Lord shiva favorite zodiac signs: ఈ 3 రాశుల జాతకులంటే శివుడికి మహా ప్రీతి.. వీరికి శివయ్య అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది
Lord shiva favorite zodiac signs: ప్రతి ఒక్కరూ శివయ్య అనుగ్రహం పొందాలని కోరుకుంటారు. ఆయన అనుగ్రహం కోసం నిత్యం పూజలు చేస్తారు. కానీ ఈ రాశుల జాతకులు అంటే మాత్రం శివుడికి మహా ప్రీతి. అందులో రాశి ఉందో లేదో చూసుకోండి.
Lord shiva favorite zodiac signs: శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. అందుకే అందరూ ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కోసం ఎదురుచూస్తారు. శివయ్య ఆశీస్సులు కోసం అభిషేకాలు చేస్తారు. మరికొన్ని రోజుల్లో మహా శివరాత్రి రాబోతుంది. ఆయన్ను పూజిస్తే త్వరగా భక్తుల మీద దయ చూపిస్తాడని నమ్ముతారు. అయితే కొన్ని రాశుల జాతకులకు మాత్రం శివుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.
జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం పన్నెండు రాశులు ఉన్నాయి. కానీ శివుడి అనుగ్రహం మాత్రం ఈ మూడు రాశుల మీద పుష్కలంగా ఉంటుంది. ఈ రాశుల వారు శివయ్యని తలుచుకుంటే చాలు అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. జీవితంలో ఇబ్బందులు పడే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎవరైతే శివుడుని ఆశ్రయిస్తారో వారి బాధలన్నీ శివయ్య త్వరగా తొలగిస్తాడని నమ్ముతారు. ఏ ఏ రాశుల వారికి శివుడి అనుగ్రహం ఉంటుందో తెలుసుకుందాం. అందులో మీ రాశి ఉందో లేదో చూసుకోండి.
మేష రాశి
జ్యోతిష్యం ప్రకారం శివుడికి ఇష్టమైన రాశి చక్రాలలో మేష రాశికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి శివుని అద్వితీయమైన అనుగ్రహం లభిస్తుంది. వారి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను శివయ్య త్వరగా పరిష్కరిస్తాడు. ఆయన దయతో కెరీర్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తాయి. ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ రాశి జాతకులు భౌతిక సుఖాలు అనుభవించాలని కోరుకోరు. శ్రద్ధ, ఆశావాదం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలుస్తారు. ప్రతి శనివారం, సోమవారం శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా నీలకంఠుడు అనుగ్రహం మరింత ఉంటుంది.
మకర రాశి
పరమ శివుడికి ఇష్టమైన మరొక రాశి మకర రాశి. ఎందుకంటే మకర రాశికి శనీశ్వరుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. శని భగవానుడు శివుడికి పరమ భక్తుడు. అందుకే ఈ రాశి జాతకులు మీద శివుడి అనుగ్రహం ఉంటుంది. కెరీర్ లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. గణనీయమైన కీర్తి, గుర్తింపు పొందుతారు. అప్పుడప్పుడు కుటుంబ సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ జ్ఞానంతో శివుడి ఆశీర్వాదం ప్రభావంతో వాటిని సమర్థవంతంగా అధిగమించగలుగుతారు. భోళా శంకరుడని చిత్తశుద్ధితో ఆరాధించడం వల్ల జీవితంలో ఎప్పుడు అపజయం అనేది ఉండదు. ఆపద సమయంలో “ఓం నమః శివాయ” అనే శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి.ఆర్థికంగా బలంగా ఉంటారు.
కుంభరాశి
కుంభ రాశిలో జన్మించిన వ్యక్తులకు శివయ్య అనుగ్రహం సమృద్ధిగా ఉంటుంది. ఈ రాశికి కూడా శనీశ్వరుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. అందుకే శివుడికి కూడా ఇష్టమైన రాశిగా నిలుస్తుంది. సంపద, ఆనందం, శ్రేయస్సు అనుభవిస్తారు అన్ని కష్టాలను అధిగమించి కుటుంబ జీవితాన్ని ఆనందంగా ఉంచే సామర్థ్యం కలిగి ఉంటారు. ఆదర్శ జీవిత భాగస్వామిలను అప్రయత్నంగానే కనుగొంటారు.
శివుడిని సంతోషపెట్టడానికి కుంభ రాశి జాతకులు ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. స్వతహాగానే చిత్తశుద్ధి స్వభావం కలిగి ఉంటారు. అందుకే వీరి పట్ల శివుడు ఎల్లప్పుడూ దయతో ఉంటాడు. శివయ్యను ఆరాధించడం వల్ల జీవితంలో ఆనందం శ్రేయస్సు సుసంపన్నమవుతాయి. ప్రతినెల శివరాత్రి రోజు రుద్రాభిషేకం చేసి చెరుకు రసాన్ని నైవేద్యంగా పెడితే శివుడు మరింత త్వరగా ప్రసన్నుడౌతాడు.