Chicken vs Eggs: చికెన్ vs గుడ్లు... ఈ రెండింటిలో వేటిని తింటే ప్రోటీన్ లోపం రాకుండా ఉంటుంది?-chicken vs eggs which of these can prevent protein deficiency ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Vs Eggs: చికెన్ Vs గుడ్లు... ఈ రెండింటిలో వేటిని తింటే ప్రోటీన్ లోపం రాకుండా ఉంటుంది?

Chicken vs Eggs: చికెన్ vs గుడ్లు... ఈ రెండింటిలో వేటిని తింటే ప్రోటీన్ లోపం రాకుండా ఉంటుంది?

Haritha Chappa HT Telugu
May 18, 2024 07:00 AM IST

Chicken vs Eggs: చికెన్, కోడిగుడ్లు రెండిట్లోనూ ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అయితే ఈ రెండింటిలో వేటిని తినడం ద్వారా ప్రోటీన్ లోపం రాకుండా చూసుకోవచ్చో చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

చికెన్, కోడి గుడ్లు... వీటిలో ఏవి తింటే ఆరోగ్యం?
చికెన్, కోడి గుడ్లు... వీటిలో ఏవి తింటే ఆరోగ్యం? (Pixabay)

Chicken vs Eggs: మన శరీరానికి ప్రోటీన్ నిండిన ఆహారం చాలా అవసరం. ప్రోటీన్ పేరు చెబితే గుర్తొచ్చేవి కోడిగుడ్లు, చికెన్. వీటిలోనే అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. అయితే ఎంతో మందికి ఉన్న సందేహం ఏమిటంటే చికెన్, కోడిగుడ్లు... ఈ రెండింటిలో ఏ ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్ లభిస్తుంది అనే విషయాన్ని వివరిస్తున్నారు పోషకాహార నిపుణులు.

yearly horoscope entry point

చికెన్‌లో ప్రోటీన్

చికెన్‌లో లీన్ ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా చికెన్ బ్రెస్ట్ ముక్కల్లో ప్రోటీన్ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇది మన రోజువారీ అవసరాలను తీరుస్తుంది. తక్కువ కొవ్వు, లీన్ ప్రోటీన్ ఉన్న చికెన్ ను తినడం వల్ల ప్రోటీన్లు సులువుగా శరీరానికి అందుతాయి. శరీరం ఫిట్ గా ఉంటుంది.

కోడిగుడ్లలో ప్రోటీన్

కోడిగుడ్ల విషయానికి వస్తే ముఖ్యంగా గుడ్డులోని తెల్లసొనలో అధిక ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఒక పెద్ద గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. కోడి మాంసంతో పోలిస్తే కోడిగుడ్లులో కాస్త తక్కువ ప్రోటీన్ ఉండే అవకాశం ఉంది. ఎక్కువ ప్రోటీన్ కావాలంటే రెండు నుంచి మూడు కోడిగుడ్లు తినవలసి వస్తుంది.

రెండింటిలో ఏది బెటర్?

ఈ రెండింటిలోనూ మన శరీరానికి అవసరమైన ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఈ రెండింటి పోషక ప్రొఫైల్ ను పరిశీలిస్తే మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి అని అర్థమవుతుంది. చికెన్ ను స్కిన్ లెస్ గా తినాలి. చర్మంతో తినడం వల్ల కొవ్వు పేరుకుపోయే అవకాశం ఉంది. చికెన్ స్కిన్ తీసేసాక లీన్ ప్రోటీన్ లభిస్తుంది. అలాగే విటమిన్లు, ఖనిజాలు అద్భుతంగా ఉంటాయి. నియాసిన్, సెలీనియం, ఫాస్ఫరస్, బి విటమిన్లు మరిన్ని అవసరమైన పోషకాలు అందిస్తాయి. కాబట్టి చికెన్ ను వారానికి కనీసం రెండు నుంచి మూడు సార్లు తినడం చాలా అవసరం.

మరోవైపు కోడిగుడ్లలో కూడా విటమిన్ డి, విటమిన్ బి12, ఫ్లవనాయిడ్లు, కొలిన్, ప్రోటీన్ వంటి పోషకాలు నిండుగా ఉంటాయి. కాబట్టి చికెన్ తింటే కోడిగుడ్లు తినాల్సిన అవసరం లేదని అనుకోవద్దు. చికెన్ తిన్నా కూడా కోడిగుడ్లను కచ్చితంగా తినాల్సిందే. ఈ రెండింటిలో ఏది తింటే బెటర్ అనుకోకుండా... రెండూ తినేందుకు ప్రయత్నించాలి. కోడిగుడ్లలో లూటీన్, జియాక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

చికెన్, కోడిగుడ్లు ఈ రెండింటిలో కూడా అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన తొమ్మిది అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఆ అమైనో ఆమ్లాలు కండరాలను రిపేర్ చేయడంలో, కండరాలు పెరుగుదలకు, కణజాల పనితీరుకు మరమ్మత్తుకు ఉపయోగపడతాయి. కాబట్టి చికెన్ లేదా కోడిగుడ్లలో ఏదో ఒకటి తినాలని అనుకోకండి. వీలైనంతవరకు రెండూ తినడానికి ప్రయత్నించండి. ఈ రెండింటిలో కూడా పోషకాహారాలు అధికంగానే ఉన్నాయి. చికెన్ లో అధిక ప్రోటీన్ ఉన్నప్పటికీ, కోడిగుడ్లలో విలువైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి ప్రోటీన్ కోసం చికెన్, పోషకాల కోసం కోడిగుడ్లను తినడం అలవాటు చేసుకుంటే మంచిది.

Whats_app_banner