Morning Habits for Weight Loss । ఆరోగ్యకరమైన బరువు కోసం.. ఉదయం ఇలాంటి అలవాట్లు ఉండాలి!
Morning Habits for Weight Loss: ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ ఉదయం నుంచే సరైన ప్లాన్ అమలు పరచాలి. మీరు ఉదయం వేళ అలవర్చుకోవాల్సిన కొన్ని అలవాట్లను ఇక్కడ తెలుసుకోండి.
బరువు తగ్గటానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే కొన్నిసార్లు బరువు తగ్గినా మళ్లీ వెంటనే పెరుగుతారు. అలాగే వేగంగా బరువు పెరగటం, తగ్గడం కూడా ఆరోగ్యకరమైనది కాకపోవచ్చు. అందువల్ల స్థిరమైన పద్ధతిలో బరువు కోల్పోవడం ముఖ్యం. ప్రతిరోజూ ఉదయం లేచిన దగ్గర్నించి ఒక ప్రణాళిక ప్రకారం దినచర్య అనేది ముందుకు సాగాలి. అప్పుడే బరువు తగ్గడంతో పాటుగా, కండరాల నిర్మాణం జరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు.
అదేవిధంగా ఆహారం, వ్యాయామంతో పాటు కొన్ని అలవాట్లను పాటించడం వల్ల ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గవచ్చు. మీరు ఉదయం లేచిన దగ్గర్నించి చేసే ఆచరించే కార్యకలాపాలు, పనిచేసే విధానం, వ్యాయామం, తినే అల్పాహారం ఇవన్నీ బరువు తగ్గడంలో మీకు సహాయపడతాయి. మీరు బరువు తగ్గడానికి సహాయపడే కొన్ని ఉదయం అలవాట్లు ఇక్కడ ఉన్నాయి.
ఒక గ్లాసు గోరువెచ్చని నీరు
ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగాలి, ఇలా చేయడం వల్ల మీ జీవక్రియ ఉత్తేజితమవుతుంది అలాగే జీర్ణవ్యవస్థను శుభ్రపరచడానికి కూడా ఇది సహాయపడుతుంది. అలాగే శరీరంలోని మలినాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.
ప్రోటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనంగా పరిగణిస్తారు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు అల్పాహారం కచ్చితంగా చేయాలి. అయితే ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల చాలాసేపు కడుపు నిండుగా ఉంటుంది. ఇది మీ ఆహార కోరికలను నియంత్రిస్తుంది.
సూర్యరశ్మిని పొందడం
సూర్యరశ్మి శరీరానికి అవసరమైన విటమిన్లను అందిస్తుంది. కాబట్టి ఉదయం లేచిన తర్వాత శరీరానికి తగినంత సూర్యరశ్మి అందేలా 10-15 నిమిషాల పాటు ఎండలో ఉండటం అవసరం. అయితే, సూర్యరశ్మితో చర్మం టాన్ అవ్వకుండా రక్షించడానికి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలని గుర్తుంచుకోండి.
ఉదయపు వ్యాయామం
మీరు ఉదయం పూట కొన్ని రకాల శారీరక శ్రమలు చేయడం చాలా ముఖ్యం, ఇది కొన్ని కేలరీలను బర్న్ చేయడంలో మీకు సహాయపడుతుంది అలాగే మీరు శక్తిని పొందేలా చేస్తుంది.
సంబంధిత కథనం