World Arthritis Day 2023 : ఆర్థరైటిస్ విషయంలో మీ ఆలోచన తప్పు.. వైద్యులు చెప్పేది ఇదే-world arthritis day 2023 what is arthritis and how to face it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Arthritis Day 2023 : ఆర్థరైటిస్ విషయంలో మీ ఆలోచన తప్పు.. వైద్యులు చెప్పేది ఇదే

World Arthritis Day 2023 : ఆర్థరైటిస్ విషయంలో మీ ఆలోచన తప్పు.. వైద్యులు చెప్పేది ఇదే

Anand Sai HT Telugu
Oct 12, 2023 11:00 AM IST

World Arthritis Day 2023 : ఆర్థరైటీస్‍తో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ఉన్నవారు రోజువారీ జీవితం దెబ్బతింటుంది. ఈ విషయంపై కామినేని హాస్పిటల్ సీనియర్ జాయింట్ రీప్లెస్ మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ బెజవాడ పాపారావు మాట్లాడారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

ఆర్థరైటీస్ కారణంగా యువకులలో వైకల్యం ఏర్పడుతుందని డాక్టర్ బెజవాడ పాపారావు అన్నారు. ఈ వ్యాధి సోకిన పక్షంలో చికిత్స ప్రారంభించి వ్యాధి ముదిరి వ్యక్తి కదలిక క్రమక్రమంగా తగ్గిపోతాయని అన్నారు. అలాంటి వారిలో రోజువారీ జీవితం పూర్తిగా దెబ్బతింటుందని చెప్పారు. అక్టోబర్ 12న ఆర్థరైటీస్ దినాన్ని పురస్కరించుకుని పలు విషయాలను పంచుకున్నారు డాక్టర్ పాపారావు.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70 కోట్ల మంది ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడుతున్నాట్లు పాపారావు తెలిపారు. కీళ్ల వాపులు - నొప్పులు వారి జీవితాలను అతలాకుతలం చేస్తాయని చెప్పారు. సాధారణ ప్రజలలో ఆర్థరైటీస్ గురించి అవగాహన కల్పించాల్సి అవసరం ఉందని పేర్కొన్నారు.

'ఆర్థరైటిస్ వ్యాధి లక్షణాలను చాలా మంది వృద్ధాప్యపు సమస్యలని తప్పుగా అర్థం చేసుకుంటన్నట్లు నిపుణులు గుర్తించారు. ఆర్థరైటిస్ వ్యాధిగ్రస్తులలో 65 సంవత్సరాలకు పై బడిన వారు ఎక్కువ సంఖ్యలో ఉండటం కూడా ఈ అపోహ విస్తృత ప్రచారంలో ఉండటానికి కారణం అవుతున్నది. అయితే దాదాపు 30 శాతం మంది 65 ఏళ్లకంటే చిన్న వయస్సులోనే ఈ వ్యాధికి గురయినా ఆర్థరైటిస్ అని గుర్తించక తీవ్రంగా నష్టపోతున్నారు. వీరి కొందరు 20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న యువతీ యువకులు కూడా. రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ ల నివారించే చికిత్సలేదు. చేయగలిగిందల్లా శరీరం బరువు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం వ్యాయామం, తగ్గించటం, వంటి చర్యలు తీసుకోవటమే. వీటికి తోడుకీళ్ల నొప్పులను అదుపుచేసేందుకు తోడ్పడగల కొన్ని మందులను సిపార్సుచేస్తాం.' అని డాక్టర్ బెజవాడ పాపారావు చెప్పారు.

పలు సందర్బాలో ఫిజియోథెరపీ కూడా మంచి ఫలితాలను ఇస్తున్నది. కీళ్ల కదలిక కష్టంగా ఉంటుంది. కానీ పిజియోథెరపీ నిపుణుల పర్యవేక్షణలో ప్రారంభించి కొనసాగించే కదలిక ఆర్థరైటిస్ నొప్పిని అదుపుచేయటానికి సాయపడుతుంది. 'ఆర్థరైటిస్ వెన్నెముక రుగ్మతలకు దారి తీస్తుంది, 80 నుండి 85 శాతం వెన్నునొప్పి కేసులకు నిర్దిష్ట కారణం ఉండదు. యువకులలో వైకల్యానికి ప్రధాన కారణాలలో వెన్నునొప్పి ఒకటిగా నిలుస్తుంది.' అని డాక్టర్ పాపారావు హెచ్చరించారు.

డాక్టర్ పాపారావు
డాక్టర్ పాపారావు
Whats_app_banner