World milk day 2024: ప్రాచీన కాలంలో దేవుళ్ళ ఆహారం పాలు, ఒకప్పుడు వీటిలో కప్పలను వేసి నిల్వ చేసేవారట
World milk day 2024: ప్రపంచ పాల దినోత్సవం వచ్చేసింది. ప్రతి ఏడాది జూన్ 1న దీన్ని నిర్వహించుకుంటారు. పాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ ప్రత్యేక దినోత్సవం.
World milk day 2024: ప్రపంచంలో నీళ్లు తర్వాత ఎక్కువమంది సేవిస్తున్న పానీయం పాలు. పాలు లేనిదే ఎంతో మందికి తెలవారదు. టీ, కాఫీలకు ప్రధాన పదార్థం పాలే. పాల గొప్పతనం తెలియజేసేందుకు ప్రతి ఏడాది జూన్ 1వ తారీకున ప్రపంచ పాల దినోత్సవం నిర్వహిస్తారు. పాలు పోషకాలు నిండిన ఆహారం. దీనిలో కాల్షియం, ఫాస్పరస్, విటమిన్లు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచుతాయి. మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. అభిజ్ఞా క్షీణతను రాకుండా చేస్తాయి. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి.
దేవుళ్ల ఆహారం
పాలు గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాటితో చేయకుండా అవసరమైన వారికి అందేలా ప్రతి ఒక్కరూ తోడ్పడాలి. పాలు హృదయ ఆరోగ్యానికి చాలా అవసరం. పూర్వం గ్రీకులు, రోమన్లు, ఈజిప్షియన్లు మన భారతీయులు కూడా పాలను దేవుళ్ళ ఆహారంగా భావించేవారు. పాలను ఎంతో పవిత్రంగా చూసేవారు. ఇప్పటికీ పాలాభిషేకాలు జరుగుతూనే ఉంటాయి.
పూర్వం నుంచి పాలు అద్భుతమైన పానీయంగానే పేరు తెచ్చుకున్నాయి. అమెరికాలోని పెన్సిల్వేనియాలో పాలను చాలా గౌరవంగా చూస్తారు. పాలు వేసే పాత్రలను ఇతర అవసరాలకు వినియోగిస్తే పాతికవేల రూపాయల ఫైన్ వేసేవాళ్ళు. లేదా జైల్లో పెట్టే వాళ్ళు. చాలామంది ఇప్పుడు కొవ్వు తీసిన పాలను తాగడానికి ఇష్టపడుతున్నారు. నిజానికి కొవ్వు నిండిన సంపూర్ణ పాలను తాగడమే ముఖ్యం. అందులోని కొవ్వు మన శరీరానికి చాలా అవసరం. అది ఒక బయో యాక్టివ్ పదార్థం. శరీరంలో చేరాకా కొవ్వు కరిగేలా చేస్తుంది.
పాలలో కప్పలు
రష్యాలో పూర్వం పాలను చాలా జాగ్రత్తగా భద్రపరిచేవారు. చక్రవర్తులు, నియంతలు పాలను ఇష్టంగా తాగేవారు. అవి త్వరగా పుల్లగా అయిపోతుండేవి. అలా పుల్లగా అవ్వకుండా ఉండడం కోసం వాటిలో బతికి ఉన్న కప్పలను వేసేవారు. ఒక బకెట్ పాలలో ఒక కప్పను వేయడం వల్ల అవి పుల్లగా మారకుండా ఉంటాయని నమ్మేవారు.
పాల నుంచి వచ్చే ఉత్పత్తులు చాలా ఎక్కువ. ఎన్నో రకాల డైరీ ఉత్పత్తులు మనిషి జీవితంలో భాగమైపోయాయి. వెన్న, నెయ్యి, చీజ్ ఇప్పుడు మనిషి ఆహారంలో ముఖ్యంగా మారిపోయాయి. పాలు లేనిదే మనిషి జీవించలేని పరిస్థితికి వచ్చేసాడు. అందుకే పాల వ్యాపారం కూడా ఇప్పుడు జోరుగా సాగుతోంది.
పాలతో ప్లాస్టిక్‌ను తయారు చేయొచ్చు. ఇది నీటిలో కరగదు. వాసన కూడా రాదు. దీనికి మంటలు కూడా అంటుకోవు. అయితే ఈ ప్లాస్టిక్ తయారీ ఇంకా మందకొడిగానే సాగుతోంది. అమెరికాలో ఉన్న రాష్ట్రాలలో 21 రాష్ట్రాలు పాలను తమ అధికారిక రాష్ట్ర పానీయంగా ఎంచుకున్నాయి. ఇప్పుడు భూమిపై ఉన్న ఆహారాలలో అత్యంత పోషకాలు కలిగిన ఆహారం పాలే. దీనిలో ప్రోటీన్, క్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, నియాసిన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అలాగే విటమిన్ ఈ, విటమిన్ బి12 వంటి విటమిన్లు కూడా ఉంటాయి.
పాలు తెల్లగా ఎందుకు ఉంటాయి?
పాలు తెల్లగా ఉండేందుకు కారణం అందులో ఉండే కొవ్వు, ప్రోటీన్ కంటెంట్. పాలల్లో 87% నీరే ఉంటుంది. ఆ నీరు కొవ్వు, ప్రోటీన్ అణువుల కాంతిని ప్రతిబింబించేలా చేస్తుంది. అందుకే పాలకు తెల్లని రంగు వస్తుంది.
పాలు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండాలంటే చిన్న చిట్కా ఉంది. పాలల్లో చిటికెడు ఉప్పును వేసి బాగా షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా పెరుగుదల ఆగిపోతుంది. అలాగే పాలు పుల్లగా మారడం కూడా తగ్గుతుంది. పాలు దాదాపు వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా మారింది. భారతదేశం తర్వాత అమెరికా, చైనా, పాకిస్తాన్ దేశాలు ఉన్నాయి.
ఆవులు ఎక్కువగా పాలు ఇవ్వాలంటే వాటికి నీరు ఎక్కువగా తాగించాలి. ఒక లీటరు పాల కోసం ఒక ఆవుకు రెండున్నర లీటర్ల నీటిని తాగించాల్సి ఉంటుంది. అంటే ఆవులకు రోజుకు 30 నుంచి 40 గ్యాలన్ల నీటిని తాగిస్తే పాలు పుష్కలంగా ఇచ్చే అవకాశం ఉంది.
టాపిక్