Mixed Dal Dosa : ఈ రకం దోశ ఎప్పుడైనా తిన్నారా? ట్రై చేయండి.. హెల్తీ కూడా
Mixed Dal Dosa Recipe : దోశలు ఎన్నో రకాలు.. మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. నచ్చినవవి వేసుకోవచ్చు. వద్దనుకంటే.. వదిలేయెుచ్చు. అయితే ఎప్పుడైనా ఓన్లీ పప్పులతో వేసిన దోశ ట్రై చేశారు. బాగుంటుంది.. ఓసారి ట్రై చేయండి.
మిక్స్డ్ దాల్ దోశ.. ఎప్పుడైనా దీన్ని తిన్నారా? 4 రకాల పప్పు ధాన్యలతో కలిపి దోశ వేసుకోవచ్చు. హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ ఇది. ఆరోగ్యమైనది తినాలి అనుకున్నా.., ప్రోటీన్ ఆహారం పెంచుకోవాలని అనుకున్నా.. ఇది బెస్ట్ ఆప్షన్. నచ్చిన చట్నితో లాగించేయోచ్చు. ఈ పప్పు దోశలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
దోశకు కావలసినవి
1.5 కప్పు బియ్యం, 1/4 కప్పు పెసరు పప్పు, 1/4 కప్పు కందిపప్పు, 1/4 కప్పు మినుపపప్పు, 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 1/3 టీస్పూన్ పసుపు పొడి, 1.5 అంగుళాల అల్లం, 5 ఎండు మిరపకాయలు, 3 పచ్చిమిర్చి, 1/2 కప్పు తాజా కొత్తిమీర, కరివేపాకు, రుచికి తగినంత ఉప్పు, 1/4 కప్పు నూనె
తయారీ విధానం
బియ్యం, పప్పులను నాలుగైదు గంటలు నానబెట్టాలి. తర్వాత వాటిని మిక్సీ గిన్నెలోకి తీసుకుని.. మిర్చి, అల్లం, కరివేపాకు వేసి కొంత నీరుతో గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోవద్దు. తర్వాత ఇందులో ఉప్పు, పసుపు, ఇంగువ, కొత్తమీర వేసి కలుపుకోవాలి. తర్వాత రెండు గంటలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ వేడి చేసి, దాని మీద కొద్దిగా నూనె పోసి దోశ వేసుకోండి.
దోశను సన్నగా వేసుకోవచ్చు. కావాలంటే.. మందంగా కూడా వేసుకోవచ్చు. రెండు వైపులా గోధుమ రంగు వచ్చే వరకు దోశ కాల్చుకోవాలి. మిక్స్‌డ్ దాల్ దోశలో ఏదైనా చట్నీ వేసుకుని తినొచ్చు. బాగా రుచిగా, ఆరోగ్యకరంగా ఉండేందుకు.. క్యారెట్, క్యాబేజీ, పాలకూర, పచ్చిబఠానీలు మొదలైన వాటిని కలిపి వేసుకోవచ్చు.
దోశలను కేవలం బియ్యం పిండితో చేస్తే.. అందులో కేవలం కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి. ప్రోటీన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉండే పప్పులు, కాయధాన్యాలు కలిపి చేసుకుంటే మంచి ఆహారం అవుతుంది. మూడు నాలుగు రకాల పప్పుల మిశ్రమంతో మిక్స్‌డ్ దాల్ దోశ చేసుకోవచ్చు.