Maha shivaratri: శివరాత్రికి ఈ మొక్కలు మీ ఇంట్లో నాటారంటే శివయ్య ఆశీస్సులు పొందుతారు-plant these plants on the auspicious day of maha shivaratri to bring lord shiva blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Maha Shivaratri: శివరాత్రికి ఈ మొక్కలు మీ ఇంట్లో నాటారంటే శివయ్య ఆశీస్సులు పొందుతారు

Maha shivaratri: శివరాత్రికి ఈ మొక్కలు మీ ఇంట్లో నాటారంటే శివయ్య ఆశీస్సులు పొందుతారు

Gunti Soundarya HT Telugu
Mar 04, 2024 05:29 PM IST

Maha shivaratri: మహా శివరాత్రి నాడు శివయ్య ఆశీస్సులు పొందాలంటే ఈ మూడు మొక్కలో ఏదైనా మీ ఇంటికి తెచ్చుకుని నాటండి. శివుడు ప్రసన్నుడవుతాడు.

మహా శివరాత్రికి ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి
మహా శివరాత్రికి ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి (pinterest)

Maha Shivaratri 2024: మరో నాలుగు రోజుల్లో మహా శివరాత్రి జరుపుకొనున్నారు. సనాతన ధర్మంలో మహా శివరాత్రి పర్వదినాని చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆ సమయంలో ఎక్కడ ఏ ఆలయంలో చూసిన హరిహర మహాదేవ శంభోశంకర నామస్మరణ తప్ప మరేదీ వినిపించదు, కనిపించదు.

మహా శివరాత్రి రోజు శివలింగాన్ని అభిషేకించడంతో పాటు రుద్రాభిషేకం కూడా చేయడం ప్రత్యేకత సంతరించుకుంటుంది. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడు. శివరాత్రి రోజు పరమేశ్వరుడిని పార్వతి దేవిని పూజిస్తారు. కొన్ని నియమాల అనుసారం పార్వతీ పరమేశ్వరులను పూజించడం వల్ల వారి అనుగ్రహం పొందవచ్చు.

జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పే దాని ప్రకారం ఈ మూడు మొక్కలు మహాశివరాత్రి రోజు మీరు ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఈ కుటుంబం మీద శివయ్య ఆశీస్సులు నిరంతరం ఉంటాయి. శివుడి ఆశీస్సులు పొందాలంటే మీ ఇంట్లో ఏయే మొక్కలు పెంచుకోవాలో చూద్దాం. ఇవి ఉంటే మీ కుటుంబం మీద శివయ్య ఆశీస్సులు నిరంతరం ఉంటాయి.

మారేడు మొక్క

మహా శివుడికి ఇష్టమైన వాటిలో ముఖ్యమైనది బిల్వపత్రాలు. వీటినే మారేడు దళాలు అని కూడా అంటారు. శివరాత్రి రోజు శివలింగానికి పూజ చేసే సమయంలో బిల్వ దళాలు సమర్పిస్తే పులకించిపోతాడు. శివరాత్రి రోజు మీరు మీ ఇంట్లో మారేడు చెట్టు నాటుకోవచ్చు. ఈ చెట్టు ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. ఇంట్లో అందరూ సుఖశాంతులతో ఉంటారు. కుటుంబం సంతోషంగా జీవనం సాగిస్తుంది. ఒకసారి పూజకి ఉపయోగించిన తర్వాత వాటిని నీటితో శుభ్రం చేసుకుని మరలా పూజకి అర్హత కలిగిన దళాలు ఈ బిల్వ పత్రాలు. శివుడికి బిల్వపత్రాలు సమర్పించడం అంటే మనలోని అహాన్ని తొలగించి ఆధ్యాత్మిక మేల్కోలుపుకు చిహ్నంగా భావిస్తారు.

ఉమ్మెత్త పువ్వు

శివుడికి పూజ చేసే సమయంలో బిల్వ పత్రంతోపాటు ఉమ్మెత్త పువ్వు లేకుండా పూజ చేస్తే అది అసంపూర్తిగా ఉంటుంది. అందుకే శివరాత్రి రోజు శివలింగానికి ఉమ్మెత్త పువ్వులు తప్పనిసరిగా సమర్పిస్తారు. అలాగే ఈరోజు మీరు ఉమ్మెత్త పువ్వు మొక్క ఇంట్లో నాటుకోవచ్చు. సాధారణంగా ఉమ్మెత్త మొక్క విషపూరితంగా ఉంటుంది. అందుకే ఈ మొక్క ఒకవేళ మీరు ఇంటికి తెచ్చుకుంటే దాని వైపు పిల్లలు వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల సంతోషం సంపద, శ్రేయస్సు పెరుగుతాయి. ఇది ఉండటం వల్ల ఇంట్లో ఏమైనా అనర్ధాలు ఉంటే వాటిని నివారిస్తుందని నమ్ముతారు.

మల్లె చెట్టు

శివరాత్రి రోజు సువాసన కలిగిన మల్లె చెట్టు ఇంట్లో నాటుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. పార్వతీదేవికి ఇష్టమైన పూలు పరిమళాలు వెదజల్లే మల్లె చెట్టు. ఇది మీ ఇంట్లో నాటడం వల్ల పార్వతీదేవి ఆశీస్సులు లభించడంతోపాటు వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. దాంపత్య బంధం మరింత బలపడుతుంది. ఒకరి మీద ఒకరికి ప్రేమానురాగాలు పెరుగుతాయి.

మహా శివరాత్రి రోజు ఎటువంటి ప్రాపంచిక భోగాలకు పోకుండా మనసు, ఆలోచన మొత్తం శివుడి మీద లగ్నం చేయాలి. శివనామస్మరణతోనే రోజంతా గడపాలి. శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల మహా శివరాత్రి నాడు శివుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి.