హోలీ పండుగను ఫాల్గుణ మాసంలో పూర్ణిమ తిథి నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది హోలీలా దహన్‌ను మార్చి 24న, హోలీని మార్చి 25 జరుపుకుంటారు.   

pexels

By Bandaru Satyaprasad
Mar 24, 2024

Hindustan Times
Telugu

హోలీ రోజున ఎలాంటి రంగుల బట్టలు ఎంచుకోవాలో ఆలోచిస్తుంటే మేము మీ కోసం కొన్ని రకాలు దుస్తులు సూచిస్తున్నాం. ఇవి ఆధ్యాత్మిక అర్థాన్ని వివరించడానికి సహాయపడతాయి. అయితే దుస్తుల ఎంపిక అంతిమంగా మీ అభిరుచి, సౌకర్యానికి సంబంధించినది.   

pexels

తెలుపు- హోలీ రోజున తెల్లటి దుస్తులు ధరించడం శుభ్రత, శాంతికి చిహ్నంగా భావిస్తారు. రాబోయే కాలాన్ని కొత్త ప్రారంభాలు, మంచి ఉద్దేశాలతో ఆహ్వానిస్తుంది.   

pexels

పసుపు-పసుపు సంప్రదాయం, ఆనందం, శక్తితో ముడిపడి ఉంటుంది. హోలీ రోజున పసుపు రంగు ధరిస్తే మీరు మరింత ఆనందంగా, ఉత్సాహంగా ఉంటారు. పసుపు సూర్యుని వెచ్చదనం, వసంత పువ్వుల ప్రకాశాన్ని సూచిస్తుంది. హిందూ సంస్కృతిలో దేవతామూర్తులు పసుపు వస్త్రాలు ధరిస్తారు.   

pexels

ఆకుపచ్చ- ఆకుపచ్చ అనేది సామరస్యానికి, పునరుద్ధరణను సూచించే రంగు. హిందూ సంస్కృతిలో ఆకుపచ్చ రంగు శక్తి, కొత్త ప్రారంభం, పంటలను సూచిస్తుంది. ఇది వసంతకాలంతో ముడిపడి ఉంటుంది. సంతోషకరమైన హోలీ పండుగ నాడు వసంత రాకను తెలియజేస్తుంది.   

pexels

ఆరెంజ్- నారింజ రంగు శక్తి, ఆవిష్కరణకు సూచిక. హోలీ నాడు ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల ఉల్లాసవంతంగా ఉంటుంది. మీరు ఉత్సాహంగా వేడుకలు జరుపుకోవాలనే భావాలను రేకెత్తిస్తుంది. ఈ రంగును హిందూ సంస్కృతిలో పవిత్రమైనదిగా భావిస్తారు.  

pexels

పింక్- పింక్ రంగు స్నేహం, కరుణ, ప్రేమతో తరచుగా ముడిపడి ఉంటుంది. సంతోషకరమైన హోలీ వేడుకల్లో  పింక్ దుస్తులు ధరించడం ప్రేమ, స్నేహానికి సూచికగా ఉంటాయి. పింక్ కలర్ ఆకర్షణీయమైన, ఉల్లాసమైన రంగుగా భావిస్తారు. ముఖ్యంగా మహిళలు ఈ రంగును ఇష్టపడతారు. పింక్ అమాయకత్వం, ఆరోగ్యం, ఆనందాన్ని సూచిస్తుంది.   

pexels

నీలం-నీలం రంగుకు హిందూమతంలో కృష్ణుడితో అనుబంధం కలిగి ఉంటుంది. ఆకాశం, సముద్రం ఇలా ప్రకృతి నీలి రంగుతో ముడిపడి ఉంటుంది. హోలీ రోజున నీలం రంగు దుస్తులు ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని గుర్తుచేస్తుంది.  

pexels

ఎరుపు- ఎరుపు రంగు ప్రేమకు చిహ్నంగా ఉంటుంది. రాధాకృష్ణుల ప్రేమకు చిహ్నంగా హోలీలో ఈ రంగును ఉపయోగిస్తారు. హోలీలో తమ ప్రేమకు సంకేతంగా తమ ప్రియమైన వారి ముఖాలను ఎరుపు రంగు రాస్తుంటారు.  

pexels

పర్పుల్- పర్పుల్ ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంటుంది. హోలీ రోజున ఊదా రంగు దుస్తులు ధరిస్తే వ్యక్తిగత పురోగతి ఉంటుందని భావన. భారతదేశంలో ఊదారంగును సంప్రదాయకంగా అధికారం, రాచరికంతో ముడిపడి ఉంది.   

pexels

ఇటీవ‌లే గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చిందితో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది అంజ‌లి. 

twitter