Yoga for Mental Illness : ఈ మూడు ఆసనాలతో.. మానసిక స్థితిని మెరుగుపరచుకోండి..-theses three asanas rescue you for sure from mental illness ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yoga For Mental Illness : ఈ మూడు ఆసనాలతో.. మానసిక స్థితిని మెరుగుపరచుకోండి..

Yoga for Mental Illness : ఈ మూడు ఆసనాలతో.. మానసిక స్థితిని మెరుగుపరచుకోండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 07, 2022 10:00 PM IST

చాలా మంది యోగా ఎందుకు చేస్తారంటే మానసిక ప్రశాంతత కోసమే అని చెప్పవచ్చు. ఎందుకంటే.. శారీరక ఆరోగ్యం కోసం పలు రకాల వ్యాయామాలు ఉంటాయి కానీ.. మానసిక ఆరోగ్యం కోసం యోగా మంచి ఎంపిక. పైగా ఇది శారీరక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

<p>మానసిక ఆరోగ్యం</p>
మానసిక ఆరోగ్యం

యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎదుకంటే ప్రస్తుతం జరిగే పరిస్థితులు వారికి ఆ రకమైన ఒత్తిడిని పెంచేస్తున్నాయి కాబట్టి. అయితే యోగా మానసిక ఆరోగ్యానికి అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరచడం, ఏకాగ్రతను పదును పెట్టడం, ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం పొందడం, నిరాశ, నిద్రలేమి లక్షణాలను మెరుగుపరచడం వంటి ప్రయోజనాలను అందిస్తుంది. అయితే మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడే ఉత్తమమైన యోగాసనాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తనాసనం

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉత్తనాసనం బాగా ఉపయోగపడుతుంది. ఈ భంగిమ.. మొత్తం వెనుక కండరాలపై పనిచేస్తుంది. బలం, వశ్యతను మెరుగుపరుస్తుంది. ఈ భంగిమలో తల గుండెకు దిగువన ఉంటుంది. ఉత్తనాసనం మెదడుకు ఆక్సిజన్ అధికంగా ఉండే రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఉత్తనాసనం రోజూ చేయడం వల్ల ఆందోళన, ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఎలా చేయాలంటే..

నిటారుగా నిల్చొని.. తుంటిపై చేతులు ఉంచండి. ఇప్పుడు గాలి పీల్చుకుని.. శ్వాసను వదులుతున్నప్పుడు మీ చేతులను మీ పైకి చాచి, మొండెం ముందుకు వంచండి. వంగుతూ ఉండండి. మీ చేతులను మీ పాదాల పక్కన నేలపై ఉంచండి. ఇది కష్టంగా ఉంటే, చీలమండలను పట్టుకోండి. 10-15 సెకన్ల పాటు భంగిమను పట్టుకోండి. ఉత్తనాసనం చేస్తున్నప్పుడు మీ మోకాళ్లు నిటారుగా ఉండేలా చూసుకోండి.

విపరీత కరణి

ఇది సరళమైన కానీ ప్రభావవంతమైన ఆందోళనను తగ్గించే యోగాసన. ఇది మనస్సును విశ్రాంతి, ప్రశాంతతతో ఉంచడంలో సహాయపడుతుంది. నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. విపరిత కరణి రక్త ప్రవాహాన్ని కూడా నియంత్రిస్తుంది. నిరాశ, నిద్రలేమికి చికిత్స చేస్తుంది.

ఎలా చేయాలంటే..

వీలైనంత వరకు గోడకు దగ్గరగా మీ బట్‌తో మీ వెనుకభాగంలో పడుకోండి. మీరు మీ వెనుకకు మద్దతుగా కుషన్‌ను ఉపయోగించవచ్చు. నెమ్మదిగా, లోతుగా శ్వాసను పీల్చుకోండి. మీ పాదాలను గోడపైకి ఎత్తండి. గోడకు వ్యతిరేకంగా వాటిని నేరుగా ఉంచండి. మీ శరీరం వైపు కాలి వేళ్లను వంచి.. మీ స్నాయువులపై ఒత్తిడిని అనుభవించండి. మీ శరీరానికి ఇరువైపులా చేతులు చాచి ఉంచండి. మీరు నెమ్మదిగా, లోతుగా శ్వాస పీల్చుకోవడంపై దృష్టి సారించి కనీసం ఐదు నిమిషాలు ఈ స్థితిలో ఉండండి.

శవాసనం

ఈ భంగిమ యోగా దినచర్యల ముగింపులో చేస్తాము. ధ్యానం, మానసిక ఆరోగ్యాన్ని పెంచడం, శరీరానికి విశ్రాంతి ఇవ్వడానికి ఇది అద్భుతమైనది.

ఎలా చేయాలంటే..

శరీరాన్ని నిటారుగా ఉంచి.. అరచేతులు పైకి ఉండేలా చేతులను ప్రక్కలా ఉంచుతూ మీ వీపుపై చదునుగా పడుకోండి. కళ్ళు మూసుకుని, కనీసం ఐదు నిమిషాల పాటు అలానే ఉండండి. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీ శ్వాసలను ఎలా తీసుకుంటున్నారో గమనించండి.

Whats_app_banner

సంబంధిత కథనం