Jonna Dosa Recipe : హెల్తీ, టేస్టీ జొన్నదోశను.. ఇలా ఈజీగా చేసేయండి..
Jonna Dosa Recipe : మీ బ్రేక్ ఫాస్ట్ హెల్తీగా, టేస్టీగా ఉండాలంటే.. మీరు జొన్న దోశను ట్రై చేయవచ్చు. జొన్న రొట్టె హెల్తీ అని తెలుసుకానీ.. దోశ ఏంటి అనుకుంటున్నారా? మరి ఈ సింపుల్ రెసిపీ ఎలా చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Jonna Dosa Recipe : హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి అనుకునేవారికి.. జొన్నపిండితో చేసే దోశ చాలా మంచిది. మధుమేహం ఉన్నవారు కూడా దీనిని హ్యాపీగా లాగించవచ్చు. పైగా దీనిని తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. కేవలం 15 నిముషాల్లో దీని బేటర్ తయారు చేసుకోవచ్చు. పైగా హెల్తీ, టేస్టీ ఫుడ్ కూడా. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* జొన్న పిండి - 1.5 కప్పు
* సాల్ట్ - తగినంత
* నీళ్లు - 4 కప్పులు
* ఉల్లిపాయ - 1 (చిన్న ముక్కలుగా తరగాలి)
* కొత్తిమీర - 2 స్పూన్స్ (తరిగినది)
* కరివేపాకు - 7 రెమ్మలు (చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
* జీలకర్ర - 1 స్పూన్
* మిరియాలు - అర స్పూన్ (పొడి)
తయారీ విధానం
ముందుగా జొన్నపిండిని తీసుకుని.. దానిలో సాల్ట్, నీళ్లు వేసి బాగా కలపాలి. ఉండలు లేకుండా పిండిని బాగా కలపాలి. దానిలో ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, మిరియాల పొడి వేసి బాగా కలిపి.. పక్కన ఉంచాలి. పది నిముషాల తర్వాత.. పిండిని మళ్లీ బాగా కలిపి.. దోశ వేసుకోవాలి. దీనిని టమాట చట్నీతో లాగిస్తే.. ఆహా అంటారు.
సంబంధిత కథనం