Lunch Box tips in Winter : చలికాలంలో మీ పిల్లలకు లంచ్ బాక్స్​లో ఇవి పెట్టండి.. ఎందుకంటే..-try these tasty and healthy lunch recipes for kids in winter to gain immunity ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lunch Box Tips In Winter : చలికాలంలో మీ పిల్లలకు లంచ్ బాక్స్​లో ఇవి పెట్టండి.. ఎందుకంటే..

Lunch Box tips in Winter : చలికాలంలో మీ పిల్లలకు లంచ్ బాక్స్​లో ఇవి పెట్టండి.. ఎందుకంటే..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 08, 2022 11:53 AM IST

Lunch Box tips in Winter : చలికాలంలో పిల్లలు త్వరగా ఫ్లూ, దగ్గు వంటి లక్షణాల బారిన పడతారు. ఈ వైరల్ సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే.. వారికి రుచికరమైన, ఆరోగ్యకరమైన శీతాకాలపు భోజనాలను వారికి అందించాలి. స్కూల్​కు వెళ్లే పిల్లలకు టేస్టీ, హెల్తీ లంచ్ బాక్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

లంచ్ ప్లాన్స్ ఫర్ కిడ్స్
లంచ్ ప్లాన్స్ ఫర్ కిడ్స్

Lunch Box tips in Winter : రుచికరమైన, ఆరోగ్యకరమైన లంచ్.. పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చలికాలంలో పిల్లలకు ఇమ్యూనిటీ చాలా అవసరం. ఎందుకంటే ఈ సమయంలోనే జలుబు, ఫ్లూ, జ్వరం, దగ్గు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు పిల్లలపై త్వరగా ఎటాక్ చేస్తాయి. పైగా ఈ వాతావరణంలో పిల్లల ఉష్ణోగ్రత పడిపోవడంతో పాటు.. వారి ఆకలి పెరుగుతుంది. కాబట్టి వారు తరచుగా ఆకలితో ఉంటారు.

ఈ సమయంలో వారి ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చుకోవడం వల్ల ఈ సీజన్‌లో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. దానివల్ల అనారోగ్యకరమైన ఫుడ్ క్రేవింగ్స్​ కూడా తగ్గుతాయి. మరి వాటిని ఎలా తయారు చేయాలో.. లంచ్ ఏవిధంగా హెల్తీగా ఉండేలా చూసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్టఫ్డ్ బచ్చలికూర పరాటా

గోధుమ పిండిలో బచ్చలికూర నూనె, ఉప్పు, నీరు కలిపి చపాతీలు వత్తండి. స్టఫ్ కోసం.. తురిమిన పనీర్, క్యారెట్, అల్లం-పచ్చిమిర్చి పేస్ట్, తరిగిన కొత్తిమీర, ఉప్పు వేసి కలపండి. గోధుమ పిండిలో దానిని ఉంచి.. మళ్లీ రోల్ చేసి.. మళ్లీ వృత్తాకారంలో వత్తండి. అనంతరం నూనె వేసి.. బంగారు గోధుమ రంగు వచ్చేవరకు ఉడికించండి.

బేబీ కార్న్, క్యాప్సికమ్ రైస్

నూనె వేసిన పాన్‌లో ఉల్లిపాయ, వెల్లుల్లి వేసి.. వేయించండి. తరిగిన బేబీ కార్న్, పసుపు, ఆకుపచ్చ, ఎరుపు క్యాప్సికమ్ వేసి.. మూడు-నాలుగు నిమిషాలు వేయించాలి. టొమాటో కెచప్, టొమాటో ప్యూరీ, కాస్త పంచదార వేసి బాగా కలుపుతూ ఉడికించాలి. దానిలో బాస్మతి బియ్యం, ఉప్పు, మిరియాలు వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలు ఉడికించాలి.

వెజిటబుల్ వెర్మిసెల్లీ పులావ్

వెర్మిసెల్లిని బాణలిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. బే ఆకులు, దాల్చినచెక్క, యాలకులు, లవంగాలను నూనెలో వేయించాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. బీన్స్, బఠానీలు, క్యారెట్, మొక్కజొన్న, ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా ఉడికించాలి. అనంతరం నీరు వేసి మరిగించాలి. దానిలో సేమ్య వేసి.. ఉడికించాలి. చివరిగి కొబ్బరి పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి.

మిక్స్డ్ వెజిటబుల్ ఓట్స్ దోశ

రోల్డ్ ఓట్స్, బియ్యం పిండి, గోధుమ పిండి, తురిమిన క్యారెట్, తురిమిన ఉల్లిపాయ, తురిమిన అల్లం, జీలకర్ర, మిరియాల పొడి, పచ్చి మిరపకాయలు, ఉప్పువేసి బాగా కలపండి. దానిలో కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా కలపండి. మిశ్రమాన్ని 15-20 నిమిషాలు పక్కన పెట్టండి. ఈ పిండితో పెనం మీద సన్నని దోశలా వేసుకుని.. బాగా ఉడికించాలి. వీటిని కొబ్బరి చట్నీతో వేడిగా సర్వ్ చేసుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం