World Hypertension Day 2023: ప్రపంచ హైపర్‌టెన్షన్ డే ఎందుకు? తేదీ, ప్రాముఖ్యత ఏంటి?: వివరాలివే
World Hypertension Day 2023: ప్రపంచ హైపర్‌టెన్షన్ డే ఎందుకు జరుగుతుంది, ఏ తేదీన వస్తుందో ఇక్కడ తెలుసుకోండి. ఈ డే ప్రాముఖ్యత ఏంటంటే!
World Hypertension Day 2023: ధమనుల గోడలపై (Artery Walls) రక్త ప్రసరణ ఫోర్స్ సాధారణంగా ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉన్న పరిస్థితిని హైపర్‌టెన్షన్ (Hypertension Day) అంటారు. ఇదే హై బ్లడ్ ప్రెజర్(High Blood Pressure)కు కారణం అవుతుంది. సరైన ఆరోగ్యకరమైన ఆహారం తినకపోవడం, జీవన శైలి అస్తవ్యస్థంగా ఉండడం, వ్యాయామాలు చేయకపోవడం సహా మరికొన్ని కారణాల వల్ల ఈ హైబీపీ వస్తుంది. భారత్‍లో హైపర్‌టెన్షన్‍తో కోట్లాది మంది బాధపడుతున్నారు. అయితే, తమకు హైపర్‌టెన్షన్ ఉందని చాలా మందికి తెలియదు. ఇలా హైబీపీని నిర్లక్ష్యం చేసి గుండె సంబంధిత వ్యాధులను తెచ్చుకుంటున్నారు. పరిస్థితిని తీవ్రం చేసుకుంటున్నారు. దీంతో, ఈ హైపర్‌టెన్షన్/హై బ్లడ్ ప్రెజర్‌పై అవగాహన కల్పించేందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది ఈ వరల్డ్ హైపర్‌టెన్షన్ డే (World Hypertension Day) జరుగుతోంది. ఈ హైపర్‌టెన్షన్ డే గురించి ముఖ్యమైన విషయాలు ఇవే.
World Hypertension Day 2023: తేదీ
ప్రతీ ఏడాది మే 17వ తేదీన (May 17) ప్రపంచ హైపర్‌టెన్షన్ డే జరుగుతుంది. ఈ ఏడాది కూడా అదే రోజున జరగనుంది.
World Hypertension Day 2023: చరిత్ర
హైపర్‌టెన్షన్ సమస్య అధికంగా ఉండే 85 దేశాలకు చెందిన ఆర్గనైజేషన్లు ఒకే గొడుకు కిందికి వచ్చి వరల్డ్ హైపర్‌టెన్షన్ లీగ్(World Hypertension League)గా ఏర్పడ్డాయి. ఈ హైపర్‌టెన్షన్ డేను ఈ లీగ్.. తొలిసారి 2005 మే 14న నిర్వహించింది. ఇక ఆ తర్వాత 2006 నుంచి ప్రతీ సంవత్సరం మే 17న నిర్వహిస్తోంది.
World Hypertension Day 2023: ప్రాముఖ్యత ఏంటి?
మీ బ్లడ్ ప్రెజర్‌ను కచ్చితత్వంతో చెక్ చేసుకోండి, కంట్రోల్ చేసుకోండి, సుదీర్ఘంగా జీవించండి (Measure your blood pressure accurately, control it, live longer) అనే థీమ్‍తో ఈ ఏడాది ప్రపంచ హైపర్‌టెన్షన్ డే జరుగుతోంది. హై బ్లడ్ ప్రెజర్‌పై అవగాహన లేమి వల్ల చాలా మంది ఆరోగ్య తీవ్రంగా క్షీణిస్తోంది. ఒకవేళ బ్లడ్ ప్రెజర్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటూ.. అందుకు తగ్గట్టు జాగ్రత్తలు తీసుకుంటే ఇతర వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. హై బీపీని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు లాంటి వ్యాధులకు కారణం అవుతుంది. తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులు, మైకం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లాంటివి హై బ్లడ్ ప్రెజర్ లక్షణాలు ఉన్నాయి.
World Hypertension Day 2023: హై బ్లడ్ ప్రెజర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, దాన్ని అధిగమించేందుకు చికిత్సా పద్ధతులను తెలియజేసేందుకు ఈ వరల్డ్ హైపర్‌టెన్షన్ డే ఉపయోగపడుతుంది. హైపర్‌టెన్షన్ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించాలనే విషయంపై అవగాహన కల్పించడం కూడా ఈ హైపర్‌టెన్షన్ డే లక్ష్యంగా ఉంది.
సంబంధిత కథనం