Optical illusion: ఇక్కడున్న నారింజలలో భిన్నంగా ఉన్న నారింజను అయిదు సెకండ్లలో కనిపెడితే మీరు తోపే-optical illusion if you find the orange that is different among the oranges here you will win in five seconds ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Optical Illusion: ఇక్కడున్న నారింజలలో భిన్నంగా ఉన్న నారింజను అయిదు సెకండ్లలో కనిపెడితే మీరు తోపే

Optical illusion: ఇక్కడున్న నారింజలలో భిన్నంగా ఉన్న నారింజను అయిదు సెకండ్లలో కనిపెడితే మీరు తోపే

Haritha Chappa HT Telugu
Jan 02, 2024 10:30 AM IST

Optical illusion: పదునైన చూపు కలిగిన వారు, తెలివైన వారు మాత్రమే సాల్వ్ చేయగల పజిల్ ఇది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌ను మీరూ ఒకసారి ట్రై చేయండి.

ఆప్టికల్ ఇల్యూషన్
ఆప్టికల్ ఇల్యూషన్ (Instagram)

Optical illusion: ఆప్టికల్ ఇల్యూషన్లు తరచూ మన మెదడు శక్తికి, కంటి చూపుకి సవాలు విసురుతాయి. ఆ రెండూ సమన్వయంగా పనిచేస్తేనే ఆప్టికల్ ఇల్యూషన్లను త్వరగా సాల్వ్ చేయగలరు. అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ ఇక్కడ ఒకటి ఇచ్చాము. ఇందులో వరుసగా నారింజలు ఉన్నాయి. అన్ని నారింజలు ఒకేలా ఉన్నాయి... కానీ ఒకటి మాత్రం కాస్త భిన్నంగా ఉంది. ఆ భిన్నమైన నారింజను మీరు కనిపెట్టాలి. ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా కనిపెట్టేయగలరు. మీ దృష్టి పదునుగా ఉంటే, మీ మెదడు చురుగ్గా పనిచేస్తే... మీరు కేవలం దాన్ని కేవలం 5 సెకండ్లలోనే కనిపెట్టేయగలరు. మీకు తీవ్రమైన పరిశీలనా శక్తి ఉందో లేదో... ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ద్వారా చెక్ చేసుకోండి.

ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు

అయిదు సెకండ్లోనే జవాబు కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. జవాబు కనిపెట్టే పనిలో ఇంకా ఉన్నవారికి ఇంతకన్నా ఎక్కువ సమయం ఇవ్వలేము... కాబట్టి జవాబు మేమే చెప్పేస్తాం. ఇచ్చిన చిత్రంలో నాలుగవ లైన్లో ఉన్న చివరి నారింజను చూడండి. అన్ని నారింజల కన్నా అది కాస్త భిన్నంగా ఉంటుంది. మిగతా నారింజలతో పోలిస్తే దీని భిన్నత్వం చాలా తక్కువే కావచ్చు.. కానీ మీ పరిశీలన శక్తి పదునుగా ఉంటే దాన్ని కూడా మీరు కనిపెట్టేస్తారు. అన్ని నారింజలు కాస్త పక్కకి వంగినట్టు ఉంటే... ఈ నారింజ మాత్రం నిలువుగా ఉంది. అదే తేడా.

ఆప్టికల్ ఇల్యూషన్లు ఎప్పటినుంచో ప్రపంచంలో ఎంతోమందికి వినోదాన్ని పంచుతున్నాయి. వేల ఏళ్ళ క్రితమే గ్రీకు దేశంలో పుట్టిన ఇవి అక్కడ నుంచి అన్ని దేశాలకు ప్రయాణించాయి. ఎప్పుడైతే సామాజిక మాధ్యమాలు తమ ఉనికిని చాటాయో అప్పటినుంచి ఇవి వైరల్ గా మారుతున్నాయి. దీంతో ప్రత్యేకంగా ఆర్టికల్ ఇల్యూషన్లను చిత్రీకరించే చిత్రకారులు పుట్టుకొచ్చారు. ఎంతోమందికి ఇవి ఉపాధిని కల్పిస్తున్నాయి. మెదడుకు, చూపుకు ఈ ఆప్టికల్ ఇంజక్షన్లు ఎంతో మేలు చేస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటు కళ్ళు, మెదడు మధ్య కలిసి పనిచేసే సమన్వయాన్ని పెంచుతాయి. కాబట్టి పిల్లలకు ఆప్టికల్ ఇల్యుషన్లు అప్పుడప్పుడు చూపించడం మంచిది.

Whats_app_banner