Chaitra navaratrulu: చైత్ర నవరాత్రుల్లో ఈ వస్తువులు పొరపాటున కూడా కొనుగోలు చేయొద్దు..ఇబ్బందులు పడతారు-dont buy these things on chaitra navratri ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Chaitra Navaratrulu: చైత్ర నవరాత్రుల్లో ఈ వస్తువులు పొరపాటున కూడా కొనుగోలు చేయొద్దు..ఇబ్బందులు పడతారు

Chaitra navaratrulu: చైత్ర నవరాత్రుల్లో ఈ వస్తువులు పొరపాటున కూడా కొనుగోలు చేయొద్దు..ఇబ్బందులు పడతారు

Gunti Soundarya HT Telugu
Apr 09, 2024 10:10 AM IST

Chaitra navaratrulu: ఏప్రిల్ 9వ తేదీ నుంచి చైత్ర నవరాత్రులు జరుపుకుంటారు. ఈ సమయంలో కొన్ని వస్తువులు కొనుగోలు చేయకుండా ఉంటేనే మంచిది. లేదంటే మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది.

చైత్ర నవరాత్రులలో కొనకూడని వస్తువులు ఇవే
చైత్ర నవరాత్రులలో కొనకూడని వస్తువులు ఇవే

Chaitra navaratrulu: ఏటా చాంద్రమానం ప్రకారం చైత్రమాసంలో చైత్ర నవరాత్రులు జరుపుకుంటారు. హిందువులు ఈ తొమ్మిది రోజులను ఘనంగా జరుపుకుంటారు. దుర్గాదేవిని తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల రూపాలలో అలంకరించి పూజలు చేస్తారు. ఈ సంవత్సరం చైత్ర నవరాత్రులు ఏప్రిల్ 9 మంగళవారం నుంచి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 17 బుధవారం వరకు కొనసాగుతాయి. శ్రీరామనవమితో ఈ నవరాత్రులు ముగుస్తాయి.

మత గ్రంథాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు భూమిపై ఉన్న ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఆ రాక్షసుడుని సంహరించేందుకు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు తమ శక్తులను ఏకం చేసి దుర్గాదేవిని సృష్టించారు. దుర్గాదేవి మహిషాసురమర్ధిని అవతారం ఎత్తి మహిషాసురునితో తొమ్మిది రోజులు పాటు యుద్ధం చేసింది. ఈ యుద్ధం తొమ్మిది రోజుల పాటు జరిగింది. పదో రోజున దుర్గాదేవి రాక్షసుడిని సంహరించినది. ఇందుకు ప్రతీకగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ ఏడాది చైత్ర నవరాత్రుల్లో దుర్గా దేవి వాహనం గుర్రం.

నవరాత్రుల సమయంలో కొన్ని వస్తువులు కొనకుండా ఉండటమే మంచిది. ఈ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి. దుర్గామాత కోసం ఎరుపు, పసుపు రంగు వస్త్రాలు కొని పెట్టుకోవాలి. తొమ్మిది రోజులు పాటు కొన్ని విషయాలకు చాలా దూరంగా ఉండాలి.

మాంసాహారం తీసుకోకూడదు

నవరాత్రుల్లో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. ఈ సమయంలో మాంసాహార ఉత్పత్తులు తీసుకోవడం, కొనుగోలు చేయడం మంచిది కాదు. ఉపవాసం ఉండటం అన్నింటికన్నా మంచిది. ఉపవాసం ఉండలేని వాళ్ళు తాజా పండ్లు, కూరగాయలు, ధాన్యాలు మొదలైన వాటితో కూడిన సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల భక్తులు శరీరం, మనసు శుద్ధి అవుతుంది. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని నమ్ముతారు.

ఇనుము

ఇనుము ప్రతికూల శక్తికి ప్రతీకగా భావిస్తారు. ఇవి ఇంటికి తీసుకొస్తే హానికరమైన శక్తులను ఇంట్లోకి తీసుకురావడమే. ఇది ఆధ్యాత్మిక శక్తికి భంగం కలిగిస్తుంది. అందుకే నవరాత్రుల్లో పనిముట్లు, ఫర్నిచర్ మొదలైన ఇనుముతో కూడిన వస్తువులు కొనుగోలు చేయకూడదు. వాటికి బదులుగా రాగి వంటి ప్రత్యామ్నాయ వస్తువులు ఎంచుకోవచ్చు.

ఎలక్ట్రానిక్స్

ఇనుములాగే ఎలక్ట్రానిక్స్ కూడా ఇంటికి తీసుకురావడం మంచిది కాదు. ఇది భక్తుల శాంతిని చెడగొడుతుంది. ఎలక్ట్రానిక్ పరికరాలలో నిమగ్నం అవ్వడం మనసు భక్తి మీద నుంచి ప్రాపంచిక కోరికలు, ఆలోచనల మీదకు వెళ్తుంది. ఇది ఆటంకం కలిగిస్తుంది. అలాగే నవరాత్రుల సమయంలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తో ఎక్కువ సమయం గడపకుండా ఉండేందుకు ప్రయత్నించాలి.

నల్లని దుస్తులు

ఆధ్యాత్మిక ప్రపంచంలో నలుపు రంగు భావిస్తారు. నవరాత్రులు స్వచ్ఛత, సానుకూలత, దైవిక శక్తితో ముడిపడిన రోజులు. అందుకే ఈ సమయంలో నలుపును ధరించడం లేదా నల్లటి వస్తువులు, దుస్తులు కొనుగోలు చేయడం మంచిది కాదు. ఇది సంతాపం, ప్రతికూలతకు సూచికగా భావిస్తారు. ఈ రంగు వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని నమ్ముతారు. నలుపుకు బదులుగా ప్రకాశవంతమైన ఎరుపు, గులాబీ, పసుపు, ఆకుపచ్చ రంగు దుస్తులు కొనుగోలు చేయడం మంచిది. ఇది పండుగ వాతావరణం సృష్టిస్తుంది.

అన్నం తినకపోవడం మంచిది

అమ్మవారి అనుగ్రహం కోసం ఉపవాసం ఉండటం మంచిది. నవరాత్రుల సమయంలో ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేయడం వల్ల దుర్గాదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల సోమరితనం, బద్ధకం వస్తుంది. ఆధ్యాత్మిక శక్తి సన్నగిల్లుతుంది. అందుకే ఇటువంటి సమయంలో కనీసం ఒక్క పూటైనా అన్నం తీసుకోవడం మానేయడం మంచిదిగా భావిస్తారు.

పదునైన వస్తువులు

కత్తెరలు, కత్తులు, సూదులు వంటి పదునైన వస్తువులు ఏవి కొనుగోలు చేయకూడదు. ఇవి హింసాత్మక వాతావరణాన్ని సృష్టిస్తాయి. వీటిని ఇంట్లోకి తీసుకురావడం ఆశుభకరమైనదిగా పరిగణిస్తారు. ఇవి ప్రతికూల శక్తులను ఆకర్షించడం చేస్తాయి. ఇంట్లో సానుకూలతకు భంగం కలిగిస్తాయి.

అన్ని రాశుల వారికి ఉగాది రాశి ఫలాల కోసం ఈ పేజీ చూడండి.

Whats_app_banner