Orange Peel scrub: ఇంట్లోనే నారింజ తొక్కలతో ఇలా స్క్రబ్ రెడీ చేసుకోండి, ముఖం చేతులు మెరిసిపోతుంది
Orange Peel scrub: అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. వేలు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ కు వెళ్లడం అందరివల్లా కాదు. బ్యూటీ పార్లర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే అందంగా మెరిసిపోవచ్చు. ఒకసారి నారింజ తొక్కలతో ఈ స్క్రబ్ ను తయారుచేసి వాడండి.
Orange Peel scrub: అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కాలుష్యం వల్ల ముఖానికి, చేతులకు, కాళ్లకు టాన్ పట్టి నల్లగా మారుతాయి. ఇందుకోసం బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే సహజంగా స్క్రబ్ ను తయారు చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఈ స్క్రబ్ తో పాదాలను, చేతులను, ముఖాన్ని మసాజ్ చేసుకుంటే పట్టిన టాన్ పోవడంతో పాటు మెరుపు సంతరించుకుంటుంది. ఇంట్లోనే దీన్ని నారింజ తొక్కలతో తయారుచేసి స్టోర్ చేసుకుంటే మంచిది. దీన్ని ఆరెంజ్ పీల్ స్క్రబ్ అంటారు.
నారింజ తొక్కలు...
నారింజ తొక్కలతో ఇలా స్క్రబ్బింగ్ చేయడం వల్ల ముఖంపై పట్టిన మురికి పోతుంది. డీ హైడ్రేషన్ సమస్య తగ్గుతుంది. చర్మం తేమవంతంగా మారుతుంది. చర్మం మృదువుగా, సున్నితంగా ఉంటుంది. దీని వల్ల మీరు మరింత అందంగా కనిపిస్తారు. నారింజ తొక్కతో స్క్రబ్ చేయడం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
నారింజ తొక్కలో సహజ ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని చాలా సున్నితంగా మురికి లేకుండా తొలగిస్తాయి. మృత కణాలను, మలినాలను తొలగిస్తాయి. చర్మం కింద భాగం దెబ్బ తినకుండా కాపాడతాయి.
వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. చర్మాన్ని దెబ్బతీసే వైరస్, బ్యాక్టీరియాల నుంచి ఇవి కాపాడతాయి. యాంటీ ఏజింగ్ లక్షణాలు నారెంజ్ తొక్కలో ఎక్కువ. కాబట్టి ఆరంజ్ పీల్ స్క్రబ్ కాపాడుతుంది.
నారింజ తొక్కలో సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. కాబట్టి నారింజ తొక్కతో చర్మాన్ని శుభ్రపరచడం వల్ల ముఖంపై ఉన్న డార్క్ స్పాట్స్, మచ్చలు పోతాయి. చర్మం కాంతివంతంగా ఉంటుంది. అలాగే చర్మాన్ని హైడ్రేట్ చేసేంత శక్తి నారింజ తొక్కలో ఉంది. ఇది చర్మాన్ని పొడిబారక్కుండా కాపాడుతుంది. నారింజ తొక్కలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని పాదాలను వాపుకు అసౌకర్యానికి గురికాకుండా కాపాడతాయి.
నారింజ స్క్రబ్ తయారీ
ఆరెంజ్ స్క్రబ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. నారింజ తొక్కలను మురికి లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. వీటిని గాలికి ఆరబెట్టాలి. ఇవి బాగా ఆరడానికి కొన్ని రోజులు పడుతుంది. అవి బాగా ఎండాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడిన ఒక కంటైనర్లో వేసి భద్రపరుచుకోవాలి.
స్క్రబ్ చేయడానికి ముందు ఒక గిన్నెలో నారింజ తొక్క పొడిని కాస్త చక్కెరను, ఉప్పును వేసి బాగా కలపాలి. అందులో కాస్త ఆలీవ్ నూనె లేదా కొబ్బరి నూనె వేసినా మంచిదే. ఈ మొత్తం మిశ్రమాన్ని ముఖానికి లేదా చేతులకు పాదాలకు పట్టించి ఐదు నుంచి పది నిమిషాలు వృత్తాకార పద్ధతిలో మసాజ్ చేస్తూ ఉంటే మంచిది. తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి అంతే. ముఖం క్లీన్ అయిపోతుంది.
టాపిక్