fashion in tv serials: గుప్పెడంత మనసులో జగతి చీరలు.. మల్లిక రఫుల్స్ బ్లవుజు..-trending fashion tips from telugu daily serials guppedantha manasu ennenno janmala bandham krishna mukunda murari ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fashion In Tv Serials: గుప్పెడంత మనసులో జగతి చీరలు.. మల్లిక రఫుల్స్ బ్లవుజు..

fashion in tv serials: గుప్పెడంత మనసులో జగతి చీరలు.. మల్లిక రఫుల్స్ బ్లవుజు..

Koutik Pranaya Sree HT Telugu
Apr 24, 2023 11:47 AM IST

fashion in tv serials: మీకు ఇష్టమైన సీరియల్స్ లో నటీనటులు వేసుకునే చీరలు, డ్రెస్సులు ట్రెండ్ కి తగ్గట్లు ఫాలో అయిపోతున్నారా? అయితే వాళ్ల ఫ్యాషన్ గురించి చిట్కాలు చదివేయండి. మీకూ ఉపయోగపడతాయి.

రఫుల్స్ బ్లవుజు
రఫుల్స్ బ్లవుజు

ఈ మధ్య కొన్ని సీరియళ్లలో నటించే నటులకు ఎనలేని ఆదరణ దొరుకుతోంది. సీరియల్ నటీనటుల ఫ్యాషన్ ని చాలా మంది ఫాలో అవుతారు. వాళ్లు వేసుకునే కాస్టూమ్స్ కూడా చాలా ఫేమస్ అయిపోతున్నాయి. వాటిలో ఈ మధ్య బాగా ట్రెండింగ్ లోకి వచ్చిన ఫ్యాషన్ గురించి చూద్దాం.

జానకి కలగనలేదులో మల్లిక:

ఆమె చేసే క్యారెక్టర్‌, పుల్లల మల్లిక, పెట్రోల్ మల్లిక వంటి డైలాగులతో పాటే తను వేసుకునే రఫుల్ బ్లవుజులు కూడా చాలా ఫేమస్. ప్లెయిన్ చీరలకు ఫ్లోరల్ అంచులతో రఫుల్స్ చేసిన చీరలు, బ్లవుజులు మల్లిక బ్రాండ్ గా నిలిచిపోతాయి. అవి ఇప్పుడు ఫ్యాషన్ కూడా. డ్రెస్సులకు, బ్లవుజులకు ఈ డిజైన్లో మీరూ ఒకటి కుట్టించుకుని చూడండి. ఆర్గాంజా, శాటిన్ వస్త్రాలకు ఈ రఫుల్ బ్లవుజ్ స్లీవ్స్ డిజైన్ చక్కగా నప్పుతుంది. మీకు నచ్చితే చీర మొత్తానికీ రఫుల్స్ పెట్టించుకున్నా ట్రెండీగా కనిపిస్తారు.

కృష్ణ ముకుంద మురారి లో కృష్ణ:

కృష్ణ చేష్టలకూ, చీరలకూ ఫ్యాన్స్ ఎక్కువే. తను వేసుకునే హాఫ్ పఫ్ స్లీవ్స్ ఎంత ఫేమస్ అంటే ఆ బ్లవుజు డిజైన్ ని క్రిష్ణ బ్లవుజు డిజైన్ అనేస్తున్నారు. యూట్యూబ్ లో ఎంత మంది ఆ బ్లవుజు కుట్టడం గురించి ప్రత్యేకంగా చెబుతున్నారో లెక్కేలేదు. ఆ డిజైన్ మీరూ ప్రయత్నించొచ్చు. నెట్ లేదా ఆర్గాంజా చీరలకు సరిగ్గా సరిపోతుంది. . పైన మోచేతి దాకా ఉండే స్లీవ్‌లో సగం కన్నా ఎక్కువ పఫ్ లాగా వచ్చి కింద పట్టినట్లు ఉంటుందీ డిజైన్. దాదాపు ఆ మధ్య ఫేమస్ అయిన దేవసేన బ్లవుజు డిజైన్ ని కాస్త మార్చి కుట్టినట్టు ఉంటుందిది.

గుప్పెడంత మనసులో జగతి:

ప్రొఫెషనల్‌గా, హుందాగా కనిపించే జగతికి చీరకట్టు కొసమెరుపు. తను వేసుకునే షోల్డర్ నెక్ బ్లవుజులు, కాటన్ చీరలు హుందాగా కనిపించేలా చేస్తాయి. కాస్త మధ్య వయస్కులు, ఉద్యోగాలకు వెళ్లేవాళ్లు కూడా ఈ చీరకట్టును ఫాలో అయిపోవచ్చు. కాటన్ లేదా సింపుల్‌గా ఉండే చీరలకు హైనెక్, జీరో నెక్ లేదా కాలర్ నెక్ జత చేసి వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. మీకు కాస్త మార్పు కావాలనుకుంటే ప్లెయిన్ చీరలకు కలంకారీ, బనారస్ బ్లవుజులను జత చేసి వేసుకోవచ్చు.

ఫార్మల్స్:

రిషి వసుధార బంధానికి ప్రేక్షకులు ఎలా ఫ్యాన్ అయిపోయారో రిషి హావభావాలకు, డ్రెస్సింగ్ స్టైల్ ని కూడా అంతే ఇష్టపడుతున్నారు. అలాగే ఎన్నెన్నో జన్మల బంధం లో యష్ వేసుకునే ఫార్మల్స్ కూడా చాలా బాగుంటాయి. రిషి వేసుకునే ఫార్టల్ షర్ట్స్ ప్రత్యేక సందర్భాల్లో మంచి లుక్ తెచ్చిపెడతాయి. మీరు కూడా ఫార్మల్స్ కొనేటప్పుడు వీలైనంత వరకు ముదురు రంగుల జోలికి పోకుండా పేస్టల్ రంగులు, లేత రంగుల్లో చొక్కా ఎంచుకొని దానికి జతగా నలుపు, ముదురు గోదుమ వంటి రంగుల్లో ప్యాంట్లు ఎంచుకోవచ్చు. సందర్భాన్ని బట్టి వాటి మీద ముదురురంగులో ఉండే వెయిస్ట్ కోట్ లేదా బ్లేజర్‌తో జత చేయొచ్చు. షూ, బెల్ట్.. నలుపైనా, గోదుమ రంగైనా.. రెండూ ఎప్పుడూ ఒకే రంగువి ఎంచుకోవాలి. బెల్ట్ గోదుమ రంగులో, షూ నలుపు రంగులో ఉంటే అంత మంచి లుక్ రాదని గుర్తుంచుకోండి.

Whats_app_banner