Winter Drinks: చలికాలంలో ఈ వేడి పానీయాలు తాగితే పొట్ట కొవ్వు కరగడం ఖాయం-winter drinks drinking these hot drinks during winters is sure to melt belly fat ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Winter Drinks: చలికాలంలో ఈ వేడి పానీయాలు తాగితే పొట్ట కొవ్వు కరగడం ఖాయం

Winter Drinks: చలికాలంలో ఈ వేడి పానీయాలు తాగితే పొట్ట కొవ్వు కరగడం ఖాయం

Haritha Chappa HT Telugu
Jan 03, 2024 07:00 AM IST

Winter Drinks: పొట్ట దగ్గర కొవ్వును కరిగించే వేడి పానీయాల గురించి తెలుసుకోండి.

పొట్టను కరిగించే పానీయాలు
పొట్టను కరిగించే పానీయాలు (pixabay)

Winter Drinks: శరీరంలో కొవ్వు పేరుకుపోయే మొదటి ప్రాంతం... పొట్ట. కొందరికి బాన పొట్ట పెరిగి అందవికారంగా కనిపిస్తుంది. ఆరోగ్యానికి ఇది ఏ మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా వేసవితో పోలిస్తే చలికాలంలో బరువు పెరిగిపోయే వారి సంఖ్య అధికంగా ఉంది. చలి వల్ల వ్యాయామం చేయకపోవడం, ఆహారం ఎక్కువగా తినాలనిపించడం, స్పైసి ఫుడ్ తినాలన్న కోరికలు పెరగడం వంటివన్నీ చలికాలంలో బరువు పెరగడానికి కారణమవుతున్నాయి. కొన్ని రకాల పానీయాలు తాగడం వల్ల పొట్ట దగ్గర చేరిన కొవ్వును కరిగించుకోవచ్చు. ఈ పానీయాలను వేడిగా ఉన్నప్పుడే తాగాలి. ఆ పానీయాలు ఏంటో తెలుసుకుందాం.

1. ఒక గ్లాసు పాలను వేడి చేసి అందులో ఒక స్పూను పసుపు కలుపుకోవాలి. నల్ల మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. దీన్ని ప్రతి రోజు తాగుతూ ఉండాలి. దీనివల్ల కొవ్వు త్వరగా కరిగిపోతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆకలి తక్కువగా వేస్తుంది.

2. చలికాలంలో ఖచ్చితంగా తినాల్సిన పదార్థాలలో అల్లం ఒకటి. నీటిలో అల్లం తరుగును వేసి మరిగించాలి. ఆ నీటిని వడకట్టి ఒక గ్లాసులో వేయాలి. కాస్త నిమ్మరసం, తేనె కలుపుకొని దాన్ని తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల క్యాలరీలు త్వరగా బర్న్ అవుతాయి. పొట్ట దగ్గర కొవ్వు చేరే అవకాశం తగ్గుతుంది.

3. నీటిలో ఒక స్పూను దాల్చిన చెక్క పొడిని వేసి మరిగించాలి. తర్వాత దాన్ని గ్లాసులో వేసి ఒక స్పూన్ తేనె కలుపుకోవాలి. ఆ పానీయాన్ని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఆహారాన్ని తినాలన్న కోరిక కూడా తగ్గుతుంది. కాబట్టి అధిక బరువుతో బాధపడుతున్న వారు, మధుమేహం ఉన్నవారు ఈ దాల్చిన చెక్కతో చేసిన పానీయాన్ని తాగడం అవసరం.

4. గ్రీన్ టీని ప్రతి ఒక్కరూ తాగాల్సిన అవసరం ఉంది. గ్రీన్ టీని మరీ వేడిగా తాగడం వల్ల ఉపయోగం ఉండదు. గోరువెచ్చగా మారాక అందులోని ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూను తేనె కలుపుకొని తాగితే మంచిది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచి శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటాయి.

5. ప్రతిరోజూ ఉదయం లేవగానే ఒక కప్పు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మ చెక్క నుంచి తీసిన రసాన్ని వేసి బాగా కలపాలి. అందులోనే ఒక స్పూన్ తేనె, చిటికెడు మిరియాల పొడి కూడా వేసి తాగాలి. ఇది జీవక్రియ వేగాన్ని పెంచుతుంది. ఆహారాన్ని పూర్తిగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అది కొవ్వుగా పేరుకోకుండా అడ్డుకుంటుంది.

Whats_app_banner