రోజూ మోమోస్ తింటున్నారా? అయితే ఒక్క నిమిషం ఈ కథనం చదవండి..
మోమోస్ కూడా ఇతర జంక్ ఫుడ్స్‌లా వ్యసనంగా మార్చేస్తాయి. దీంతో చాలా మంది యువతీ యువకులు వాటిని క్రమం తప్పకుండా తీసుకుంటారు. మరి వాటిని రోజూ తినడం సురక్షితమేనా? నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ చూడండి.
ఇటీవలి కాలంలో జనాదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్‌లో మోమోస్ (momos) ఒకటి. కూరగాయలు లేదా చికెన్‌తో గుజ్జు తయారు చేసి కుడుములలా ఉడికిస్తారు. వివిధ రకాల చట్నీలతో వడ్డిస్తారు. ముఖ్యంగా వేడిగా, కారంగా ఉండే స్ట్రీట్ ఫుడ్ కోసం చూసే వారికి వర్షాకాలంలో నోరూరిస్తుంది. ఇతర జంక్ ఫుడ్ ఐటమ్స్‌లాగే మోమోలు కూడా వ్యసనంగా మార్చేస్తాయి.
చాలా మంది యువతీ యువకులు తమ మధ్యాహ్న భోజనంలో భాగంగా వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటారు. అయితే ఇటీవలి సంవత్సరాలలో వీటి దీర్ఘకాలిక వినియోగం వల్ల ఎదురైన ప్రతికూల ప్రభావాలు వెలుగులోకి వచ్చాయి.
అజినోమోటో/ఎంఎస్‌జీ వాడకం కావొచ్చు లేదా రీఫైన్డ్ పిండిని ఉపయోగించడం లేదా క్యాబేజీ వంటి సగం ఉడికించిన కూరగాయలను నింపడం కావొచ్చు.. ఆయా కారకాలు అనేక ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తున్నాయని అంచనా వేస్తున్నారు.
"మోమోస్ ఎక్కువగా తినడం పెద్దవారిపై వివిధ ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. మోమోస్ అధిక వినియోగం బరువు పెరగడానికి, ఊబకాయానికి దారితీస్తుంది. ఇది గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక పరిస్థితులను వృద్ధి చేసే ముప్పును పెంచుతుంది. మోమోస్‌ను తరచుగా శుద్ధి చేసిన (రిఫైన్డ్) పిండితో తయారు చేస్తారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది. మధుమేహం ఉన్నవారికి లేదా అది వృద్ధి చెందే ముప్పు ఉన్నవారికి ఇవి హానికరం’ అని నారాయణ హెల్త్ క్లినికల్ న్యూట్రిషన్ డిపార్ట్‌మెంట్ ఇన్‌ఛార్జ్ సుపర్ణ ముఖర్జీ చెప్పారు. వీటి వల్ల వచ్చే సమస్యలను వివరించారు.
1. జీర్ణ సమస్యలు
మోమోస్ మీ జీర్ణ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వాటిని రోజూ తినడం వల్ల మలబద్ధకం, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు దారి తీయవచ్చు. వీటి తయారీలో ఉపయోగించే మైదా మీ ఆరోగ్యానికి ప్రమాదకారి.
2. ఫుడ్ అలెర్జీ
ఫుడ్ అలర్జీకి గురయ్యే అవకాశం ఉన్నవారు రోజూ మోమోస్ తీసుకోవడం మానేయాలి. "కొంతమంది వ్యక్తులు మోమోస్‌లోని కొన్ని పదార్ధాలకు అలెర్జీని కలిగి ఉండవచ్చు. ఇది అలెర్జీ రియాక్షన్‌కు దారి తీస్తుంది. ఉదా. గ్లూటెన్" అని ముఖర్జీ చెప్పారు. "గ్లూటెన్ లేదా సోయా సాస్ వంటి కొన్ని పదార్ధాల వల్ల అలెర్జీ ఏర్పడుతుంది. ఈ కారణంగా చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లేదా జీర్ణశయాంతర సమస్యలు ఉత్పన్నమవుతాయి..’ అని ముంబైలోని ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీసీ హాస్పిటల్ కన్సల్టెంట్ డైటీషియన్ రోషన్ కోర్ చెప్పారు.
3. గుండె జబ్బు
"మోమోలను క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తపోటు లేదా అధిక రక్తపోటు అభివృద్ధి చెందుతుంది. మోమోస్‌లో అధిక సోడియం కంటెంట్ రక్తపోటుకు దోహదం చేస్తుంది. గుండె సంబంధ సమస్యల ముప్పును పెంచుతుంది" అని కోర్ చెప్పారు.
4. బరువు పెరుగుట
‘వేయించిన లేదా జిడ్డు గల మోమోస్ తరచుగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుట, ఊబకాయం మరియు టైప్ 2 మధుమేహం వంటి సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతుంది" అని కోర్ చెప్పారు. "మయోన్నైస్‌తో వేయించిన మోమోలు ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్నాయి. ఇందులో చాలా ఎక్కువ మొత్తంలో కొవ్వు, నూనె ఉంటుంది" అని ముఖర్జీ పేర్కొన్నారు.
5. గ్యాస్ట్రో సమస్యలు
తయారీ సమయంలో తగినంత పరిశుభ్రత పాటించకపోవడం వల్ల పిల్లలు ఆహారం ద్వారా వచ్చే వ్యాధులకు గురవుతారని, దీనివల్ల జీర్ణకోశ ఇన్‌ఫెక్షన్లు వస్తాయని కోరే చెప్పారు.
6. క్యాన్సర్
"అజినోమోటో/ఎంఎస్‌జీ, ఇతర ఆహార మిశ్రమాలు కాన్సర్ కారకంగా మారే ముప్పుంది. ఇది సాంప్రదాయ పద్ధతిలో తాజా పదార్థాలు, మిశ్రమాలు లేకుండా తయారు చేస్తే అది ఆరోగ్యకరమైన చిరుతిండిగా పరిగణించవచ్చు.." అని కోర్ చెప్పారు.
"మొత్తంమీద ఇది మైదా, అనారోగ్యకరమైన కొవ్వుల కలయిక. ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, జీర్ణ సమస్యలు ఉన్న వ్యక్తులు మోమోస్ పరిమితం చేయడం గురించి ఆలోచించాలి." అని ముఖర్జీ చెప్పారు.
టాపిక్