Dreams and Meanings : కలలో నల్ల పిల్లి కనిపిస్తే అర్థమేంటి? ఏం జరగుతుంది?
Meaning Of Dreams : స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని రకాల జంతువుల కలలో కనిపిస్తే వాటికి అర్థాలుంటాయి. నల్ల పిల్లి కనిపిస్తే కూడా దానికి ప్రత్యేకమైన అర్థం ఉంది. ఇలా కనిపిస్తే ఏం జరుగుతుందో చూద్దాం..
స్వప్న శాస్త్రం ప్రకారం, కలలు భవిష్యత్ గురించి చెబుతాయి. కలలు లోతైన సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఎటువంటి కారణం లేకుండా కల జరగదని డ్రీమ్ సైన్స్ చెబుతోంది. కొన్నిసార్లు మనసులో అణచివేయబడిన భావాలు లేదా కోరికలు కలల రూపంలో కనిపిస్తాయి. కొన్ని కలలు రాబోయే రోజులు ఎలా ఉండవచ్చనే సూచనను కూడా ఇస్తాయి.
భవిష్యత్తులో ఏం జరుగుతుందో కలలు చెబుతాయని డ్రీమ్ సైన్స్ అంటోంది. కొన్నిసార్లు కలలు గత సంఘటనలకు సంబంధించినవి కూడా ఉంటాయి. చాలా కలలు మనం జాగ్రత్తగా ఉండాలని లేదా సమీప భవిష్యత్తులో శుభవార్తలను ఆశించాలని సూచిస్తాయి.
మనం కలలో పిల్లులు, చిరుతలు మొదలైన జంతువులను చూస్తాం. పిల్లి చాలా మందికి ఇష్టమైన ఇంటి పెంపుడు జంతువు. అయితే నల్ల పిల్లిని ఇంట్లో పెట్టుకోవడం చాలా అరుదుగా ఉంటుంది. నల్ల పిల్లి అరిష్టం అని ఒక సామెత కూడా ఉంది. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం.. కలలో నల్ల పిల్లి కనిపించడం అంటే ఏమిటి? తెల్ల పిల్లి కల అంటే ఏంటో తెలుసుకుందాం.
కలలో నల్ల పిల్లి పదే పదే కనిపిస్తే, జాతకంలో రాహుదోషం అని అర్థం. ఒక నల్ల పిల్లి మీ కలలో మీపై దాడి చేసి, దాని పళ్ళతో మిమ్మల్ని కొరికితే, ఈ కల మీకు ప్రాణాంతకం కావచ్చు. సమీప భవిష్యత్తులో మీకు పెద్ద ప్రమాదం జరగవచ్చని ఈ కల సూచిస్తుంది. మీరు విషయాలు రహస్యంగా ఉంచాలి. మీకు ఇష్టమైన వ్యక్తి మీకు ద్రోహం చేయవచ్చు.
ఒక నల్ల పిల్లి మిమ్మల్ని కలలో కొరికేందుకు ప్రయత్నిస్తే, మీరు దాని నుండి తప్పించుకుంటే, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు మీతో కుట్ర చేయడానికి ప్రయత్నిస్తారు. అది విజయవంతం కాక మీరు వారి ఉచ్చు నుండి ఎలాగైనా తప్పించుకుంటారని అర్థం.
కానీ మీరు కలలో పిల్లి కాటుతో గాయపడి చనిపోతే, మీరు జాగ్రత్తగా ఉండాలి. సమీప భవిష్యత్తులో మీరు కొన్ని తీవ్రమైన వ్యాధులతో బాధపడుతారని ఇది సంకేతం. కలలో పిల్లి వేరే రంగులో ఉంటే పెద్దగా పట్టింపు లేదు. కానీ నలుపు, తెలుపు పిల్లులు ప్రాణాంతకం.
కలలో పిల్లి మీరు వెళ్లే దారిలో అడ్డంగా దాటడాన్ని మీరు చూస్తే, భవిష్యత్తులో మీ పనిలో అడ్డంకులు ఎదురవుతాయని అర్థం. మీరు ప్రయాణం చేయబోతున్నట్లయితే, వీలైతే, ప్రస్తుతానికి ఆపండి. ఈ కల ప్రమాదానికి సంకేతం.
గమనిక : పైన ఇచ్చిన కథనం విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. హిందూస్థాన్ టైమ్స్ తెలుగు.. ఇందులోని అంశాలను ఆమోదించదు. మీ విచక్షణ ప్రకారం నిర్ణయాలు తీసుకోండి. సమాచారం అందించేందుకు మాత్రమే కథనం ఇచ్చాం.