ఒత్తైన జుట్టు కోసం దాల్చిన చెక్క.. ఎలా ఉపయోగించాలో నిపుణుల సూచనలు తెలుసుకోండి-cinnamon for thicker hair know how to use it from experts ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Cinnamon For Thicker Hair Know How To Use It From Experts

ఒత్తైన జుట్టు కోసం దాల్చిన చెక్క.. ఎలా ఉపయోగించాలో నిపుణుల సూచనలు తెలుసుకోండి

దాల్చిని చెక్కతో ఒత్తైన జుట్టు
దాల్చిని చెక్కతో ఒత్తైన జుట్టు

ఒత్తైన జుట్టును సహజంగా పొందడానికి పరిష్కారాల కోసం వెతుకుతున్నారా? జుట్టు పెరుగుదలకు దాల్చినచెక్కను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి.

అందమైన, పొడవాటి, ఒత్తైన జుట్టును ఎవరు కోరుకోరు? చాలా బ్యూటీ ప్రోడక్ట్స్ మీ జుట్టును పొడవుగా, ఒత్తుగా పెంచుతాయని హామీలు గుప్పిస్తున్నప్పటికీ, వాటిలో చాలా వరకు ఫలితాలను ఇవ్వవు. పైగా కొత్తగా జుట్టు సమస్యలకు కూడా కారణమవుతాయి. ఒత్తైన జుట్టు పొందడానికి కొత్త ఉత్పత్తులను ప్రయత్నించడంలో మీరు అలసిపోయినట్లయితే, మీరు హోం రెమెడీస్ ప్రయత్నించండి. మీ జుట్టుకు అద్భుతంగా పనిచేసే సుగంధ ద్రవ్యాల్లో దాల్చినచెక్క ఒకటి.

ట్రెండింగ్ వార్తలు

దాల్చిన చెక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి మీ జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటాయి. దాల్చినచెక్కను పురాతన కాలం నుండి ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తున్నారు.

ఒత్తైన జుట్టుకు దాల్చినచెక్కను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోవడానికి చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ రింకీ కపూర్‌ను సంప్రదించగా ఆమె కొన్ని చిట్కాలు వివరించారు.

ఒత్తైన జుట్టు కోసం దాల్చిన చెక్క

దాల్చినచెక్క యాంటీఆక్సిడెంట్లు, ఇతర ప్రయోజనకరమైన సమ్మేళనాలతో సమృద్ధిగా ఉన్న సుగంధ ద్రవ్యం. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. సైనస్ ఇన్ఫెక్షన్లు, మంటను తగ్గించడానికి మాత్రమే కాకుండా జుట్టు సమస్యలను పరిష్కరించడానికి కూడా దాల్చినచెక్క మంచిదని డాక్టర్ కపూర్ చెప్పారు.

దాల్చిన చెక్కలోని ప్రోసైనిడిన్ జుట్టు కుదుళ్లను ఉత్తేజపరుస్తుంది. వేగవంతమైన పెరుగుదలకు సహాయపడుతుంది. ఇది జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. దాల్చినచెక్క జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి, బట్టతలను నివారించడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇందులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబయల్ లక్షణాలు, పాలీఫెనాల్స్ కూడా ఉన్నాయి. ఇవి సహజ యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. యాంటీమైక్రోబయల్ లక్షణాలు కూడా స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను నివారించగలవు.

ఒక అధ్యయనం దాల్చినచెక్కలోని ప్రోసైనిడిన్ జుట్టు పెరుగుదలపై సానుకూల ప్రభావాలను చూపుతుందని కనుగొన్నారు. చర్మవ్యాధి నిపుణులు హెయిర్ ఆయిల్‌లో దాల్చిన చెక్కను ఉపయోగించాలని సిఫార్సు చేస్తారు. ఇందులో ఉండే సిన్నమాల్డిహైడ్ రక్తనాళాలను విడదీసి నెత్తిమీద రక్తప్రసరణను పెంచి, మెరిసే జుట్టును ఇస్తుంది. ఇది యాంటీ ఫంగల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇది తల మీద జుట్టును ఇన్‌ఫ్లమేషన్ నుండి రక్షించడానికి, చుండ్రును నివారించడానికి సహాయపడుతుంది.

ఒత్తైన జుట్టు కోసం దాల్చినచెక్కను ఎలా ఉపయోగించాలి?

జుట్టు పెరుగుదలను ప్రేరేపించడానికి, ఒత్తుగా ఉండటానికి మీరు దాల్చినచెక్కను ఉపయోగించేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒత్తైన జుట్టు కోసం డాక్టర్ కపూర్ సిఫార్సు చేసిన రెండు దాల్చినచెక్క హెయిర్ మాస్క్‌లు ఇక్కడ ఉన్నాయి.

1. గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క పొడి, ఒక చెంచా తేనె, కొద్దిగా కొబ్బరినూనె కలపాలి. మిక్స్ చేసి చిక్కటి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మ్యాజికల్ మాస్క్‌ను తలకు అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి. ఈ మాస్క్ ను మీ జుట్టుపై సుమారు 20 నిమిషాలు ఉంచండి. మీరు మీ జుట్టు వేగంగా పెరుగుతుంది.

2. గుడ్డు, కొబ్బరి నూనె, తాజాగా రుబ్బిన దాల్చిన చెక్క మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ చిక్కటి పేస్ట్‌ను తలకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే జుట్టు పెరుగుదల కనిపిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

దాల్చినచెక్కను ఎంత ఉపయోగించాలి?

దాల్చినచెక్క మీ జుట్టుకు అద్భుతంగా పనిచేస్తుందని మీకు నమ్మకం ఉంటే మీరు దీన్ని ప్రయత్నించవచ్చు. అయితే అంతకంటే ముందు, ఏదైనా కొత్త హోమ్ రెమెడీస్ ప్రయత్నించే ముందు మీరు మీ వైద్యుడిని సంప్రదించాలి. అలాగే మీరు ఎంత దాల్చినచెక్కను ఉపయోగిస్తారు అనేది ముఖ్యం.
దాల్చినచెక్క జుట్టు పెరుగుదలకు, జుట్టు ఆరోగ్యానికి ప్రభావవంతంగా ఉంటుందని నిరూపితమైనప్పటికీ దీనిని మితంగా ఉపయోగించాలి. అతిగా వాడే ఏ ఉత్పత్తి అయినా మంచి కంటే కీడే ఎక్కువ చేస్తుంది. మీరు మీ వైద్యుడి సూచనలను పాటించాలి. మీ జుట్టు అంతటా మాస్క్ ఉపయోగించే ముందు మొదట ప్యాచ్ టెస్ట్ చేయండి.