Beauty Tips: పార్లర్‌కు వెళ్లకుండానే ముఖానికి మెరుపు కావాలా? మూడు రోజుల పాటూ ఫేస్ ప్యాక్ వేసుకోండి-want a glowing face without going to the parlour apply face pack for three days ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beauty Tips: పార్లర్‌కు వెళ్లకుండానే ముఖానికి మెరుపు కావాలా? మూడు రోజుల పాటూ ఫేస్ ప్యాక్ వేసుకోండి

Beauty Tips: పార్లర్‌కు వెళ్లకుండానే ముఖానికి మెరుపు కావాలా? మూడు రోజుల పాటూ ఫేస్ ప్యాక్ వేసుకోండి

Haritha Chappa HT Telugu
Aug 16, 2024 09:30 AM IST

Beauty Tips: కేవలం మూడు రోజుల్లో ముఖం కాంతివంతంగా మారాలనుకుంటే ఈ ఫేస్ ప్యాక్‌ను అప్లై చేయండి. పార్లర్‌కు వెళ్లకుండానే మీ ముఖాన్ని ఎలా మెరిపించుకోవాలా ఇక్కడ ఇచ్చాము. ఈ బ్యూటీ టిప్స్ ఫాలో అవ్వండి.

ముఖానికి మెరుపునిచ్చే ఫేస్ ప్యాక్
ముఖానికి మెరుపునిచ్చే ఫేస్ ప్యాక్ (shutterstock)

ఇంట్లో వేడుకలు, పండుగలు దగ్గరలో ఉన్నప్పుడు అతి తక్కువ రోజుల్లోనే ముఖాన్ని మెరిపించవచ్చు. బ్యూటీ పార్లర్ కు వెళితే అయ్యే ఖర్చు తక్కువేమీ కాదు. ఏ ఫేషియల్ చేయించుకున్నా అయిదు వందలైనా కనీసం చెల్లించాలి. అదే పెద్ద బ్యూటీ పార్లర్ అయితే వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే అతి తక్కువ ఖర్చులో ముఖాన్ని మెరిపించవచ్చు. కేవలం మూడు రోజుల పాటూ వరుసగా ఒక స్పెషల్ ఫేస్ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేస్తే చాలు. మీరు అందంగా మారిపోతారు. అలాగే మొటిమలు, మచ్చలు వంటివి కూడా పోయే అవకాశం ఉంది. ఒకేసారి పోకపోయినా… ఈ ఫేస్ ప్యాక్ తరచూ వేసుకుంటే ఆ మచ్చలు కూడా పూర్తిగా పోతాయి.

బియ్యం నీటితో ఫేస్ ప్యాక్

సోషల్ మీడియాలో కొరియన్ స్కిన్ ఫేస్ మాస్క్‌లు చాలా వైరల్‌గా మారాయి. వారు తమ జుట్టు, చర్మం కోసం బియ్యం నీటిని ఉపయోగిస్తారు. బియ్యం పిండితో చేసిన స్క్రబ్‌‌ను ముఖానికి పట్టించడం వల్ల కూడా చర్మం శుభ్రపడుతుంది. ఇది చర్మానికి సహజంగా మాయిశ్చరైజర్‌లా మారుతుంది. బియ్యం నీటిలో, బియ్యం పిండిని కలిపి ఫేస్ ప్యాక్‌లా వేసుకోవాలి. ఇది ముఖాన్ని మెరిసేలా చేస్తుంది.

బియ్యం పిండితో స్క్రబ్ చేయడం వల్ల చర్మానికి సహజ తేమ అందుతుంది. దీనివల్ల చర్మం మెరుస్తూ ఉంటుంది. ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ఈ వస్తువులను ఉపయోగించండి.

ఫేస్ ప్యాక్ తయారీ

ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకుంటే ఇది మీ చర్మానికి ఎంతో మెరుపును అందిస్తుంది. రెండు స్పూన్ల బియ్యం పిండి, చిటికెడు పసుపు, కలబంద జెల్, రెండు స్పూన్ల టమోటా రసం వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావుగంట సేపు వదిలేయాలి. తరువాత ముఖాన్ని తేలికగా మసాజ్ చేయాలి. ఆ తరువాత నీటితో శుభ్రపరచుకోవాలి. తర్వాత మంచి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ను రోజూ ఫేస్ వాష్ కు బదులుగా నాలుగైదు రోజుల పాటు అప్లై చేస్తే ముఖంలో తేడా మీకే కనిపిస్తుంది.

మరొక ఫేస్‌ప్యాక్

రెండు స్పూన్ల బియ్యం పిండి, రెండు స్పూన్ల రోజ్ వాటర్, ఒక స్పూన్ తేనె కలిపి మిశ్రమంలా చేయాలి. ఆ పేస్టును ముఖానికి పట్టించి అరగంట పాటూ వదిలేయాలి. తరువాత ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ మీ ముఖాన్ని త్వరగా మెరిపిస్తుంది. ఇదే ఫేస్‌ప్యాక్‌ను మెడకు పట్టించి కాసేపు అయ్యాక శుభ్రపరచుకోవాలి. మీ మెడపై ఉన్న నలుపు కూడా పోతుంది.

కీరాదోస పేస్టులో బియ్యం పిండి, కలబంద జెల్ వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఆ పేస్టును ముఖానికి పట్టించి పావు గంట సేపు వదిలేయాలి. తరువాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. అంటే మీ ముఖానికి సహజమైన మెరుపు వస్తుంది.

Whats_app_banner