Millet Cooking Tips । చిరుధాన్యాలను వండే సరైన విధానం ఇదీ!
Millet Cooking Tips: మెలెట్లు చాలా బలవర్ధకమైన ఆహారం. అయితే వీటిని తినడమే కాదు, సరైన రీతిలో వండటంకూడా ముఖ్యమే. వండే విధానం ఎలా ఉండాలో ఈ కింద తెలుసుకోండి.
Millets Health Benefits: నేడు ప్రజలలో ఆరోగ్య స్పృహ మరింత పెరిగింది. మునుపటిలా కాకుండా తమ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు సరైన సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఇటీవల కాలంలో చిరుధాన్యాల వినియోగం పెరిగింది. తమ రోజువారీ భోజనంలో మిల్లెట్లను చేర్చుకుంటున్నారు.
మిల్లెట్లు గడ్డిజాతికి చెందిన చిన్న విత్తనాలు, తృణధాన్యాల పంటలు. ఇవి మన ఆహారంలో అంతర్భాగంగా ఆదిమకాలం నుంచే ఉన్నాయి. అయితే వరి అన్నం, గోధుమలు తినడం పెరగటంతో చాలా కాలం పాటు వీటిని వండుకోవడం మరిచిపోయారు. మళ్లీ ఇప్పుడు ఎక్కువ మంది ప్రజలు అన్నంకు బదులు చిరుధాన్యాల వైపు చూస్తున్నారు.ఎందుకంటే మిల్లెట్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి చాలా ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి.
మెలెట్లు చాలా బలవర్ధకమైన ఆహారం, ఇది వృద్ధులకు శక్తివంతంగా ఉండటానికి సహాయపడుతుంది, కండర ద్రవ్యరాశి మెరుగ్గా ఉండటానికి, ఎముక బలహీనపడకుండా చేస్తుంది. మిల్లెట్‌లో కరిగే, కరగని డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మిల్లెట్‌లోని కరగని ఫైబర్ మీ జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియాకు మద్దతునిస్తుంది. మలాన్ని క్రమంగా ఉంచడంలో, మలబద్దకం నివారించడంలో సహాయపడుతుంది, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతూ పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా మిల్లెట్లు గ్లూటెన్ రహితమైన ఆహారం, అందువల్ల ఇవి బరువు తగ్గడానికి అనువైనవి. డయాబెటిక్ పేషెంట్లకు ఈ చిరుధాన్యాలు గొప్ప ఆహారం. వారు తమ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా రోజూ మిల్లెట్లతో వండిన ఆహారాలు తినాలి.
చిరుధాన్యాలు వండటంలో చిట్కాలు
జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు మొదలైనవి చిరుధాన్యాలుగా వర్గీకరించవచ్చు. అయితే వీటిని తినడమే కాదు, సరైన రీతిలో వండటం (Millet Cooking Tips) కూడా ముఖ్యమే. మిల్లెట్లను వండే విధానం ఎలా ఉండాలో ఈ కింద తెలుసుకోండి.
బాగా కడకండి
మిల్లెట్‌లను వండటానికి ముందు బాగా కడగాలి. ఒక గిన్నెలో నీరు తీసుకోండి, మీకు అవసరం మేర ధాన్యం తీసుకొని నీటిలో వేసి బాగా కలపాలి. ఏవైనా మలినాలు, ధూళిని, మురికి ఉపరితలంపైకి వస్తాయి. ఇలా మిల్లెట్ శుభ్రం చేయడానికి రెండు మూడు సార్లు కడగండి.
నానబెట్టండి
చిరుధాన్యాలను కడిగిన తర్వాత తప్పకుండా కొంత సమయం పాటు నానబెట్టాలి. మిల్లెట్ రకాన్ని బట్టి నానబెట్టే సమయం ఎక్కువ ఉంటుంది. కనీసం 8- 10 గంటలు నీటిలో నానబెడితే మంచిది. మిల్లెట్‌ను నానబెట్టడం ఒక ముఖ్యమైన దశ, ఇది వంట సమయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఆవిరిలో ఉడికించడం
మిల్లెట్లను ఆవిరిలో ఉడికించాలి.సజ్జలు: ఒక కప్పు నానబెట్టిన సజ్జలను తీసుకుని, ప్రెషర్ కుక్కర్‌లో ఒకటిన్నర కప్పు నీళ్ళు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి, 15 విజిల్స్ వచ్చేవరకు ఎక్కువ వేడి మీద ఉడికించాలి.
జొన్నలు: ఒక కప్పు నానబెట్టిన జొన్నలను తీసుకుని, అందులో ఒకటిన్నర కప్పు నీరు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేయండి. ప్రెషర్ కుక్కర్ మీద 12 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
రాగులు: ఒక కప్పు నానబెట్టిన రాగులను తీసుకుని, ప్రెషర్ కుక్కర్‌లో ¼ కప్పు నీళ్లు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి, సుమారు 12 విజిల్స్ వచ్చేలా ఎక్కువ వేడి మీద ఉడికించాలి.
సంబంధిత కథనం