Navaratri Annapurna Devi : దేవి నవరాత్రి నాల్గవరోజు.. అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనం-devi navaratri durga mata avatram of third day is annapurna devi ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Navaratri Annapurna Devi : దేవి నవరాత్రి నాల్గవరోజు.. అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనం

Navaratri Annapurna Devi : దేవి నవరాత్రి నాల్గవరోజు.. అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనం

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 29, 2022 04:30 AM IST

Navaratri Annapurna Devi Darshanam : నవరాత్రుల్లో భాగంగా.. అమ్మవారు నాలుగవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. నవరాత్రుల్లో నాలుగవ రోజు చాలా విశేషమైనదని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. అయితే దేవీ నవరాత్రులో ప్రాంతాలను బట్టి అమ్మవారిని అలంకరిస్తారని ఆయన పేర్కొన్నారు.

అన్నపూర్ణాదేవి
అన్నపూర్ణాదేవి

Navaratri Annapurna Devi Darshanam : దేవీ నవరాత్రులలో నాలుగవ అలంకరణ ఎంతో ప్రాధాన్యత ఉన్న అలంకరణ. సృష్టిలో ప్రతి ప్రాణికి ఆహారం అవసరం. ఈ ఆహారమును ప్రసాదించే దేవి అన్నపూర్ణాదేవి. అమ్మవారి అవతారాల్లో నాలుగవ అవతారము అన్నపూర్ణాదేవి. నిన్న గాయత్రి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు.. నేడు అన్నపూర్ణాదేవిగా భక్తులకు కనిపిస్తారు. ఆశ్వయుజ మాస శుక్ల పక్ష చవితి రోజున కొన్ని ప్రాంతాలలో అమ్మవారిని కూష్మాండదేవిగా పూజిస్తారు. అయితే విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని.. శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరించి పూజిస్తారు.

శ్రీ అన్నపూర్ణాదేవి అవతారములో.. అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రము సమర్పిస్తారు. పాయసం, రవ్వకేసరి నైవేద్యంగా అందిస్తారు. శక్తి ఆరాధన అంటే అమ్మవారైన సరస్వతి, లక్ష్మీ, దుర్గాదేవిని ఆరాధించడమే. శక్తి ఆరాధనల కోసం శరన్నవరాత్రులకు మించినటువంటి రోజు మరొకటి లేదు.

దేవీ భాగవతం ప్రకారం..

పూర్వం మధుకైటంబులు అనే రాక్షసులను వధించటానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణువుని నిద్రలేపడం, యోగనిద్ర నుంచి లేచిన విష్ణువు కొన్ని వేల సంవత్సరాలు ఆ రాక్షసులతో యుద్ధం చేశారు. అయినా విష్ణువు వారిని జయించలేకపోయారు. ఆ పరిస్థితిని గమనించిన మహాదేవి ఆ మధుకైటంబు రాక్షసులను మోహపూరితులను చేసింది. దాంతో వారు మహావిష్ణువును మెచ్చుకుని నీకు ఏ వరం కావాలి అని అడిగారు. శ్రీహరి వారి మరణాన్ని వరంగా అడుగుతారు. దానితో ఆ రాక్షసులు శ్రీహరి చేతిలో తమ మరణం తధ్యమని గ్రహించి తమను నీరు లేనిచోట చంపమని కోరుతారు.

అంతటితో శ్రీ మహావిష్ణువు వారిని పైకెత్తి భూఅంతరాలలో సంహరించు సమయంలో.. మహామాయ పదితలలతో, పది కాళ్లతో, నల్లని రూపుతో మహాకాళిగా ఆవిర్భవించి శ్రీ మహావిష్ణువుకు సహాయపడింది. ఈ విధముగా మహా మాయ అయిన అమ్మవారు.. మహావిష్ణువుతో కలిసి రాక్షస సంహారం చేశారు. కంస సంహారమునకు సహాయపడుటకై నందా అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణుడికి సహాయపడ్డారు అమ్మవారు. సింహవాహినిగా మహిసాసురుని సరస్వతీ రూపిణిగా సుబ, నుసుంబులను ఛండ ముండులను సంహరించిన ఛాముండి, లోకాలను కరువునుంచి రక్షించినందుకు శాఖాంబరి, దుర్గుడు అనే రాక్షసుడిని సంహరించినందుకు దుర్గగా ఇలా నవరూపాలను అమ్మవారు అవతారాలుగా చెప్తారు.

WhatsApp channel

సంబంధిత కథనం