Paneer Pepper Fry : పనీర్ పెప్పర్ ఫ్రై ఇంట్లోనే చేసుకోండి.. 10 నిమిషాల్లో రెడీ..
Paneer Pepper Fry : పనీర్ రెసిపీలు చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే పనీర్ పెప్పర్ ఫ్రై కొత్తగా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది.
పనీర్ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ. పనీర్‌తో చేసిన వంటకాలు చాలా రుచిగానూ, ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పనీర్ చిల్లీ, పనీర్ మంచూరి, పనీర్ శాండ్‌విచ్, పనీర్ పరాటా, బటర్ పనీర్ మసాలా, పనీర్ గీ రోస్ట్ మొదలైనవి నోరూరిస్తాయి.
పనీర్ పేపర్ ఫ్రై రుచికి చాలా బాగుంటుంది. పనీర్‌తో చేసిన ఈ పెప్పర్ ఫ్రై మసాలా నోరూరించే వంటకం. అంతే కాకుండా పరోటా, చపాతీ, అన్నం, పలావ్‌తో సహా అన్ని రకాల వంటకాలతోనూ తినవచ్చు. ఈ రెసిపీ చేయడానికి ఎక్కువ సమయం పట్టద్దు. ఈజీగా తయారు చేసుకోవచ్చు.
మీ ఖాళీ సమయంలో మంచి వంటకం చేయాలనుకుంటే, ఈ పనీర్ పెప్పర్ ఫ్రైకి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. దీన్ని చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. పనీర్ పెప్పర్ ఫ్రై తయారు చేయడానికి ఏ పదార్థాలు అవసరం? తయారీకి ఎంత సమయం పడుతుందో చూద్దాం.
పనీర్ పెప్పర్ ఫ్రైకి కావలసిన పదార్థాలు
పనీర్ - 200 గ్రాములు, ఉల్లిపాయ (తరిగిన) - 3, పచ్చిమిర్చి - 4, క్యాప్సికమ్- 1/2, నల్ల మిరియాలు - 1 స్పూన్, జీలకర్ర - 1/4 tsp, లవంగాలు - 1, దాల్చిన చెక్క - 1, కొత్తిమీర గింజలు - 1/2 tsp, ఎర్ర మిర్చి - 3, కరివేపాకు - 2 టేబుల్ స్పూన్లు, పసుపు పొడి - 1/4 tsp, వంట నునె సరిపోయేంత, రుచికి ఉప్పు
పనీర్ పెప్పర్ ఫ్రై తయారీ విధానం
ముందుగా స్టౌ మీద పాత్రలో నూనె వేసి ఎండుమిర్చి, జీలకర్ర, లవంగాలు, నల్ల మిరియాలు, కొత్తిమీర, కరివేపాకు వేసి వేయించాలి. చిన్న మంటలో 2 నిమిషాలు వేయించి, తీసివేసి మరో పాత్రలో ఉంచి చల్లారనివ్వాలి.
తర్వాత అదే పాత్రలో నూనె వేసి ఉల్లిపాయలు వేయించాలి. ఇప్పుడు ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించాలి. అందులో అరకప్పు క్యాప్సికమ్ వేసుకోవాలి. సన్నటి మంట మీద ఉడికించాలి. మరో వైపు వేయించిన మసాలా దినుసులను మిక్సీ జార్ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
తర్వాత స్టౌ మీద ఒక పాత్రలో రుబ్బిన మసాలా దినుసులు వేసి కలపాలి. అందులో పనీర్ వేసి కలపాలి. పసుపు వేసుకోవాలి. 2 నిమిషాలు వేయించాలి.
పనీర్‌ను చిన్నపాటిగా చేసుకోవాలి. లేదా చతురస్రంలో కూడా ఉంచుకోవచ్చు. పనీర్ త్వరగా ఉడుకుతుంది. దీన్ని బాగా కలపండి, 2 నుండి 3 నిమిషాలలో స్టవ్ ఆఫ్ చేయండి. మీకు నచ్చే రుచికరమైన పనీర్ పెప్పర్ ఫ్రై రుచికి సిద్ధంగా ఉంటుంది.