Sunday Phobia: మీకూ ఉందా సండే ఫోబియా? మండే కంటే సండే అంటేనే జంకుతున్నారట-what is sunday phobia know reasons for sunday blues ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sunday Phobia: మీకూ ఉందా సండే ఫోబియా? మండే కంటే సండే అంటేనే జంకుతున్నారట

Sunday Phobia: మీకూ ఉందా సండే ఫోబియా? మండే కంటే సండే అంటేనే జంకుతున్నారట

Koutik Pranaya Sree HT Telugu
Aug 11, 2024 02:30 PM IST

Sunday Phobia: ఆదివారం అంటే ఆనందంగా ఉండాలి కానీ, చాలామందిలో ఆందోళన ఉంటోందట. ఈ సెలవు రోజును ఎలా గడపాలో తెల్సుకోండి. అసలు సండే అంటే భయమెందుకో కూడా కారణాలు చూడండి.

సండే ఫోబియా
సండే ఫోబియా (freepik)

ఆదివారం అంటేనే చాలా మందిలో ఆందోళన మొదలవుతోందట. సోమవారం రోజు ఆఫీసు మొదలవుతుందనే కారణంతో టెన్షన్ పడితే ఓకే కానీ, ఆదివారం భయమెందుకు అనిపిస్తోందా? కానీ మీ చుట్టూ ఉన్న జనాల్ని అడిగి చూడండి. వాళ్లు కూడా దీనికి ఒప్పుకుంటారు. శుక్రవారం సాయంత్రం సంతోష స్థాయులు చాలా ఎక్కువగా ఉంటాయి. శనివారం రోజు కూడా చాలా ఆనందంగా గడిపేస్తారు. ఆదివారం వచ్చేసరికి వీకెండ్ అయిపోయిందనే ఆందోళనతోనే రోజు మొదలవుతుంది.

రాబోయే వారం గురించిన భయం ఎంతగా కలవరపెడుతుందంటే.. ఆదివారాలు ఆందోళనకు నిలయంగా మారిపోతాయి. దాంతో రెండ్రోజుల వీకెండ్ కాస్తా ఒక్కరోజుకు కుదించినట్లే. ఆదివారం సూర్యాస్తమయం అవుతుందంటే ఆ భయం విపరీతంగా పెరిగిపోతుంది. వచ్చే వారం ఎవరెస్టు పర్వతం ఎక్కాల్సిఉందేమో అన్నంతంగా భయం మొదలైపోతుంది. కేవలం ఆదివారాన్ని బఫర్ డే గా మాత్రమే చూస్తున్నారంట. ఏం ప్లానింగ్స్ ఉన్నా శనివారమే పూర్తి చేసుకునే లాగా ప్లానింగ్ చేసుకుంటున్నారు చాలా మంది. అయితే మీ ఆదివారాలు ఆందోళనతో ముగిసిపోకుండా ఉండటానికి కొన్ని మార్గాలున్నాయి.

కారణాలు గుర్తించండి:

సండే ఫోబియా
సండే ఫోబియా (Pexels)

కొత్త వారంలో మీరు చేయాల్సిన పని, ఎదుర్కోనున్న సమస్యలను ముందుగానే ఊహించడం వల్లే సండే అంటే భయానకంగా మారుతుంది. అందుకే మిమ్మల్ని సరిగ్గా ఇబ్బంది పెడుతున్నది ఏమిటో గుర్తించండి.  దాని కోసం ముందుగానే సిద్ధం చేయడానికి ఒక వ్యూహాన్ని అమలు చేయండి.

వారంలో మిగతా రోజులు ఇలా ఉండాలి:

వారాంతం ఇలా గడపాలి
వారాంతం ఇలా గడపాలి (Pexels)

వీకెండ్స్ లో సరదాను పక్కన పెట్టకండి. వీకెండ్ కోసం థ్రిల్ మరియు ఉత్సాహాన్నిచ్చే పనులు చేయడం అత్యవసరం. లేదంటే మిగతా వారమంతా ఆందోళనతోనే సాగుతుంది. ఏదైనా ఒక వీకెండ్ రోజు తప్పకుండా సాయంత్రం పూట మంచి సినిమాకో, షికారుకో వెళ్లండి.

సోమవారం మీ వర్క్ బెస్టీకి ఏదైనా టీ పార్టీ ఇవ్వండి. మంగళవారం మీరు ఇంటికి వచ్చినప్పుడు కొత్త పుస్తకాల స్టోర్ సందర్శించండి. ఇలా వీకెండ్ కే అన్ని పనులు వాయిదా వేయకుండా.. మిగతా వారాల్లోనూ కుదిరినప్పుడల్లా కొన్ని పనులు చేయండి. సరదానంతా వీకెంట్ కోసమే దాచిపెట్టకండి. మిగతా రోజుల్లోనూ మిమ్మల్ని సంతోషపరిచే ఏదైనా పనులు తప్పకుండా చేయండి.

పనులు సమానంగా విభజించండి:

పనుల విభజన
పనుల విభజన (Pexels)

మీరనుకున్న పనులన్నీ శనివారమే చేయడం వల్ల ఆదివారం బాగా అలిసిపోయినట్లు అనిపిస్తుంది. అలాని ఆదివారం ఎక్కువగా అలిసిపోతే సోమవారం సరిగ్గా మొదలుపెట్టలేరు. కాబట్టి ఈ రెండ్రోజుల్లో సమానంగా పనులు విభజించుకోండి. దాంతో ఆదివారం అయిపోయినా, మొదలైనా బాధ ఉండదు. శనివారం ఎలా గడిపారనే ప్రభావం ఆదివారం మీద తప్పకుండా పడుతుంది.

జర్నలింగ్:

జర్నలింగ్
జర్నలింగ్ (Unsplash)

మనుషులు భావోద్వేగాల బాంఢాగారాలు. గజిబిజి ఆలోచనలు కూడా బోలెడుంటాయి. ఈ అలజడి నుంచి బయటపడటానికి జర్నలింగ్ సాయపడుతుంది. మీ ఆలోచనలను పేపర్ మీద పెట్టండి. మీ భావోద్వేగాల్ని ఒకచోట రాయడం వల్ల మీకు మంచి స్పష్టత వస్తుంది. రాబోయే వారాన్ని ఎదుర్కోడానికి సిద్దంగా ఉన్న భావన వస్తుంది. మీకిలా రాయడం ఇష్టం లేకపోతే బేకింగ్, సైక్లింగ్, యోగా, పెయింటింగ్ వంటి  అభిరుచులు ఏవైనా అలవాటు చేసుకోండి. 

పాజిటివ్ ఎండింగ్:

సానుకూల ముగింపు
సానుకూల ముగింపు (Pexels)

ప్రతిసారి ఆదివారాన్ని ఆందోళనతో ముగించకండి. మీ మనసులో ఆదివారాన్ని ఆనందంగా ఎలా ముగించాలో ఆలోచించండి. ఆదివారం సాయంత్రం మీ చర్మం సంరక్షణ కోసం కాస్త సమయం కేటాయించండి. మంచి పుస్తకం చదివి ఆదివారం సాయంత్రం ముగించండి. లేదా మంచి సినిమా చూడండి. ఇలా మీకిష్టమైన పనితో సండే గడిపితే ఫోబియా ఉండదు. ఆనందంగా సోమవారాన్ని ఆహ్వానిస్తారు.

టాపిక్