Guppedantha Manasu April 24th Episode: నిజం కానున్న రిషి కల - ఎంఎస్ఆర్‌కు జగతి, వసు షాక్
Guppedantha Manasu April 24th Episode: సౌజన్యరావు కుట్ర కారణంగా ఓటమి పాలైన రిషిని జగతి, వసుధార కలిసి సేవ్ చేస్తారు. రిషి మెడికల్ కాలేజీ కలను నిజం చేస్తారు. నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే...
Guppedantha Manasu April 24th Episode: పది రోజుల్లోనే మెడికల్ కాలేజీ పర్మిషన్ తెచ్చుకుంటానని సౌజన్యరావు తో రిషి ఛాలెంజ్ చేస్తాడు. ఒకవేళ పర్మిషన్ రాని పక్షంలో అతడి కాలేజీలో తన కాలేజీని కలుపుతానని అంటాడు. అతడి ఛాలెంజ్ విని మహేంద్ర, జగతి, వసుధార కంగారు పడతారు. అయితే వారి భయాన్ని గ్రహించిన రిషి...పది రోజుల్లో పర్మిషన్స్ రావడం కష్టం కానీ ఆసాధ్యం కాదని అంటాడు. కాలేజీ ప్రస్టేజ్‌ను క్వశ్చన్ చేయడంతోనే ఎంఎస్ఆర్‌తో ఛాలెంజ్ చేయాల్సివచ్చిందని వారితో చెబుతాడు. ఎంఎస్ఆర్ కన్నింగ్ ఫెల్లో అని, కలిసిన ప్రతిసారి మాట మార్చుతూనే ఉన్నాడని వసుధార భయపడుతుంది.
వసుకు మాటిచ్చిన రిషి...
రిషి నువ్వు చాలా ప్రాక్టికల్ కానీ అవతలి వ్యక్తి పెద్ద ప్లానర్...అతడు ఏ ఎత్తుగడల మీద ఛాలెంజ్ చేశాడో తెలియదు ఒక్కసారి ఆలోచించు అని రిషితో మహేంద్ర అంటాడు. కానీ రిషి ఎవరి మాటల వినడు. పది రోజుల్లోనే పర్మిషన్ తీసుకొచ్చి తానంటే సౌజన్యరావుకు చూపిస్తాను అంటూ డిస్కషన్‌ను ఎండ్ చేస్తాడు.
వసుధార డల్‌గా కనిపిస్తుంది. ఆమె భయాన్ని గ్రహించిన రిషి ఏమైందని అడుగుతాడు. ఒకవేళ అనుకున్నది జరగకపోతే అంటూ వసు ఏదో చెబుతుండగానే ఆమె నోటికి తన చేయి అడ్డుపెడతాడు రిషి. తనకు ఎంత భాదనైనా భరించే శక్తి ఉందని అంటాడు. ఈ ఛాలెంజ్‌లో గెలుస్తామనే నమ్మకముందని వసుతో చెబుతాడు
ఛాలెంజ్ లో రిషి ఓటమి...
కానీ రిషి అనుకున్నది జరగదు. పది రోజుల్లో కాలేజీకి పర్మిషన్ రాదు. అన్ని అర్హతలు ఉన్నామెడికల్ కాలేజీకి పర్మిషన్ రాకపోవడం అర్థం కావడం లేదని బాధపడుతుంటాడు. సౌజన్యరావు పక్కాగా ప్లాన్ చేసి మన కాలేజీకి పర్మిషన్ రాకుండా చేశాడని వసుధార అతడితో అంటుంది.
ఎంఎస్ఆర్ నిన్ను కలవడానికి ఇంటికి వస్తున్నాడని రిషితో మహేంద్ర చెబుతాడు. అనుకున్నట్లుగానే పూల దండతో ఎంఎస్ఆర్...రిషి ఇంట్లో అడుగుపెడతాడు. దండను రిషి మెడలో వేస్తాడు. ఆ దండను రిషి విసిరికొడతాడు. అయినా ఏ మాత్రం అవమానంగా ఫీలవ్వని ఎంఎస్ఆర్ నవ్వుతూ కనిపిస్తాడు.
ఎంఎస్ఆర్ ప్రతాపం...
ఎందుకొచ్చారని ఎంఎస్ఆర్‌ను అడుగుతాడు రిషి. మన డీల్ ప్రకారం ఇక మీదట మీ డీబీఎస్‌టీ కాలేజీ మా ఎంఎస్ఆర్ కాలేజీలో కలవబోతుందని ఎంఎస్ఆర్ అంటాడు. అది ఎప్పటికీ జరగదు అని రిషి ఆవేశంగా చెబుతాడు. కాలేజీ బోర్డ్ ముట్టుకునే దమ్ము ఉందా అని ఎంఎస్ఆర్‌కు సవాల్ విసురుతాడు.
దమ్ము ఎందుకు ఒప్పందం ఉంది కదా అని రిషి మాటలకు ఎంఎస్ఆర్ కూల్‌గా సమాధానమిస్తాడు. అరిచినంత మాత్రానా ఒప్పందం మరుగున పడదని అంటాడు. తన మాటలతో రిషిని అవమానిస్తుంటాడు. అతడి మాటలకు ఆవేశానికి లోనైన రిషి గెటౌట్ అని వార్నింగ్ ఇస్తాడు. రిషి మాటలను తేలిగ్గా తీసుకుంటూ తమ కాలేజీలో డీబీఎస్‌టీ కాలేజీని కలుపుతున్నట్లుగా ప్రెస్‌మీట్ పెట్టాల్సిందే అని పట్టుపడతాడు.
ఎంఎస్ఆర్ కుట్రను బయటపెట్టిన జగతి, వసు...
ఇంతలోనే అక్కడికి జగతి, వసుధార వస్తారు. డీబీఎస్‌టీ కాలేజీకి పర్మిషన్ రాకుండా ఎంఎస్ఆర్ లంచం ఇచ్చి మ్యానేజ్ చేసిన వీడియోను బయటపెడతారు. ఆ వీడియో చూసి ఎంఎస్ఆర్ షాక్ అవుతాడు. ఇంతలోనే ఎంఎస్ఆర్ మెడికల్ కాలేజీ పర్మిషన్ క్యాన్సిల్ అయినట్లుగా అతడికి ఫోన్ కాల్ వస్తుంది. షాక్ మీద షాక్ తగలడంతో ఎంఎస్ఆర్ అవమానంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ సంఘటన కారణంగా డిస్ట్రబ్ అయిన రిషి ఒంటరిగా వెళ్లి రూమ్‌లో కూర్చొని ఉంటాడు.
రిషి కల నిజం...
దాంతో అతడి కోపాన్ని తగ్గించే బాధ్యతను జగతి, మహేంద్ర కలిసి వసుధారకు అప్పగిస్తారు. భయపడుతూనే ఆ రూమ్‌లో అడుగుపెట్టిన వసుధార.. తాను ఓడిపోయానని, ఓటమిని తానే ఆహ్వానించానని వసుధారతోచెబుతూ బాధపడతాడు రిషి. కానీ మనం ఓడిపోలేదని రిషిని ఓదార్చుతుంది. మినిస్టర్ మిమ్మల్ని కలవడానికి రమ్మన్నాడని రిషితో చెబుతుంది వసుధార=. మినిస్టర్ దగ్గరికి వెళ్లగానే కంగ్రాచ్యులేషన్స్ మెడికల్ కాలేజీ ఎండీ అంటూ మినిస్టర్ రిషితో అనగానే నేటి గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ముగిసింది.