Benefits of Jasmine : మల్లెపూలతో ఆరోగ్యానికి ఎంత మంచి ప్రయోజనాలున్నాయో తెలుసా?
Health Benefits of Jasmine : మల్లెపువ్వుల గురించి తెలిస్తే.. పువ్వుల్లో దాగున్న ఔషదగుణాలెంతో అతిశయం అనక తప్పదేమో. నిజమేమరి.. మల్లెపువ్వులు కేవలం తలలో పెట్టుకోవడానికి తప్పా.. ఇంకెందుకు ఉపయోగపడతాయి అనుకునేవారికే ఇది. మీరు కచ్చితంగా మల్లెపువ్వు వల్ల పొందే ప్రయోజనాలు గురించి తెలిస్తే షాక్ అవుతారు.
Health Benefits of Jasmine : మల్లెపువ్వులు అనగానే ఓ మంచి సువాసన గుర్తొస్తుంది. కొందరికి వాటి స్మెల్ నచ్చకపోయినా.. చాలామందికి వాటి స్మెల్ నచ్చుతుంది. అందుకే డియోడ్రెంట్స్ కూడా ఆ వాసన వచ్చేవి ఎక్కువ తీసుకుంటారు. అయితే ఇవి చాలా ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయని కొద్దిమందికే తెలుసు. మల్లెపువ్వును టీలు, జ్యూస్లు, క్యాండీలు, రకరకాల ఫుడ్స్ తో తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు. అయితే మల్లెపువ్వు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఓ లుక్ వేద్దాం.
జీర్ణశక్తిని పెంపొందిస్తుంది
మల్లె పువ్వు పేగులకు మంచిది. శరీరంలోని గ్యాస్ట్రిక్ ఎంజైమ్‌లతో పరస్పర చర్యను సులభతరం చేసే యాంటీఆక్సిడెంట్లతో ఉంటుంది. ఇది గ్యాస్, పొత్తికడుపు నొప్పి, అపానవాయువు, అతిసారం, మలబద్ధకం, ప్రకోప పేగు సిండ్రోమ్ (IBS) నుంచి ఉపశమనం అందించడంలో సహాయపడుతుంది. అంతే కాదు.. జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తుంది. శరీరం నుంచి టాక్సిన్లను తొలగిస్తుంది. అందుకే భోజనం తర్వాత జాస్మిన్ టీ తాగండి.
గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది
జాస్మిన్ ఆధారిత ఫుడ్, పానీయాలను తీసుకోవడం వల్ల మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ సుగంధ పువ్వులో యాంటీ కోగ్యులెంట్, యాంటీ ఫైబ్రినోలైటిక్ లక్షణాలు ఉండటం వల్ల "చెడు" కొలెస్ట్రాల్ తగ్గుతుంది. నిజానికి ఇది ధమనులలో అడ్డంకులు, రక్తం గడ్డకట్టడాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే.. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు తమ రోజువారీ ఆహారంలో మల్లెలను చేర్చుకోవాలి.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది
బరువు తగ్గాలనే తపనతో మీరు టేస్టీ వంటకాలను వదులుకోవాలని ఎవరు చెప్పారు? మల్లెలతో మీరు సహజమైన మార్గంలో ఆ అదనపు కిలోలను సులభంగా తగ్గించవచ్చు. ఎపిగాల్లోకాటెచిన్, గల్లిక్ యాసిడ్ (EGCG) ఉనికి మీ జీవక్రియను వేగవంతం చేసి.. బరువు పెరగడాన్ని నిరోధిస్తాయి. కాబట్టి మీరు మల్లెలతో కలిపిన ఫుడ్ తినేటప్పుడు.. అది మీ సిస్టమ్ నుంచి విషాన్ని కడిగివేసి.. అదనపు కొవ్వును కరిగిస్తుంది.
నిద్రలేమి, ఆందోళన, నిరాశకు చికిత్స
జాస్మిన్ ఎసెన్షియల్ ఆయిల్స్ నిద్రలేమి, ఆందోళన, ఒత్తిడి, నిరాశ వంటి సందర్భాల్లో మనస్సుకి ప్రశాంతత, ఓదార్పును అందిస్తాయి. "జర్నల్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్"లో ప్రచురించిన ఒక అధ్యయనంలో జాస్మిన్ ఆయిల్ మానసిక స్థితి, మెదడు కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. తద్వారా ఆందోళన లక్షణాలను తగ్గిస్తుంది. అదనంగా ఇది మెదడుపై ఉపశమన ప్రభావాలను కలిగిస్తుంది. వేగంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది
మల్లెలలో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉన్నందున.. ఈ సువాసనగల పువ్వు అభిజ్ఞా పనితీరును మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. దీనితో పాటు ఏకాగ్రత, దృష్టి, సామర్థ్యం, ప్రశాంతత, మనస్సు చురుకుదనాన్ని పెంచుతుంది. దీనిని అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల చికిత్సకు కూడా ఉపయోగపడే గొప్ప మెదడు బూస్టర్‌గా పరిగణిస్తారు.
సంబంధిత కథనం
టాపిక్