో కూడా చెప్పాలని అడిగారు.