Kesari Phirni Recipe : కేసరి ఫిర్ని.. అన్నపూర్ణా దేవికి నైవేద్యంగా పెట్టేయండి..
Kesari Phirni Recipe : కేసరి ఫిర్ని. ఇది పేరుకు తగ్గట్లుగానే కేసరితో చేస్తాము. ప్రతి పండుగ సమయంలో బియ్యంతో చేసిన ఈ అందమైన స్వీట్‌ను దేవతలకు నైవేద్యంగా పెడతారు. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Kesari Phirni Recipe : ఈరోజు నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు అన్నపూర్ణ దేవి అవతారంలో కనిపిస్తారు. ఈరోజు అమ్మవారికి బియ్యంతో చేసే కేసరి ఫిర్ని స్వీట్ నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారు కూడా సంతోషంగా ఉంటారు. పైగా పిల్లలనుంచి పెద్దల వరకు అందరూ దీనిని హ్యాపీగా లాగించేస్తారు. ఈ అందమైన స్వీట్‌ని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కేసరి ఫిర్ని తయారికి కావాల్సిన పదార్థాలు
* బియ్యం - 75 గ్రాములు
* పాలు - 300 మి.లీ
* పంచదార - 30 గ్రాములు
* కుంకుమపువ్వు - కొంచెం
* ఏలకుల పొడి - చిటికెడు
* రోజ్ వాటర్ - కొన్ని చుక్కలు
* బాదం, పిస్తాలు - గార్నిష్ కోసం కొన్ని (తురిమి పెట్టుకోవాలి)
తయారీ విధానం
ముందుగా ఒక టీస్పూన్ గోరువెచ్చని పాలలో కుంకుమపువ్వు నానబెట్టండి. బియ్యాన్ని సుమారు గంటసేపు నీటిలో నానబెట్టండి. ఆ నీటిని వంపేసి మెత్తగా రుబ్బుకోవాలి. పేస్ట్ మరీ ముతకగా ఉండకూడదు. ఇప్పుడు ఓ పెద్ద పాన్ తీసుకుని దానిలో పాలు, పంచదార, బియ్యం పేస్ట్ వేసి మరిగించాలి.
మిశ్రమం మందంగా, క్రీముగా మారిన తరువాత.. బాగా కలిపి మరోసారి ఉడికించాలి. దానిలో ఇప్పుడు కుంకుమ పువ్వు, యాలకులు వేసి బాగా కలపాలి. స్టౌవ్ ఆఫ్ చేసి.. దానిలో రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. అమ్మవారికి డ్రైఫ్రూట్స్ అలంకరించి నైవేద్యంగా సమర్పించాలి. మీరు తినాలనుకుంటే.. అది చల్లారే వరకు 2 గంటలు ఫ్రిజ్‌లో ఉంచండి. బాదం, పిస్తాలతో సర్వ్ చేసుకుని హ్యాపీగా లాగించేయండి.
సంబంధిత కథనం