Weight Loss: 16కేజీల బరువు తగ్గిన మహిళ.. ఆమె ఫాలో అయిన డైట్ ప్లాన్ ఏంటంటే..
Weight Loss: ఓ మహిళ 83 కేజీల నుంచి 67 కేజీలకు తగ్గారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఆమె షేర్ చేశారు. 16కేజీల బరువు తగ్గేందుకు తాను ఏ డైట్ ప్లాన్ పాటించానో వెల్లడించారు.
బరువు తగ్గేందుకు సరైన డైట్ పాటించడం చాలా ముఖ్యం. ప్రతీ రోజు దీన్ని ఫాలో అవుతూ ఉండాలి. బరువు తగ్గే జర్నీలో క్రమశిక్షణ చాలా అవసరం. ఆహార జాగ్రత్తలతో పాటు ఎక్సర్‌సైజ్‍లు కూడా చేయాలి. కాగా, తాను తాజాగా 16 కేజీల బరువు తగ్గానని భావన అనే మహిళ సోషల్ మీడియాలో తెలిపారు. 83 కేజీల నుంచి 67 కేజీల బరువు వచ్చానని వెల్లడించారు. ఇందుకు తాను పాటించిన డైట్ ప్లాన్‍ను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఉదయం ఇలా..
బరువు తగ్గేందుకు ప్రయత్నించడానికి ముందు భావన 83 కేజీలు ఉండేవారు. ప్రస్తుతం 16 కేజీలు తగ్గి 67 కేజీల బరువుకు చేరుకున్నారు. తన డైట్ ప్లాన్ గురించి వివరించారు. ఇన్‍స్టాగ్రామ్ పోస్ట్ ప్రకారం, ఉదయాన్నే 8 గంటలకు బుల్లెట్ కాఫీ తాగి రోజును ప్రారంభించేవారు. బ్రేక్‍ఫాస్ట్ తినే వారు కాదు. ఉదయం 11 గంటలకు బ్రంచ్ చేసేవారు. ఆ సమయంలో ఫ్రూట్ బౌల్స్, రాత్రంతా నానబెట్టిన ఓట్స్, వెజ్/ నాన్ వెజ్ బౌల్స్ తీసుకునే వారు.
బ్రంచ్‍లో ఒక పండు తీసుకునే వారు. యాపిల్, అరటి పండు, స్ట్రాబెర్రీలో ఏదో ఒకటి ఆ ఫ్రూట్ బౌల్‍లో ఉండేది. అరకప్పు ఓట్స్, ఒక కప్పు పాలు, అందులో రెండు చియా సీడ్స్, అర టీస్పూన్ కోకోవా పౌడర్, ఓ టేబుల్ స్పూన్ తేనె వేసుకొని రాత్రంతా నానబెట్టి.. బ్రంచ్‍లో తినేవారు. కూరగాయలను కలిపి.. రెండు ఎగ్స్ ఆమ్లెట్ తీసుకునే వారు. రాత్రంతా నానబెట్టిన డ్రైఫ్రూట్స్ తీసుకునే వారు. లేకపోతే వాటితో స్మూతీ చేసుకొని తీసుకునే వారు.
వెబ్‍బౌల్‍లో.. శనగలు, పప్పు లేకపోతే ఏదైనా ఓ పప్పు ధాన్యం ఉండేది. అవీ కాకపోతే పనీర్ బుర్జీ కూడా తినేవారు. ఒక కప్పు యగర్ట్, 2 ఖర్జూరాలను డెజర్ట్‌గా తీసుకువారు. నాన్‍వెబ్ బౌల్ అయితే.. అందులో ఎయిర్ ఫ్రైడ్ చికెన్/ ఫిష్/ ఎగ్స్ ఏవో ఒకటి ఉండేవి.
మధ్యాహ్నం స్నాక్సే
బ్రంచ్ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య భావన ఆరోగ్యకరమైన స్నాక్స్ తినేవారు. ఇందుకు మూడు ఆప్షన్లు సెట్ చేసుకున్నారు. అరకప్పు యగర్డ్, బ్లూబెర్రీస్, తేనె కలిపి తినేవారు. వేయించిన శనగలు లేకపోతే మఖానా తీసుకునే వారు. ఏదైనా పండు తీసుకునే వారు.
డిన్నర్ ఇలా..
రాత్రి డిన్నర్‌లో వెజ్ బౌల్ (ఇష్టమైన పప్పు ధాన్యాలు/పన్నీర్ కర్రీ లేకపోతే బుర్జీ/ సలాడ్/ సోయా చంక్స్ కర్రీ) లేకపోతేే నాన్‍వెజ్ బౌల్ తీసుకునే వారు. ఈ నాన్‍వెజ్ బౌల్‍లో ఎయిర్ ఫ్రైడ్/గ్రిల్డ్ చికెన్ లేకపోతే ఫిష్, ఎగ్స్ ఉండేవి. ఇలా డిఫరెంట్ ఆప్షన్లతో వెయిట్ లాస్ డైట్‍ను ఫాలో అయినట్టు భావన వెల్లడించారు.
ఈ డైట్ ప్లాన్ పాటించి భావన 16 కేజీలు తగ్గినట్టుగా తెలిపారు. అయితే, తాను ఏవైనా ఎక్సర్‌సైజ్‍లు చేెశారా అనేది వెల్లడించలేదు. అలాగే, బరువు తగ్గాలనుకునే వారు.. వారి శరీర పరిస్థితులకు తగ్గట్టు, ఆరోగ్యానికి తగ్గట్టుగా డైట్ ప్లాన్ చేసుకోవాలి. ప్రతీ ఒక్కరి వ్యక్తిగత పరిస్థితులు వేర్వేరుగా ఉండొచ్చు. అందుకే బరువు తగ్గేందుకు నిర్ణయించుకున్నప్పుడు నిపుణుల సలహా తీసుకొని.. మీకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి.