Passport Rules : ప్రపంచంలోనే పవర్‌ఫుల్‌ పాస్‌పోర్టులు ఇవే.. ఇండియా ర్యాంక్‌ ఎంతంటే..-worlds most powerful passports in 2024 here is the list of countries what is the india rank ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Passport Rules : ప్రపంచంలోనే పవర్‌ఫుల్‌ పాస్‌పోర్టులు ఇవే.. ఇండియా ర్యాంక్‌ ఎంతంటే..

Passport Rules : ప్రపంచంలోనే పవర్‌ఫుల్‌ పాస్‌పోర్టులు ఇవే.. ఇండియా ర్యాంక్‌ ఎంతంటే..

Anand Sai HT Telugu
Feb 26, 2024 05:30 AM IST

Powerful Passport : పాస్‌పోస్ట్ ఉంటే వివిధ దేశాలకు వెళ్లవచ్చు. అయితే కొన్ని దేశాల్లో మాత్రం పాస్ట్ పోర్ట్ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి.

పవర్ ఫుల్ పాస్‌పోర్ట్
పవర్ ఫుల్ పాస్‌పోర్ట్ (Unsplash)

ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే.. మనకు పాస్‌పోర్ట్‌ కచ్చితంగా కావాలి. పాస్‌పోర్టులలో చాలా రకాలు ఉంటాయి.. కొన్ని రకాల పాస్‌పోర్టులతో కొన్ని దేశాలు మాత్రమే వెళ్లగలరు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులు కొన్ని ఉన్నాయి. వీటితో ఏకంగా 194 దేశాలు వెళ్లొచ్చట. ప్రపంచంలోని అలాంటి పాస్‌పోర్ట్‌ల జాబితాలో ఏయే దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ప్రతి సంవత్సరం హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా పాస్‌పోర్ట్‌ల నాణ్యత, భద్రత, ఇతర అంశాలను పరిశీలించి ఒక నివేదికను ప్రచురిస్తుంది. ఆ విధంగా ఈ ఏడాది 2024 పాస్‌పోర్ట్ ర్యాంకింగ్‌ను విడుదల చేశారు. అందులో భాగంగానే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన దేశాల జాబితా ఇక్కడ ఉంది.

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం 6 దేశాలు మాత్రమే - ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ - ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్నాయి. ఈ 6 దేశాల పౌరులు వీసా లేకుండా 194 దేశాలలోకి ప్రవేశించవచ్చట.

ఫిన్లాండ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ దేశ పౌరులు వీసా లేకుండా 193 దేశాలకు కూడా ప్రయాణించవచ్చు. దీని తర్వాత UK, లక్సెంబర్గ్, ఐర్లాండ్, డెన్మార్క్, ఆస్ట్రియా, వీసా-రహిత ప్రయాణంతో మొత్తం 192 దేశాలను కలిగి ఉన్నాయి. కాగా, భారత్ ర్యాంకింగ్ 84 నుంచి 85కి దిగజారింది. వీసా లేకుండానే భారతీయులు ప్రస్తుతం 62 దేశాల్లోకి ప్రవేశించవచ్చు. భారత్ పరిస్థితి ఇలా ఎందుకు వెనక్కి వెళ్లిందో తెలియదు.

ఇక మన పొరుగు దేశం పాకిస్థాన్ గతేడాది మాదిరిగానే 106వ స్థానంలో ఉంది. అదేవిధంగా శ్రీలంక 101వ స్థానంలో, బంగ్లాదేశ్ 102వ స్థానంలో, నేపాల్ 103వ స్థానంలో ఉన్నాయి. బలహీనమైన పాస్‌పోర్ట్ ఆఫ్ఘనిస్తాన్‌ వారిది. వీసా లేకుండా ఆఫ్ఘన్‌లు కేవలం 28 దేశాలను మాత్రమే సందర్శించగలరట. అలాగే 108వ స్థానంలో సిరియా, 107వ స్థానంలో ఇరాక్, 105వ స్థానంలో యెమెన్, 103వ స్థానంలో ఉన్న పాలస్తీనా వంటి దేశాలు ఆఫ్ఘనిస్థాన్ తర్వాత ఇతర స్థానాల్లో ఉన్నాయి.

Whats_app_banner