Navaratri Gayatri Devi : దేవి నవరాత్రి మూడవరోజు.. గాయత్రిదేవిగా అమ్మవారి దర్శనం..
Navaratri Gayatri Devi Darshanam : నవరాత్రుల్లో భాగంగా.. అమ్మవారు మూడవ రోజు శ్రీ గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. నవరాత్రుల్లో మూడవ రోజు చాలా విశేషమైనదని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. అయితే దేవీ నవరాత్రులో ప్రాంతాలను బట్టి అమ్మవారిని అలంకరిస్తారని పేర్కొన్నారు.
Navaratri Gayatri Devi Darshanam : దేవీ నవరాత్రులలో మూడవరోజు చాలా విశేషమైనది. ఆశ్వయుజ మాస శుక్ల పక్ష తదియ రోజున అమ్మవారిని శ్రీ గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా శ్రీ గాయత్రీదేవి అమ్మవారికి గచ్చకాయ రంగు వస్త్రము (గ్రే కలర్) తో అలంకరణ చేస్తారు.
ఆశ్వయుజ మాస శుక్ల పక్ష తదియ రోజున అమ్మవారు.. శ్రీ గాయత్రీదేవి రూపంలో పూజలు అందుకుంటారు. భక్తులు అమ్మవారికి గారెలు, కొబ్బరి అన్నం, రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పిస్తారు. గాయత్రీదేవి అమ్మవారిని ఈరోజు గాయత్రీ అష్టోత్తర శతనామావళితో పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఈ రోజు అమ్మవారికి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిదని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలిపారు.
సనాతన ధర్మంలో దైవారాధనలు మూడు రకముగా ఉండేవి. అవి ఏంటంటే..
1. శివారాధన
2. విష్ణు ఆరాధన
3. శక్తి ఆరాధన.
శక్తి ఆరాధన అంటే అమ్మవారైన సరస్వతి, లక్ష్మీ, దుర్గాదేవిని ఆరాధించడమే. శక్తి ఆరాధనల కోసం శరన్నవరాత్రులకు మించినటువంటి రోజు మరొకటి లేదు. దేవీ భాగవతం ప్రకారం.. పూర్వం మధుకైటంబులు అనే రాక్షసులను వధించటానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణువుని నిద్రలేపడం, యోగనిద్ర నుంచి లేచిన విష్ణువు కొన్ని వేల సంవత్సరాలు ఆ రాక్షసులతో యుద్ధం చేశారు. అయినా విష్ణువు వారిని జయించలేకపోయారు.
మధుకైటంబులను సంహరించిన అమ్మవారు
ఆ పరిస్థితిని గమనించిన మహాదేవి ఆ మధుకైటంబు రాక్షసులను మోహపూరితులను చేసింది. దాంతో వారు మహావిష్ణువును మెచ్చుకుని నీకు ఏ వరం కావాలి అని అడిగారు. శ్రీహరి వారి మరణాన్ని వరంగా అడుగుతారు. దానితో ఆ రాక్షసులు శ్రీహరి చేతిలో తమ మరణం తధ్యమని గ్రహించి తమను నీరు లేనిచోట చంపమని కోరుతారు.
అంతటితో శ్రీమహావిష్ణువు వారిని పైకెత్తి భూఅంతరాలలో సంహరించు సమయంలో.. మహామాయ పదితలలతో, పది కాళ్లతో, నల్లని రూపుతో మహాకాళిగా ఆవిర్భవించి శ్రీ మహావిష్ణువుకు సహాయపడింది. ఈ విధముగా మహా మాయ అయిన అమ్మవారు.. మహావిష్ణువుతో కలిసి రాక్షస సంహారం చేశారు. కంస సంహారమునకు సహాయపడుటకై నందా అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణుడికి సహాయపడ్డారు అమ్మవారు. సింహవాహినిగా మహిసాసురుని సరస్వతీ రూపిణిగా సుబ, నుసుంబులను ఛండ ముండులను సంహరించిన ఛాముండి, లోకాలను కరువునుంచి రక్షించినందుకు శాఖాంబరి, దుర్గుడు అనే రాక్షసుడిని సంహరించినందుకు దుర్గగా ఇలా నవరూపాలను అమ్మవారు అవతారాలుగా చెప్తారు.
సంబంధిత కథనం