Yoga Asanas for Myositis । ఈ యోగా ఆసనాలతో మైయోసైటిస్‌ను నయం చేయవచ్చు!
Yoga Asanas for Myositis: మయోసైటిస్ అనే వ్యాధిని నయం చేయటానికి యోగాతో పాటు ఆయుర్వేదం కూడా ప్రభావవంతమైన వైద్య విధానాలుగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇందుకు యోగా ఆసనాలు, ఆయుర్వేద వైద్య చికిత్సలు, అలాగే తినాల్సిన ఆహారం వారు సూచించారు.
Yoga Asanas for Myositis: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు ఇటీవల తాను మయోసైటిస్ అనే వ్యాధితో పోరాడుతున్న విషయం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ మయోసిటిస్ అనేది స్వయం ప్రతిరక్షక వ్యాధి. ఈ పరిస్థితి ఉన్నప్పుడు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ తన స్వంత కణజాలాలపైనే పొరపాటుగా దాడి చేస్తుంది. ఫలితంగా కండరాలలో వాపు, బలహీనతను కలిగిస్తుంది. దీని నొప్పి చాలా బాధాకరంగా ఉంటుంది. ఈ వ్యాధికి చికిత్స తీసుకోకపోతే, అది కాలక్రమేణా మరింత తీవ్రమవుతుంది. శరీరంలోని ఇతర కండరాలకు వ్యాధి వ్యాపిస్తుంది. ఫలితంగా ఏ పని చేయలేరు, కూర్చున్న స్థానం నుంచి లేవలేరు, లేస్తే కూర్చోలేరు. మెట్లు ఎక్కడం, జుట్టు దువ్వడం, వస్తువులను ఎత్తడం వంటి రోజువారీ పనులను చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. మంచంలో పడుకున్నపుడు మరో పక్కకు తిరగాలన్నా నొప్పి బాధిస్తుంది. అంతేకాదు, ఇది శ్వాసకోశ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. వ్యాధి ముదిరేకొద్దీ శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది.
మయోసైటిస్‌కు కచ్చితమైన చికిత్స ఇప్పటివరకూ లేదు. అయినప్పటికీ, వ్యాధి లక్షణాలను తగ్గించేందుకు ఫిజియోథెరపీ, ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ, స్టెరాయిడ్స్‌తో చికిత్స వంటివి ఉన్నాయి.
నివేదికల ప్రకారం, సమంత ఇమ్యూనిటీ బూస్టింగ్ థెరపీ చికిత్సలు తీసుకుంటోంది, అంతేకాకుండా ఆమె ఆయుర్వేద నివారణ మార్గాలను కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
క్యాప్సూల్ రూపంలోని పసుపు పేస్ట్‌ని నేరుగా ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. అల్లం, బోస్వెల్లియా, అశ్వగంధ వంటి మూలికలు కూడా మైయోసిటిస్‌తో సహాయపడగలవు. ఇక మైయోసిటిస్ నొప్పి, వాపుల నుండి ఉపశమనానికి యోగా కూడా గొప్ప మార్గం. భుజంగాసనం, అధో ముఖ స్వనాసనం (Downward-Facing Dog Pose), మత్యాసనం వంటి యోగాసనాలు మయోసైటిస్ నుంచి బయట పడేస్తాయని ఆయుర్వేద, యోగా నిపుణులు షేక్ తెలిపారు.
తాజా పండ్లు, కూరగాయలు, బెర్రీలు, క్యారెట్లు, చిలగడదుంపలు , ఆకుకూరలతో పాటు వారానికి రెండు మూడు సార్లు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలు, బాదంపప్పులు, వాల్‌నట్‌లు, అవిసె గింజలు వంటివి ఆహారంగా తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
సంబంధిత కథనం