Tips To Stay Calm । పండగ వేళ ప్రశాంతంగా ఉండేందుకు చిట్కాలు!-tips to relieve from stress and stay clam during festivities ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tips To Stay Calm । పండగ వేళ ప్రశాంతంగా ఉండేందుకు చిట్కాలు!

Tips To Stay Calm । పండగ వేళ ప్రశాంతంగా ఉండేందుకు చిట్కాలు!

HT Telugu Desk HT Telugu
Oct 24, 2022 01:19 PM IST

పండగ వేళ వివిధ రకాల పనులతో గందరగోళం నెలకొంటుంది. దీంతో మానసిక ప్రశాంతత లోపిస్తుంది. పండగను అద్భుతమైన రీతిలో ఆస్వాదించేందుకు మానసిక నిపుణులు అందించిన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి, అవేంటో చూడండి.

Tips to stay calm
Tips to stay calm (Pixabay)

పండగల వేళ చాలా రకాల పనులు ఉంటాయి. పండగ కోసం ఇంటిని సిద్ధం చేసుకోవాలి, షాపింగ్ చేయడం, ఉద్యోగస్తులకు సెలవు కోసం అదనపు పని చేయాలి, ట్రాఫిక్ పద్మవ్యూహాలను అదుపులో ఉంచుకోవాలి, ఖర్చులను నియంత్రించుకోవాలి, ఇవన్నీ చూసుకునేసరికి సగం పండగ అందులోనే గడిచిపోతుంది. తీరికగా, ప్రశాంతంగా పండగ చేసుకునే రోజులు ఇప్పుడు లేవు. ఇలాంటి అనుభవాలు చాలా మందికి ఎదురవుతున్నాయి. నిజానికి ఒకేసారి ఇన్ని రకాల ఆలోచనలతో ఒత్తిడి ఎక్కువవుతుంది. ఇది మానసిక శ్రేయస్సును దెబ్బతీస్తుంది. కాబట్టి మనస్సును వీలైనంత ప్రశాంతంగా ఉంచుకోవాలి, అప్పుడే పండగ సంబరాలను ఆస్వాదించగలుగుతాం, పండగ వేళ ఉల్లాసంగా ఉండగలుతాం.

Tips To Stay Calm- ప్రశాంతంగా ఉండేందుకు చిట్కాలు

ఈ బిజీ కాలంలో మరింత ప్రశాంతంగా ఉండటానికి వివిధ మార్గాలు ఉన్నాయి.'రౌండ్ గ్లాస్' సంస్థలో గ్లోబల్ హెడ్, మానసిక ఆరోగ్య నిపుణురాలు అయిన ప్రకృతి పొద్దార్, పండగ సంబంధిత గందరగోళంలో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి? ఆనందంగా, ప్రశాంతంగా ఎలా గడపాలో కొన్ని పద్ధతులను వివరించింది. అవి ఇప్పుడు తెలుసుకుందాం.

1. మీ శ్వాసపై దృష్టి పెట్టండి:

మీ నాడీ వ్యవస్థను నియంత్రించడానికి, మీపై మీకే కరుణను కలిగించుకోవడానికి బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు చేయండి. నెమ్మదిగా నాలుగు సెకన్ల పాటు శ్వాస తీసుకోండి. ఏడు సెకన్ల పాటు ఆ శ్వాసను బిగపట్టండి. ఆ తర్వాత నెమ్మదిగా శ్వాస వదలండి. అవసరమైనన్ని సార్లు ఈ వ్యాయామాన్ని పునారావృతం చేయండి. ఇలా లోతైన ఉచ్ఛ్వాసాలు, నిశ్వాసలను తీసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు శాంతపరుచుకోగలుగుతారు.

2. మీ భావోద్వేగాలను అంగీకరించండి:

బలమైన భావోద్వేగాలు తుఫానులా మనపైకి వస్తాయి, ఇలాంటి సందర్భాల్లో స్పష్టంగా ఆలోచించడం కష్టమవుతుంది. మన భావోద్వేగాలను గమనించడం ద్వారా, వాటిని నియంత్రించడం సాధ్యపడుతుంది. ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు మీ శరీరం ఎలా స్పందిస్తుందో గుర్తించడం ముఖ్యం. కొద్దిసేపు వాటి నుంచి బయటకు రండి, కాసేపు చిన్న విరామం తీసుకోండి.

3. పలు రకాల ఆలోచనలు వద్దు

ఒకేసారి అన్నింటి గురించి ఆలోచించకుండా.. ఒక సమయంలో ఒకే విషయంపై దృష్టి కేంద్రీకరించండి. అప్పుడు మానసిక ఒత్తిడి తగ్గుతుంది, పనులను సమర్థవంతంగా పూర్తి చేయగల సామర్థ్యం పెరుగుతుంది. కొన్ని రోజుల పాటు, ఒక సమయంలో ఒక పనిని మాత్రమే చేయడం అభ్యాసం చేయండి. మల్టీటాస్కింగ్ వైపు వెళ్లకుండా ఉండడి. అది మీ ఒత్తిడి స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుందో చూడండి.

4. మీకేం కావాలో తెలుసుకోండి

గందరగోళంలో మీకు సంబంధించి ముఖ్య విషయాలను మరిచిపోతారు. ప్రస్తుతం మీకు ఉన్న అవసరం ఏంటి? నాకేం కావాలి అని మీరే ప్రశ్నించుకోండి? నా కోసం నేను ఏమి చేయగలను? దాహం వేస్తే ఒక గ్లాస్ నీరు తాగండి, ఆకలేస్తే తినండి, విసుగొస్తే స్నేహితుడికి కాల్ చేయండి, లేదా ఒంటరిగా బాత్రూంలో రెండు నిమిషాలు గడపండి. ఇది మీ నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది.

5. కృతజ్ఞతా విరామాలు తీసుకోండి

ఒత్తిడికి గురైనప్పుడు, మీరు కృతజ్ఞతగా భావించే మూడు విషయాల గురించి ఆలోచించండి. అంటే మీకు సంబంధించి మీరు ఏ విషయంలో సంతృప్తిగా ఉన్నారో, ఏది మీకు ఆనందకరమైన విషయమో వాటి గురించే ఆలోచించండి. మీరు చేసే ప్రతి పనిలో, మీరు మీ వంతు కృషి చేస్తున్నారని గుర్తుంచుకోండి, అది సరిపోతుంది. అన్ని చింతలను, ప్రతికూల భావోద్వేగాలను వదిలేయండి. ఈ చేతన ప్రక్రియ మీ మెదడులోకి డోపమైన్ (హ్యాపీ హార్మోన్)ను విడుదల చేస్తుంది, అది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం