Moon Charged Water Benefits | వెన్నెల్లో ఉంచిన నీటిని తాగితే అందం, ఆరోగ్యం!
నీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనకు తెలుసు, మరి చంద్రుని కాంతి కింద ఉంచిన నీరు తాగితే ఏమౌతుంది? చంద్రుని గురుత్వాకర్షణ శక్తి భూమిపై ఉన్న సముద్రాలలో అటుపోట్లు కలిగించటానికి ఉపయోగపడుతుంది. మరి మనుషుల ఆరోగ్యంపై చంద్రుని ప్రభావం ఎలా ఉంటుంది? ఇక్కడ తెలుసుకోండి.
ప్రతిరోజూ తగినంత నీరు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా అవసరం. ఎంత అవసరం అంటే మనం తాగిన నీరు కణాలకు పోషకాలు, ఆక్సిజన్‌ను తీసుకువెళుతుంది. కీళ్లను లూబ్రికేట్ చేస్తుంది. వ్యర్థ పదార్థాలను బయటకు పంపడం ద్వారా మూత్రపిండాలు, కాలేయంపై భారాన్ని తగ్గిస్తుంది. మీ శరీరానికి అవసరమయ్యే ఖనిజాలు, పోషకాలను కరిగించడంలో సహాయపడుతుంది. ఇలా శరీరంలోని ప్రతీ అవసరానికి నీరు అనేది చాలా అవసరం.
అయితే మనకు ఇప్పుడు మినరల్ వాటర్, ఫిల్టర్ వాటర్ అంటూ అందుబాటులో ఉంటాయి. కొందరు మట్టి కుండల్లో నిల్వ ఉంచిన నీరు తాగితే మంచిదంటారు, లేదా రాగి పాత్రల్లో నీరు త్రాగటం వలన ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. కానీ మీరు ఎప్పుడైనా చంద్రుని కాంతిలో ఉంచిన నీటి ప్రయోజనాల గురించి విన్నారా? దీనినే ల్యూనార్ వాటర్ అని కూడా పిలుస్తున్నారు.
వెన్నెల వెలుగులో ఉంచిన నీరు తాగితే అది ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. రాత్రంతా చంద్రునికాంతిలో ఉంచి మూన్ ఛార్జ్ చేసిన నీటిని ఉదయం లేవగానే తాగితే, అది మీ ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగుపరచటంలో అద్భుతాలు చేస్తుందని అంటున్నారు. అంతేకాదు PCOS సమస్యలను ఎదుర్కొంటున్న స్త్రీలు కూడా ఈ మూన్ చార్జ్డ్ వాటర్ తాగితే ఫలితం ఉంటుందట. ల్యూనార్ వాటర్ తాగితే మానసిక ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణురాలు నికితా కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.
Moon Charged Water తాగితే కలిగే ప్రయోజనాలు
మూన్ చార్జ్డ్ వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయుర్వేద నిపుణులు వివరించారు, అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
ఋతు చక్రం
ఆయుర్వేదం ప్రకారం, చంద్రుని 28-రోజుల ల్యూనార్ సైకిల్ ఆడవారి పీరియడ్స్‌తో ముడిపడి ఉంటుంది. కాబట్టి మూన్ ఛార్డ్జ్ వాటర్ తాగితే, గతి తప్పిన ఋతు చక్రం తిరిగి ట్రాక్‌లోకి రావడానికి ఇది సహాయపడుతుంది.
శక్తి పెరుగుతుంది
చంద్రుని క్రింద ఉంచిన నీటిని త్రాగడం మీ శక్తిని పునరుజ్జీవింపజేయడంలో, శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇది మీ మానసిక ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. భావోద్వేగాలు అదుపులో ఉంటాయి.
చర్మం ప్రకాశవంతంగా మారుతుంది
చంద్రకాంతిలో ఉంచిన నీరు తాగితే మీ చర్మంలోని నిగారింపును మెరుగుపరుస్తుంది. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. మెరిసే చర్మం కోసం మీ రోజూవారీ దినచర్యలో భాగంగా మూన్ ఛార్జ్డ్ వాటర్ తాగుతూ ఉండండి.
PCOSను ఎదుర్కోవచ్చు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో మూన్‌చార్జ్డ్ వాటర్ తాగడం వలన హార్మోన్ల అసమతుల్యతను అధిగమించడంలో సహాయపడుతుందని నమ్ముతారు.
మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది
చంద్రకాంతిలో ఉంచిన నీరు మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుచడంలో సహాయపడుతుంది. మీ సంపూర్ణ ఆరోగ్యం కోసం మూన్ ఛార్జ్డ్ వాటర్ ప్రయోజనకరంగా ఉంటుంది.
మూన్ చార్జ్డ్ వాటర్ ఎలా తాగాలి
1) ఖాళీ కడుపుతో త్రాగాలి- రాత్రంతా చంద్రుని వెలుగులో తాగే నీటిని ఉంచి, ఉదయం నిద్రలేచిన తర్వాత మీరు ఖాళీ కడుపుతో ఒక గ్లాసు మూన్ చార్జ్డ్ వాటర్ తాగాలి. ఇది సులభమైన, అత్యంత ప్రభావవంతమైన మార్గం.
2) టీలో ఉపయోగించండి- మీరు ఈ నీటిని టీ తయారు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. మూన్ చార్జ్డ్ వాటర్ తో టీ కాచుకొని తాగితే కూడా ప్రయోజనం పొందవచ్చు.
గమనిక: ఈ సమాచారం అందుబాటులో ఉన్న నివేదికలు, నిపుణుల అభిప్రాయల మేరకు ఇచ్చినది. శాస్త్రీయ ఆధారాలేమి లేవు. అయితే మూన్ ఛార్జ్డ్ వాటర్ తాగటం వలన ఆరోగ్యానికి మేలు జరగటం తప్ప, ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవని నివేదికలు పేర్కొన్నాయి. దీని గురించి మీరు వైద్యుల సలహా స్వీకరించవచ్చు.
సంబంధిత కథనం