అరటి పండు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం వంటి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అరటి పండు తింటే కలిగే 9 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
pexels
By Bandaru Satyaprasad Aug 13, 2024
Hindustan Times Telugu
రక్తంలో చక్కెర స్థాయిలు - అరటి పండులో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. అరటి పండులోని పెక్టిన్ అనే ఫైబర్ రక్తంలో చక్కెర శోషణను తగ్గిస్తుంది.
జీర్ణ క్రియ ఆరోగ్యం- అరటి పండులోని ఫైబర్ పేగుల్లో ఆహార కదలికలను సులభం చేసి మలబద్ధకాన్ని నివారిస్తుంది. అరటి పండు గట్ సమస్యలను తగ్గించి, జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.
pexels
బరువు తగ్గడంలో - అరటి పండులోని ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. ఆకలిని అదుపుచేసి బరువును నియంత్రించుకోవడానికి సహాయపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు - అరటి పండులో విటమిన్ సి, డోపమైన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర కణాలను ఆక్సీకరణ ఒత్తిడి, ఇన్ ఫ్లమేటరీ నుంచి రక్షిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావాన్ని తగ్గిస్తాయి.
pexels
హార్ట్ హెల్త్ కు - అరటి పండులోని పొటాషియం గుండె ఆరోగ్యానికి కీలకం. పొటాషియం రిచ్ ఫుడ్స్ రక్త పోటును నియంత్రించి హైపర్ టెన్షన్, స్ట్రోక్ ను నివారిస్తాయి.